సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment