ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్,సంజనా బాత్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియాలో సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంజనా బాత్రా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాదాపు పెళ్లైన అయిదేళ్ల తరువాత తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సంజన బాత్రా , అవ్రాల్ బెరి దంపతులకు అభినందనలు తెలిపారు.
గర్భధారణను అత్యంత హృద్యంగా
సంజన ,ఆమె భర్త అవ్రాల్ బెరి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఒక అద్భుతమైన రీల్‌ను పంచుకున్నారు. ఇందులో వారి పెట్ డాగ్స్‌తో పాటు తాము తల్లిదండ్రులను కాబోతు న్నామనే విషానే అందంగా ప్రకటించారు. అవర్ ప్యాక్ ఈజ్ గ్రోయింగ్ అనే క్యాప్షన్‌తో తమ కుటుంబంలోకి మరో ప్రాణం రాబోతోందనే విషయాన్ని వెల్లడించారు. సంజన ఒక ఫ్లోవీ గౌనులో మెరుస్తూ, తన బేబీ బంప్‌ను అప్యాయంగా పట్టుకుంది. తీగలపై వేలాడుతున్న బేబీ దుస్తులు మరింత అద్భుతంగా కనిపించాయి. సెలబ్రిటీలు,అభిమానులు కాబోయే తల్లిదండ్రులపై ప్రేమను కురిపిస్తున్నారు.
ముందుగా అభినందనలు తెలిపినవారిలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఒకరు. ఆమె "అభినందనలు బాచీ" కామెంట్ చేసింది. ఇంకా హీరోయిన్ శిల్పా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇషితా మంగళ్ , ఫ్యాషన్ కన్సల్టెంట్ స్టైలిస్ట్ స్మృతి సిబల్ ,ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింధ్వాని తదితరులు లవ్ ఎమోజీలతో తమ సంతోషాన్ని ప్రకటించారు.
ముంబైకి చెందిన సంజనా యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది. క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన ఆమెను ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించేలా చేసింది. బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్‌కి ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకు పనిచేసింది. అలా ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులకు ప్రముఖులకు స్టైలింగ్ చేసింది. అలాగే పద్మావత్, గల్లీ బాయ్ వంటి చిత్రాలలో ఆమె చేసిన కృషికి ఆమె ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంది. వోగ్ ఇండియా, హార్పర్స్ బజార్ ఇండియా, ఎల్లే ఇండియాతో సహా అనేక మ్యాగజైన్‌లలో స్టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంజన బాత్రా , కెన్నెల్ కిచెన్ ఫౌండర్ అవ్రాల్ బెరి పదేళ్ల పరిచయం తరువాత2020లో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment