కొంగొత్త కొంగులు | Kongotta Congunadu | Sakshi
Sakshi News home page

కొంగొత్త కొంగులు

Published Tue, Dec 23 2014 12:17 AM | Last Updated on Mon, Oct 1 2018 1:12 PM

కొంగొత్త కొంగులు - Sakshi

కొంగొత్త కొంగులు

ఫ్యాషన్ వీధుల్లో రోజుకో మోడల్ శారీస్ ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఒక్కో టైమ్‌లో ఒక్కో శారీస్ హవా నడుస్తుంటుంది. 70, 80ల్లో వాణిశ్రీ చీరలు పాపులర్. ఇప్పుడు చీరలు చుట్టుకునే కథానాయికలు కరువైనా.. ఫ్యాషన్ డిజైనర్లు మాత్రం కొంగొత్త హంగులు చుట్టుకున్న  శారీస్ మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నారు. కొంగునే కాన్వాస్‌గా మారుస్తూ రంగురంగుల చిత్రాలు పరుస్తున్నారు. పల్లూపై అద్దిన చిత్రకళ మగువల మనసులను కట్టిపడేస్తున్నాయి.
 
ఒకప్పుడు స్కూల్‌కు బై చెప్పి.. కాలేజీలో ఎంటర్ అయిన యువతులు మాత్రమే ఫ్యాషన్ మంత్రం పఠించేవారు. కానీ ఇప్పుడు అప్పుడే స్కూల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బుజ్జాయి నుంచి.. ఆ చిన్నారిని స్కూల్ దగ్గర దిగబెట్టే బామ్మ వరకూ కొత్త ఫ్యాషన్స్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వయసు పైబడిన వారైనా సరే డిజైనర్ వేర్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కిక్‌తో ఫ్యాషన్ డిజైనర్లు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ముందుకొస్తున్నారు.
 
కళలు కల నేత..

తరతరాలుగా వస్తున్న చీరకు నయా ఫార్ములా కొంగులను అతికించి అతివలు ఫ్యాషన్ వలలో చిక్కుకునేలా చేస్తున్నారు డిజైనర్లు. కొంగలకే కాదు చుడీదార్లు, లాంగ్ స్కర్ట్స్, స్కార్ఫ్‌ల నుంచి హ్యాండ్ పౌచ్ వరకు ఇలా రకరకాల మెటీరియల్స్ మీద వాళ్లు అభిమానించేవారి చిత్రాలను, రామాయణ, మహాభారత చిత్రాలను సైతం దించేస్తున్నారు. ఇతిహాసాల్లోని ఘట్టాలను, రాధాకృష్ణుల రమణీయ దృశ్యాలను పల్లూపై పరుస్తున్నారు. సరికొత్తగా వస్తున్న ఈ టైప్ శారీలు అన్ని వయసుల ఆడవారూ ఆదరిస్తున్నారు.
 
ఫ్యాషన్‌లో ట్రెడిషన్..


హైదరాబాద్ ఫ్యాషన్ రోజురోజుకూ అప్‌డేట్ అవుతోంది. ఇతర మెట్రో సిటీలతో ట్రూ కాంపిటేషన్‌గా నిలుస్తోంది. ఇక్కడి జనాలు ట్రెడిషన్‌ను ఫాలో అవుతూనే నయా ఫ్యాషన్స్‌కు స్వాగతం పలుకుతున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి తమ అభిరుచులను మార్చుకుంటున్నారు. యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఉండే కాస్ట్యూమ్స్‌కు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. బ్రైడల్ వేర్, లెహంగాస్, చోలీస్ ఇలా అన్ని రకాల వేరింగ్స్ ఇన్నోవేటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టుగానే ఫ్యాషన్ డిజైనర్లు తమ క్రియేటివిటీతో అదరగొడుతున్నారు.
 -కీర్తిరెడ్డి, ఫ్యాబ్రిక్ నేషన్ ఫ్యాషన్ డిజైనర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement