బంజారా మేళా | Variety Dressing materials offered for City people | Sakshi
Sakshi News home page

బంజారా మేళా

Published Sat, Aug 2 2014 1:39 AM | Last Updated on Fri, Aug 3 2018 3:04 PM

బంజారా మేళా - Sakshi

బంజారా మేళా

సరికొత్త వస్త్రాభరణ శ్రేణులు నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల చీరలు... వెరైటీ నగలు మగువ మనసు దోస్తున్నాయి. రామ్‌కోఠి కచ్చిభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘బంజారా మేళా’లో ఇలాంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి. శనివారం కూడా కొనసాగే ఈ మేళాలో వీటితోపాటు గృహోపరకరణ వస్తువులు, యాక్ససరీస్ కొలువుదీరాయి. అందాల తార ఇషికాసింగ్ (హృదయ కాలేయం) ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా ఇిషిక ‘సిటీప్లస్’తో ముచ్చటించింది.
 
‘నాన్‌వెజ్ ఫుడ్ ముట్టను. ఓ ప్రాణిని చంపి తినడం నాకు ఇష్టం ఉండదు. మా ఫ్యామిలీ అంతా పక్కా శాకాహారులు. మాది రాజస్థాన్. అమ్మానాన్న ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడే కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ చదివా. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. మోడలింగ్‌పై ఆసక్తి. హృదయ కాలేయం సినిమాలో అవకాశం వచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. ఇప్పుడు మహేశ్ కత్తి దర్శకత్వంలో పెసరట్టు సినిమాలో చాన్స్ వచ్చింది. తమిళంలో పెరుమాన్, పంజాబ్‌లో సెహద్, ఇంగ్లిష్‌లో వెయిటింగ్ ఇన్ వెల్డర్‌నెస్ మూవీస్ చేశా’ అంటూ చెప్పుకొచ్చింది ఇషిక.
 - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement