Family issues
-
భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను దారుణంగా..
నిజామాబాద్: భార్యతో గొడవ పడొద్దని మందలించిన అన్నను తమ్ముడు గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపిన ఘటన కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొతంగల్‌లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాత పొతంగల్‌కు చెందిన దిమ్మెల గోవింద్ (58), విఠల్ అన్నాదమ్ముళ్లు. గోవింద్ మండల కేంద్రంలో క్షౌ రశాల నడుపుతూ జీవిస్తున్నాడు. విఠల్ తన భార్యతో తరచూ గొడవపడుతుండడంతో అన్న గోవింద్ మందిలించేవాడు. ఈ క్రమంలో గోవింద్‌పై విఠల్ కక్షపెంచుకున్నాడు. రోజులాగే గురువారం పనిపూర్తి చేసుకొని రాత్రి ఇంటికి చేరుకున్న గోవింద్‌ను విఠల్ గొడ్డలితో నరికి హతమర్చాడు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ జయేశ్‌రెడ్డి, ఏఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య విఠల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తనను మందలించినందుకు గోవింద్‌ను విఠల్ హతమర్చాడా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇవి చదవండి: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒక్కసారిగా.. -
నాన్నా.. ఉరేసుకుని చనిపోతున్నా..
పెన్‌పహాడ్: ‘నాన్నా.. బాధలు భరించలేకపోతున్నా.. అందుకే ఉరేసుకుని చనిపోతున్నా’అని తండ్రికి ఫోన్లో చెప్పి ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. పెన్‌పహాడ్ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన అర్రూరి జానకిరాములు, జానకమ్మ దంపతుల కుమారుడు సైదులు (41) 2009లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఆయనకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన పార్వతితో వివాహం జరిగింది. వీరికి హైదరాబాద్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న సాయి భవన్, మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన సాయిపూజిత సంతానం. సైదులు ప్రస్తుతం సూర్యాపేటలో ఉద్యోగం చేస్తూ అక్కడే అంజనాపురి కాలనీలో భార్యతో కలసి ఉంటున్నాడు. పది రోజుల క్రితం గొడవ కొంతకాలంగా సైదులు కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం గొడవ తారస్థాయికి చేరడంతో పార్వతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సైదులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్వగ్రామంలోని పొలంవద్దనుంచి తండ్రికి ఫోన్ చేసి ఉరేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. జానకిరాములు ఉదయం గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. సమీపంలోని రైతులు వచ్చి సైదులును కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ నాగేశ్వర్రావు, ఎస్ఐ వెంకన్నగౌడ్ ఇతర పోలీస్ సిబ్బంది పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. -
కుటుంబ కలహాలు.. బాలుడి పీక నొక్కి చంపిన తాత?
సాక్షి, ప.గో జిల్లా: సొంత తాతయ్య తన మనువడిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఘటన పెంటపాడు మండలం మీనవల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం మీనవల్లూరుకి చెందిన పోకల వెంకట కళ్యాణ్ (6) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం నుంచి కనిపించడం పోవడంతో బాలుడి తల్లి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సాయంత్రం యనమదర్రు కాలవలో అదృశ్యమైన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైంది. తాతనే బాలుడి పీక నొక్కి చంపేసి కాలవలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు,ఆస్థి తగాదాలు మధ్య తాతయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. బాలుడు తండ్రి, తాత, నానమ్మ కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాతయ్య పరార్ లో ఉండగా, బాలుడి తండ్రి నానమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం
33,500 మంది ఫాలోయెర్ల వల్ల ఒక గృహిణి ప్రాణం పోయింది. తమిళనాడులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఫాలోయెర్లు పెరగడంతో రీల్స్ చేయడంలో పడి ఇంటిని పట్టించుకోని భార్యను క్షణికోద్రేకంలో భర్త కడతేర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మహిళ రీల్స్ వద్దన్నందుకు తన అన్నలిద్దరి మీదా దాడి చేసి పోలీస్ స్టేషన్ చేరింది. రీల్స్ అనేవి మహిళల ప్రతిభను వ్యక్తం చేసే సోషల్ మీడియా సాధనాలుగా ఉన్నాయి. కాని ఏ ప్రతిభా లేకపోయినా కేవలం ఫాలోయెర్ల కోసం వెర్రిమొర్రి రీల్స్ చేసే మహిళల వల్ల కుటుంబాలకు గండాలు వస్తున్నాయి. సోషల్ మీడియా అడిక్షన్ గురించి చైతన్యం రావాల్సిన సందర్భం వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తే ఫాలోయెర్స్ వస్తారు. ఆదాయం కూడా వస్తుంది. 2000 మంది ఫాలోయెర్స్ వస్తే ‘ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్’గా గుర్తింపబడతారు. వీరు చేసిన రీల్స్ నెల రోజుల్లో 1000 మంది చూస్తే వీరికి బోనస్‌లు వస్తాయి. 10వేల మంది ఫాలోయెర్స్ ఉంటే ఒక స్థాయి... లక్ష దాటితే మరో స్థాయి. ఆ తర్వాత ప్రచారకర్తలే ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటారు. రకరకాల పద్ధతుల్లో ఆదాయం వస్తుంది కూడా. తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఈ రీల్స్ ద్వారా గుర్తింపు, గౌరవం పొందుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. ఫిట్నెస్, లైఫ్‌స్టయిల్, స్టాండ్ అప్ కామెడీ, మిమిక్రీ, హెల్త్, యోగా... ఇలా అనేక రంగాల్లో నైపుణ్యం ఉండి వాటి ద్వారా రీల్స్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారుతారు. ఈ రంగంలో కొందరు సగటు గృహిణులు, మహిళలు కూడా తమ వంటల ద్వారానో, చమత్కారమైన మాటల ద్వారానో, నృత్యాల ద్వారానో గుర్తింపు పొందుతున్నారు. అయితే తమకు ఉన్న చిన్నపాటి ప్రతిభకు కూడా కామెంట్లు, ఫాలోయెర్లు వస్తుండటంతో ఇక అదే లోకంగా మారిన వారు అవస్థలు తెచ్చుకుంటున్నారు. ఇరవై నాలుగ్గంటలు ఫోన్లో మునిగి, రీల్స్ తయారీలో నిమగ్నమయ్యి, కుటుంబాలలో కలతలకు కారణం అవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే. సాధించానని భ్రమసి చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపూరులో అమృతలింగం (38) లోకల్ మార్కెట్లో హమాలీగా పని చేస్తాడు. అతడి భార్య చిత్ర చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ముందు టిక్ టాక్, ఆ తర్వాత ఇన్‌స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టిన చిత్ర దాదాపు 35 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. దాంతో ఆమె అన్ని పనులు మాని ఈ రీల్స్ తయారీలో పడింది. అమృతలింగంకు ఇది నచ్చలేదు. ఇంటిని పట్టించుకోమని గొడవకు దిగేవాడు. అయితే రీల్స్ కింద వచ్చే కామెంట్స్ లో పొగడ్తలు నిండేసరికి చిత్ర తన ప్రతిభకు సినీ పరిశ్రమే సరైనదని భర్త మాట వినకుండా మూడు నెలల క్రితం చెన్నై చేరి వేషాలకు ప్రయత్నించసాగింది. వారం క్రితం ఒక ఫంక్షన్‌కు సొంత ఊరు వచ్చి తిరిగి చెన్నై బయలుదేరుతుండేసరికి అమృతలింగం గట్టిగా అడ్డు పడ్డాడు. చెన్నై వెళ్లకూడదని పట్టుపట్టాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో అతను చీరతో ఆమె మెడను బిగించాడు. స్పృహ తప్పేసరికి భయపడి వదిలేశాడు. కాని అప్పటికే ఆమె చనిపోయింది. వద్దు అంటే తిరుగుబాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్తి రాజ్‌పుత్ అనే యువతి ఈ రీల్స్‌కు బాగా అడిక్ట్ అయ్యింది. ఆమెకు ఇంటి విషయాలే పట్టడం లేదని సోదరులు జైకిషన్, ఆకాష్ అభ్యంతరం తెలిపారు. దాంతో ఆమె ఆ ఇద్దరు సోదరులపై దాడి చేసింది. వారు భయపడి పోలీసులను పిలిస్తే స్టేషన్లో మళ్లీ సిబ్బంది ఎదుటే సోదరులను కొట్టింది. అంతే కాదు... అడ్డుపడ్డ మహిళా పోలీసులపై దాడి చేసింది. దాంతో ఆమె కటకటాలు లెక్కించే స్థితికి వెళ్లింది. బతికున్నా లేనట్టే సోషల్ మీడియా అడిక్షన్ దాదాపుగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తాయని నిపుణులైన మానసిక వైద్యులు అంటున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సప్‌లకు అడిక్ట్ అవుతున్నారు. లైక్‌లు, షేర్లు, సబ్స్క్రయిబ్లలో పడి చదువు, ఇంటి పని, బాధ్యతలు, లక్ష్యాలు మర్చిపోతున్నారు. భార్యాభర్తల్లో ఎవరు ఎడిక్ట్ అయినా కాపురంలో కలతలు, జగడాలు వస్తున్నాయి. పిల్లలు చదువును నష్టపోతున్నారు. ఫోన్ చూడొద్దంటే అలిగి ఇళ్ల నుంచి పిల్లలు పారిపోతున్నారు. అపరిచితులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. లంఖణం దివ్యౌషధం అని పెద్దలు అన్నారు. సోషల్ మీడియా కు సంబంధించిన లంఖణాలు పెట్టడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. రోజులో కొన్ని గంటలు ఫోన్ ముట్టుకోకుండా వారంలో ఒక రోజు సోషల్ మీడియా చూడకుండా పేపర్లు, పుస్తకాలు, స్నేహితులపై ధ్యాస మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో అందరి సమ్మతంతో గౌరవాన్ని, ఆదాయాన్ని ఇచ్చే విధంగా మీడియాను వాడితే కలత లు రావు. కాని కుటుంబ సభ్యుల విముఖతను లెక్క చేయకుండా సోషల్ మీడియాకే ప్రాధాన్యం ఇస్తుంటే ఇబ్బందులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. -
పుల్లారెడ్డి మనవడు అరాచకం
-
ఖాకీ వనం.. న్యాయాలయంగా మార్చిన పోలీస్ బాస్
మలి వయస్సులో బిడ్డలు ఆదరించలేదని.. జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్తే హింసిస్తున్నాడని.. భర్త చనిపోతే మెట్టింటి వారు బయటకు నెట్టేశారని.. ఉబికి వస్తున్న కన్నీళ్లతో.. బరువెక్కిన గుండెలతో న్యాయం కోసం పోలీస్ స్పందనకు వచ్చే బాధితులకు జిల్లా పోలీస్ బాస్ బాసటగా నిలుస్తున్నారు. ఖాకీ వనాన్ని.. న్యాయాలయంగా మార్చారు. కుటుంబ సభ్యుల మధ్య భవబంధాలను, ఆప్యాయతా అనురాగాలను, కలిసి జీవించిన మధుర క్షణాలను గుర్తు చేస్తూ కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువస్తున్నారు. ఇతర ఫిర్యాదులపై పరిష్కరించ తగినవి అయితే అక్కడికక్కడే చర్యలు చేపడుతున్నారు. వ్యయప్రయాసలు పడి వచ్చే బాధితులకు ఆకలి తీరుస్తూ ఆదరిస్తూ.. పోలీసుల్లో కాఠిన్యమే కాదు.. కారుణ్యం ఉందని ఆర్తుల పాలిట ఆప్తుడయ్యాడు. సాక్షి, నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖను కారుణ్య వనంగా మార్చేశారు. ఇటు ప్రజల సమస్యలతో పాటు సిబ్బంది సమస్యలు, సంక్షేమంపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమ స్వరూపాన్ని పోలీస్ బాస్ మార్చేశారు. ఎంతో వేదనతో.. కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకుని న్యాయం కోసం వచ్చే బాధితులకు బాసటగా మార్చేశారు. కుటుంబ వివాదాలను మానవీయ కోణంలో ఆలోచించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి న్యాయం జరిగేలా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మాత్రం దాదాపు 200 పైగా పరిష్కరిస్తుంచారు. ఆర్థిక నేరాలు, వేధింపులు సైబర్ నేరాలుపై మాత్రం ఎఫ్ఐఆర్లు నమోదు చేయిస్తున్నారు. ఈ తరహా 375 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందనలో ఇలాంటి వందల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించారు. గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు 2,811 వినతులు రాగా అందులో 90 మాత్రమే పెండింగ్‌లో ఉన్నవి. మిగిలిన ఫిర్యాదులను పరిష్కరించారు. కన్నీళ్లు తుడిచి.. ఆకలి తీర్చి.. న్యాయం చేసి.. మానసికంగా వేదనకు గురై న్యాయం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఎస్పీ కార్యాలయానికి వచ్చే బాధితులకు పోలీస్ బాస్ విజయారావు ముందు వారి కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆ తర్వాత ఆకలి తీరుస్తున్నారు. అప్పుడే వారి కష్టాన్ని తీర్చి న్యాయం చేసి పంపిస్తున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు వారి సహాయకులకు మధ్యాహ్నం వేళ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏ పోలీస్ బాస్ ఇలా చేయని విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరూ ఆకలితో వెళ్లకూడదని తన సొంత ఖర్చుతోనే వారికి భోజనం పెట్టేలా ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా వచ్చిన కొందరు బాధితులకు చేతిలో డబ్బులేక మధ్యాహ్నం సమయంలో ఆకలితోనే ఉండి వెళ్లిన పలు ఘటనలు ఎస్పీ దృష్టికి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవి కాలంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని మజ్జిగ బాధితులకు అందించారు. సిబ్బంది సంక్షేమంపై ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ఎస్పీ విజయారావు, తమ శాఖలోని ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించారు. సొంత శాఖలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల్లో ఆత్మçస్థైర్యం నింపేందుకు సత్వర చర్యలు చేపట్టారు. పోస్టింగ్‌లు లేక వీర్ఆలో ఉన్న ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అంతే కాదు ప్రతి శుక్రవారం సిబ్బంది కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌డే నిర్వహించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వారికి న్యాయం చేస్తున్నారు. వింజమూరుకు చెందిన వై.వెంకటేశ్వర్లు (74)కు ముగ్గురు కుమారులు. బిడ్డల భవిష్యత్ కోసం ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో శాస్త్రవేత్త. రెండో కుమారుడు కూడా పీహెచ్డీ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు బీటెక్ పూర్తిచేసి విదేశాల్లో స్థిరపడ్డాడు. వారి బంగారు భవిష్యత్ కోసం ఆయన అష్టకష్టాలు పడి విద్యావంతులుగా తీర్చిదిద్ది, వివాహాలు చేశాడు. అందరూ స్థిరపడ్డారు. కానీ వారికి తండ్రి భారమయ్యాడు. ఆదరించమని వెళ్తే∙హింసించి పంపారు. బతకడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో న్యాయం కోసం స్పందన మెట్లు ఎక్కాడు. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆయన న్యాయం జరిగేలా చేశారు. నెల్లూరునగరంలోకి ఖుద్దూస్‌నగర్‌కు చెందిన ఎస్కే సబనా, రవితేజ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 7 ఏళ్లు, 4 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. తొలుత అన్యోన్యంగా సాగిన ఆ కుటుంబంలో తర్వాత కలతలు రేగాయి. భర్త ఆమెను వేధించడం ప్రారంభించాడు. భరించలేని ఆమె స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ విజయారావు వెంటనే దిశ పోలీస్‌స్టేషన్‌కు అటాచ్ చేసి ఆమెకు న్యాయం చేయమని ఆదేశించారు. దిశ స్టేషన్లో వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం వారి కాపురం సజావుగా సాగుతుంది. కొండాపురం మండలానికి చెందిన వెంకటరమణమ్మ (21) భర్త చనిపోయాడు. ఆదరించాల్సిన ఆమె మెట్టింటి వారు నిర్దాక్షిణ్యంగా బయటకు గెట్టేశారు. భర్త ఆస్తిలో కూడా ఏమీ ఇవ్వమని తెగేసి చెప్పి పుట్టింటికి పంపారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె స్పందనలో ఎస్పీ విజయారావు ఎదుట తన ఆవేదన వెలిబుచ్చుకుంది. స్పందించిన ఎస్పీ కలిగిరి సీఐ ద్వారా ఆమెకు న్యాయం జరిగేలా చేశారు. న్యాయం జరిగేలా చేయడం నా బాధ్యత ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి నా దగ్గరకు వస్తున్నా రు. వారి సమస్యలు విని సత్వరమే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ న్యాయం జరగలేదంటేనే నా వద్దకు రావాలి. జిల్లాలో మా పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేస్తుంది. ఎవరైనా నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకోవచ్చు. ప్రతి సోమవారం జిల్లా కార్యాలయానికి వచ్చే బాధితులకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. – విజయారావు, ఎస్పీ, నెల్లూరు -
జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో..
సాక్షి,మంచిర్యాలక్రైం: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. హమాలీవాడకు చెందిన జనగామ సాయిక్రిష్ణ(28) పోస్టాఫిస్‌లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గతంలో ఓ బాలికను వేధించిన కేసులో 2021 అక్టోబర్ 20న జైలుకు వెళ్లి ఐదు నెలలు శిక్ష అనుభవించాడు. వారం రోజుల క్రితం విడుదల అయ్యాడు. అప్పటి నుంచి బాలిక ఫొటోను చూస్తూ ఆమె కోసం గాలిస్తున్నాడు. ఈ విషయం సాయిక్రిష్ణ భార్య సంధ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్నాడు. ఈ నెల ఐదున భర్తతో గొడవ జరగడంతో సంధ్య కరీంనగర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. సాయిక్రిష్ణ బుధవారం స్థానిక గాంధీనగర్ శివారులోని ఓ మూతపడిన సామిల్లో అతిగా మద్యం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మరో ఘటనలో.. ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య సాక్షి,నస్పూర్: పట్టణ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియా కృష్ణాకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు శ్రీకృష్ణ (25) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీరాంపూర్ ఎస్సై మానస, స్థానికుల కథనం ప్రకారం మణుగూరుకు చెందిన శ్రీకృష్ణ ఆర్కే 5 గనిలో బదిలీ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు కొద్ది కాలంగా విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని అతడి సహచరులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడు తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి నాగేశ్వర్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మానస తెలిపారు. చదవండి: ఏడాది ప్రేమ.. ఆపై పెళ్లి, వారం కాపురం చేసి పరార్ -
మాట వినడం లేదని.. రాత్రి నిద్రపోతుంటే వచ్చి గొంతు నులిమి..
సాక్షి,మిర్యాలగూడ అర్బన్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య గొంతు నులిమి కడతేర్చాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న గూడపూరి దీపక్, స్రవంతికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు సంతానం. దీపక్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్నేళ్లుగా దంపతులకు మనస్పర్థల కారణంగా గొడవలు జరుగుతున్నాయి. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. దీంతో స్రవంతి కుమారుడితో కలిసి మిర్యాలగూడలో, దీపక్ తల్లితో కలిసి నకిరేకల్‌లో ఉంటున్నారు. మాట వినడం లేదని.. తన మాట వినడం లేదని దీపక్ భార్యపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిర్యాలగూడలోని స్రవంతి ఉంటున్న ఇంటికి వచ్చాడు. పథకం ప్రకారం స్రవంతి గొంతు నులమడంతో అక్కడికక్కడే మృతిచెందింది. శ్రవంతి చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం దీపక్ నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వై.వెంకటేశ్వర్రావు ఎస్ఐ అంతిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఏమైందో తెలియదుగాని భార్య చేతిలో భర్త హతం
వివాహ సమయంలో ఏడడుగులు నడిచి జీవితాంతం సుఖసంతోషాలతో ఉంటామని ఒక్కటైన భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అవి కాస్త చినికిచినికి గాలివానయ్యాయి. వివాదం దిశ పోలీసుస్టేషన్ వరకూ వెళ్లింది. అక్కడ పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి సంసారం సాగించాలని సూచించారు. అంతా మారినట్టే కనిపించింది. ఇంతలోనే ఏమైందో తెలియదుగాని భార్యే భర్తను హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే... డెంకాడ(విజయనగరం): విజయనగరం మండలం ధర్మపురి గ్రామానికి చెందిన గేదెల సూరిబాబు డెంకాడ మండలంలోని చింతలవలస ప్రాంతంలో గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు, ఇతర వర్గాలు అందించిన వివరాలు... ధర్మపురం గ్రామానికి చెందిన గేదెల సూరిబాబు(40)కు డెంకాడ మండలం చింతలవలస గ్రామానికి చెందిన రామయ్యమ్మతో 13 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో వీరి కేసు దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. భార్యాభర్తల వివాదం కావడంతో సర్ది చెప్పి చక్కగా కాపురం చేసుకోవాలని సూచించి పంపించారు. ఈ క్రమంలో రామయ్యమ్మ కొంతకాలం కన్నవారి ఇంట, కొంతకాలం భర్త వద్ద ఉంటూ వస్తోంది. ఇలా వివాదాల నడుమే వీరి కాపురం సాగుతోంది. భార్య రామయ్యమ్మ ప్రస్తుతం కన్నవారి ఇంట చింతలవలసలో ఉంది. గురువారం రాత్రి రామయ్యమ్మను ధర్మపురికి రావాలని భర్త సూరిబాబు కోరడంతో వారి మధ్య మరోసారి వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. చివరకు సూరిబాబుతో కలిసి రామయ్యమ్మ గురువారం రాత్రి చింతలవలస నుంచి ధర్మపురికి బయలుదేరింది. మార్గమధ్యలో చింతలవలస శ్మశాన వాటిక రోడ్డు వద్దకు వచ్చేసరికి రామయ్యమ్మ తన అన్న సాయంతో సూరిబాబుపై కర్రలతో దాడి చేసి హతమార్చింది. దర్యాప్తు ముమ్మరం సూరిబాబును హత్య చేయడంలో భార్య రామయ్యమ్మతో పాటు ఇంకెవరు ఉన్నారన్న దానిపై లోతైన విచారణ పోలీసులు చేస్తున్నారు. సూరిబాబు హత్య కేసులో రామయ్యమ్మ పాత్ర నిర్ధారణ కాగా, అన్న పరిశినాయుడుతో పాటు ఇంకెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పద్మావతి తెలిపారు. రామయ్యమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన సీఐ హత్యకు గురైన గేదెల సూరిబాబు మృతదేహాన్ని భోగాపురం సీఐ కేకేవీ విజయ్‌నాథ్, డెంకాడ, భోగాపురం ఎస్ఐలు పద్మావతి, మహేష్ పరిశీలించారు. ఎస్ఐ పద్మావతి కేసు నమోదు చేయగా, సీఐ విజయ్‌నాథ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. -
ఎన్నో కలలతో మెట్టినింట కాలు మోపింది.. ఏడాదిన్నర కాకుండానే..
మండ్య(బెంగళూరు): మెట్టినింట కాలు మోపి ఏడాదిన్నర కూడా కాకనే వివాహిత బలవన్మరణం చెందింది. వివరాలు.. మద్దూరు తాలూకా, గొల్లరదొడ్డి గ్రామానికి చెందిన కీర్తనకు, నాగమంగల తాలూకాలోని కుడుగుబాళు గ్రామానికి చెందిన రవికి యేడాదిన్నర క్రితం వివాహమైంది. కొన్ని నెలలపాటు సవ్యంగా సాగిన వారి కాపురంలో ఇటీవల కలతలు చోటు చేసుకున్నాయి. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఆవేదనకు గురైన కీర్తన శుక్రవారం తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగమంగల గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కుమార్తె అనారోగ్యం.. తల్లి ఆత్మహత్య మైసూరు: అనారోగ్యంతో తన ఏడేళ్ల కుమార్తె పడుతున్న వేదనను చూడలేక ఓ తల్లి ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలోని చెలువాంబ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. నగరంలోని హోటెగళ్లి ప్రాంతానికి చెందిన యాస్మిన్(30) ఆనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను ఇక్కడి చెలువాంబ ఆస్పత్రిలో చేర్పించింది. కుమార్తె పడుతున్న వేదనను తట్టుకోలేక బాత్రూమ్లోకి వెళ్లి చాకుతో గొంతు కోసుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన కేఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
తాగిన మత్తులో.. కన్న కొడుకని కనికరం లేకుండా..
సాక్షి, టెక్కలి రూరల్: మద్యం మత్తు ఓ తండ్రిని హంతకు డిని చేసింది. కన్న కొడుకునే కిరాతకంగా చంపేలా చేసింది. టెక్కలిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చో టు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరా లు ప్రకారం.. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి స్థానిక భూలోకమాత వీధికి చెందిన బిసాయి నాగ రాజు (28) అతని తండ్రి లవకుశలు నిత్యం మద్యం సేవించి ఇంట్లో తగాదా పడుతుంటారు. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. కొడుకు తనపై విరుచుకుపడడం తట్టుకోలేని తండ్రి వంట గదిలో కూరగాయలు కోసే కత్తితో నాగరాజు కడుపు, ఛాతీ కింద భాగంలో బలంగా పొడిచాడు. దీంతో అతను ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అతని తల్లి దమయంతి, చెల్లి మాలతిలు 108కు సమాచా రం అందించి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే నాగరాజు చనిపోయినట్లు వైద్యు లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకు ని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. చదవండి: ఫంక్షన్హాల్లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి... -
భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య
తనను ప్రేమించిన వ్యక్తి అపురూపంగా చూసుకుంటాడని ఆ యువతి భావించింది. తల్లిదండ్రులు లేరన్న లోటు తీరుస్తాడని నమ్మింది. ప్రేమికుడితో కలిసి ఏడడుగులు నడిచింది. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి కాపురంలో అనుమానం పెనుభూతమైంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోయింది. ఇద్దరు బిడ్డలతో సహా తనువు చాలించింది. ఈ ఘటన పెనుమూరు మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాక్షి, చిత్తూరు: మండలంలోని గుడ్యాణంపల్లెకు చెందిన బి.సుబ్రమణ్యం పెద్ద కుమారుడు కిశోర్ తిరుపతి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి. స్విమ్స్‌లో నర్స్‌గా పనిచేస్తున్న నీరజ (32)తో పరిచయం ఏర్పడింది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. తిరుపతిలో నివాసముంటున్న మేనమామ అనిల్ చేరదీసి, ఇంటర్ వరకు చదివించాడు. నర్స్ ట్రైనింగ్ పూర్తిచేయించి, స్విమ్స్‌లో చేర్పించాడు. ఈ క్రమంలో కిశోర్‌తో నీరజకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తిరుపతిలో కాపురం పెట్టారు. వీరికి చందు(8), చైత్ర (2) పిల్లలున్నారు. కరోనా కారణంగా గత ఏడాది గుడ్యాణంపల్లెకు వచ్చారు. అప్పటి నుంచి తల్లిదండ్రులతో ఉంటున్నారు. కిశోర్ కాంట్రాక్ట్ ఉద్యోగం వదిలేసి పెనుమూరు మండలంలో కోళ్ల ఫారాలు లీజుకు తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు. నీరజ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లి వచ్చేది. కిశోర్ భార్యకు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉండడంతో అనుమానం పెంచుకున్నాడు. గత ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేయించాడు. నీరజ ఇంట్లో ఒంటరిగా ఉండలేక పోయింది. తిరుపతికి వెళ్లి కాపురం పెడదామని భర్తను పదేపదే కోరింది. దీనికి భర్తతో పాటు అత్తమామలు వ్యతిరేకించారు. ఈ విషయం గొడవకు దారితీసింది. గత శనివారం రాత్రి నీరజ భర్త, అత్త మామలతో గొడవ పడింది. నీరజపై వారు చేయి చేసుకున్నారు. మనస్తాపం చెందిన ఆమె ఆదివారం తెల్లవారు జామున తన ఇద్దరు బిడ్డలను తీసుకొని స్కూటీలో అత్తింటి నుంచి వెళ్లిపోయింది. భార్య, బిడ్డలు కనిపించడం లేదని భర్త ఆదివారం పెనుమూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం రామచంద్రాపురం మండలానికి చెందిన ఓ క్వారీ గుంతలో నీరజతో పాటు ఇద్దరు బిడ్డల మృత దేహాలు తేలాయి. రామాపురం చెత్త సేకరణ కేంద్రం వద్ద స్కూటీని పార్కింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉపాధి కూలీలు అటువైపు వెళ్లగా మృతదేహాలు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారమే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. రామచంద్రాపురం ఎస్ఐ జయ స్వాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రూ.కోటి ఎగ్గొట్టి.. బిచ్చగాడిగా మారి! -
మాతృప్రేమను మరిచి .. పంతానికి పోయి
సాక్షి, గచ్చిబౌలి : భార్యాభర్తల మధ్య వచ్చిన స్వల్ప వివాదంతో మనస్తాపం చెందిన ఓ తల్లి.. పాలైనా విడువని పసికందును నిద్రలోకి నెట్టి బలవన్మరణానికి పాల్పడింది. నిద్రపోయిన పసికందు లేచిచూస్తే జోలపాడి జోకొట్టిన తల్లి మళ్లీ ఒడికి తీసుకుని పాలిచ్చి ఆకలి తీరుస్తుందనుకుంటే విగతజీవిగా ఫ్యానుకు వేలాడుతోంది. అమ్మకి ఏమైందో తెలియని పసికందు ఆకలికోసం ఏడుస్తున్న దృశ్యం చుట్టుపక్కల వారిని చలింపచేసింది. గురువారం ఉదయం రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలోని సంగం జాగర్ల గ్రామానికి చెందిన పురోహితుడు రమేశ్‌బాబు పెద్ద కూతురు హిరణ్మయి (29)ని గుంటూరుకు చెందిన కృష్ణ కిశోర్‌కు ఇచ్చి 2018 ఆగస్టు 30న వివాహం జరిపించారు. హిరణ్మయి నగరంలోని విప్రోలో, కృష్ణ కిశోర్ సైబర్ గేట్‌వే సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తూ.. ఖాజాగూడలోని స్వరూపా రెసిడెన్సీ 5వ అంతస్తులోని ఫ్లాట్ నం. ఇ–1 సింగిల్ బెడ్ రూమ్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో ఆర్నెల్ల క్రితం ఈ దంపతులకు కూతురు పుట్టింది. కూరలో ఆయిల్ ఎక్కువైందని... ప్రసవం అనంతరం పుట్టింటి నుంచి మూడు వారాల క్రితమే హిరణ్మయి భర్త వద్దకు రాగా.. అప్పట్నుంచి దంపతుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఉదయం కూడా కూరల్లో ఆయిల్ ఎక్కువయిందన్న విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కృష్ణకిశోర్ యథావిధిగా ఉదయం ఆఫీసుకు వెళ్లగా.. మనస్తాపం చెందిన హిరణ్మయి ఇంట్లోనే పాపను నిద్రపుచ్చి బెడ్రూమ్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తండ్రి రమేశ్‌బాబు 9గంటలనుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోన్న చిన్న కూతురు కౌముదికి విషయం చెప్పాడు. దీంతో లంచ్ సమయంలో కౌముది ఖాజాగూడలోని సోదరి ఇంటికి వచ్చి తలుపుకొట్టగా ఎవరూ తీయలేదు. తలుపులు నెట్టుకుని లోపలికివెళ్లగా హాల్లో పసికందు మేదస్వీ ఏడుస్తూ... హిరణ్మయి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఉంది. ఇరుగుపొరుగు సాయంతో హిరణ్మయిని కిందికి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పోలీసులకు సమాచారమివ్వడంతో మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఎస్సై ఎస్.రవీందర్ తెలిపారు. కాగా, హిరణ్మయి గది నుంచి బయటకు ఎక్కువగా రాదని, బుధవారం రాత్రికూడా హిరణ్మయి దంపతుల మధ్య గొడవ జరిగినట్లు అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. -
పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి.. ఆపై తండ్రి కూడా
సాక్షి, మేడ్చల్( హైదరాబాద్) : కన్న తండ్రే కుమారుల పాలిట కాలయముౖడయ్యాడు. కుమారులకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాపించాడు. అనంతరం తానూ తాగాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు మృతి చెందాడు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజబొల్లారం తండాలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని రోడామేస్త్రినగర్‌కు చెందిన సురేష్ దంపతులు రాజబొల్లారం తండాలో నివాసముంటున్నారు. సురేష్ భార్య మంజుల తల్లిదండ్రులు రాజబొల్లారంలోనే ఉంటున్నారు. వీరికి ప్రదీప్(7),ప్రణీత్(5)కుమారులున్నారు. మద్యానికి బానిసైన సురేష్ అత్తగారి ఇంట్లోనే ఉంటూ స్థానికంగా ఉన్న కంపెనీలో పనిచేస్తుండగా మంజుల కూడా కంపెనీలో పనిచేస్తోంది. సురేష్ ఆరు నెలల క్రితం అదే గ్రామంలోనే అద్దె ఇంట్లోకి మారాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన సురేష్ భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మంజుల నిద్రలో ఉన్న పిల్లలను వదిలేసి సమీపంలో ఉన్న తల్లి వద్దకు వెళ్లిపోయింది. కొద్ది సేపటికి మత్తులో ఉన్న సురేష్ కూల్‌డ్రింక్ తీసుకువచ్చి అందులో విష గుళికలు కలిపి పడుకున్న చిన్నారులకు తాపించి తాను కూడా తాగాడు. పిల్లల్ని తీసుకువచ్చి మంజుల దగ్గర వదిలిపెట్టి అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. పిల్లలిద్దరూ పెద్దగా ఏడుస్తుండడం, గుళికల వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన మంజుల తన భర్తను నిలదీయగా విషయం చెప్పాడు. వారిని వెంటనే మెడిసిటి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్న కుమారుడు ప్రణీత్(5) మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రదీప్(7) పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు ప్రదీప్‌కు నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి, సురేష్‌ను గా«ంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా భన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని మంజుల పోలీసులను కోరింది. -
కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య
సాక్షి, వేములవాడ(కరీంనగర్) : కట్నం వేధింపులకు వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన తాడెం అంజయ్య– సత్తవ్వల కుమార్తె తాడెం సరళ ఊరాఫ్ అన్నవేని నవ్య(24)ను ఐదేళ్లక్రితం సిరిసిల్ల మండలంలోని చంద్రపేటకు చెందిన అన్నవేణి మల్లేశంకిచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలు అందించారు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. నవ్య తమ్ముడికి ఆమె అత్తవారి గ్రామం నుంచి అమ్మాయినిచ్చి ఏడాది క్రితం వివాహం జరిపించారు. ‘ మనకంటే.. మీ తమ్ముడికి ఎక్కువ కట్నం ఇచ్చారు’ అంటూ నవ్యను భర్త మల్లేశం వేధించడం ప్రారంభించాడు. వేధింపులు తాళలేక ఆర్నెల్లక్రితం కొంతడబ్బు పుట్టింటి నుంచి తీసుకొచ్చింది. అయినప్పటికీ మరింత డబ్బుకావాలని మల్లేశం వేధించడంతో నవ్య మూడ్రోజుల క్రితం పుట్టినిల్లయిన రుద్రవరంకు వచ్చింది. శనివారం మధ్యాహ్నం భర్తతో ఫోన్లో మాట్లాడిన నవ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుం ది. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరా బాద్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే మృతి చెందింది. పట్టణ సీఐ వెంకటస్వామి విచారణ జరిపారు. -
కుటుంబ కలహాలతో హోంగార్డ్ ఆత్మహత్య
సాక్షి, మధురవాడ(విశాఖపట్టణం) : కుటుంబ కలహాలతో ఓ హోంగార్డ్ బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం సూర్యాభాగ్లోని నగర పోలీస్ కమిషనరేట్ సమీపంలో ఉన్న వైశాఖి జల ఉద్యానవనం వద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2012లో హోంగార్డ్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించిన గంటా ప్రకాశరావు(40) గుంటూరు ప్రాంతవాసి. పీఎం పాలెం పోలీసు స్టేషన్లో కొనేళ్లుగా పోలీసు రక్షక్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రకాశ్‌కు పదేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక(30)తో వివాహమైంది. ఉద్యోగం, ఇతర కారణాలు రీత్యా ఎండాడ వరాహగిరి నగరంలో స్థిర పడ్డారు. ఇక్కడి జీ ప్లస్2 భవనంలోని పైఫ్లోర్‌లో ప్రకాశ్ భార్య, పిల్లలు ఆశ్రిత్(6), అఖిల్(4)తో నివాసం ఉంటున్నాడు. అదే భవనం కింది ఫ్లోర్లో ఆయన తండ్రి మరియదాసు, తల్లి విజయకుమారి నివాసం ఉంటున్నారు. తండ్రి సీబీసీఐడీలో ఎస్ఐగా పనిచేసి రిటైరయ్యారు. ఏడాది పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. తరచూ గొడవలు పడుతుండేవారు. కొన్నాళ్ల కిత్రం భార్య ప్రకాష్‌పై గృహ హింస వేధింపుల(498) కేసు పెట్టింది. తర్వాత లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయ్యారు. కలహాలు పెంచిన ఫేస్బుక్ పోస్టు గొడవలు జరుగుతుండగానే గత నెల 14న తనను వేధింపులకు గురిచేసి కొడుతున్నట్టు భార్య ప్రియాంక ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టినట్టు సమాచారం. తర్వాత పీఎం పాలెం పోలీసు స్టేషన్లో కూడా ఆమె మౌఖిక ఫిర్యాదు ఇవ్వగా.. లిఖిత పూర్వకంగా ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే అప్పటికి ఆమె ఫిర్యాదు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా గత నెల 16న ప్రియాంక, ఆమె తల్లిదండ్రులు, మరో వ్యక్తి కలిసి తనను తీవ్రంగా కొట్టారని, ఎంఎల్సీ చేయించుకుని పీఎంపాలెం పోలీసు స్టేషన్లో ప్రకాశ్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ప్రియాంక సూర్యభాగ్లోని డీసీపీ–1కి ప్రకాష్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రకాష్‌ను పిలిపించారు. ‘నీ భార్య ఫిర్యాదు ఇచ్చింది. పోలీసు కార్యాలయంలోనే కూర్చోవాలని’ చెప్పారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి 9.25 గంటలకు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 4.30 గంటల సమయంలో మృతి చెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్పందిస్తే ఓ నిండు ప్రాణం దక్కేది! ప్రకాశ్ చనిపోవడానికి ముందే వాట్సప్‌లలో మరణ వాగ్మూలాన్ని పోస్ట్ చేశాడు. దీన్ని అందరితో పాటు పోలీసులు కూడా తేలిగ్గా తీసుకున్నారు. సకాలంలో స్పందించి ఉంటే ఓ నిండు ప్రాణం నిలబడేదని పలువురు అంటున్నారు. నమ్మండి.. నమ్మకపోండి.. ఇక బై ప్రకాశ్ పీఎంపాలెం పోలీసు స్టేషన్లో రక్షక్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి పోలీసు రిటైర్డ్ ఎస్ఐ, సోదరి పోలీసు కానిస్టేబుల్. మొత్తంగా వీరిది పోలీసు కుటుంబం. చీటికి మాటికీ భార్య గొడవ పడుతూ పోలీసు స్టేషన్‌కి, కోర్టుకి లాగుతుండంతో భరించలేకపోయాడు. దీంతో సెల్‌ఫోన్ వీడియో చిత్రీకరించి వాట్సప్‌లలో పోస్ట్ చేశాడు. ఆయన మాటల్లోనే.. ‘నమస్కారం సార్.. నా పేరు గంటా ప్రకాశరావు, హెచ్‌జీ 457, పీఎంపాలెం రక్షక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. మా ఆవిడతో కొంత కాలంగా నాకు గొడవలు అవుతున్నాయి. సర్దుకుపోతున్నా ఆమె వినడం లేదు. తరచూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తోంది. ఇటీవల 498ఏ కేసు కూడా పెట్టింది. మళ్లీ లోక్ అదాలత్‌లో ఆమె రాజీకొచ్చింది. మనశ్శాంతిగా ఉద్యోగం చేయనివ్వడం లేదు. ఇటీవల తాను వేధించి, కొట్టేశానని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఆమె కుటుంబ సభ్యులతో కూడా నన్ను కొట్టించింది. దీనిపై ఫిర్యాదు చేస్తే కనీసం గంట కూడా స్టేషన్లో ఉంచకుండా వారిని పంపించేశారు. అదే మా ఆవిడ డీసీపీ–1కు ఫిర్యాదు చేస్తే నన్ను స్టేషన్‌కు పిలిచి, విచారించారు. నేను ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదు. దీంతో మనస్తాపంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. సర్ ఇదే నా చివరి మరణ వాంగ్మూలం. మీరు నమ్మండి నమ్మకపోండి. ఇక బై’. అంటూ ప్రకాశ్ పెట్టిన సెల్ఫీవీడియో వైరల్ అవుతోంది.. -
అవమానంతో ఆత్మహత్య
సాక్షి, చినగంజాం(ప్రకాశం) : బంధువులు తనపై దాడి చేశారని మనస్తాపానికి గురైన వివాహిత ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చినగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబపురం గ్రామానికి చెందిన బసంగారి పద్మ (31) తన ఇంటిలోని ఫ్యానుకు ఉరివేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే రుద్రమాంబపురం గ్రామంలో బసంగారి కనకయ్య, శ్రీను, భద్రయ్య, ఆంజనేయులు, నాగేశ్వరరావు, బ్రహ్మయ్యలు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు కాగా వీరిలో పెద్దవాడు కనకయ్య వేరే గ్రామంలో ఉంటున్నాడు. అయితే శ్రీను, భద్రయ్య, నాగేశ్వరరావు కుటుంబాలకు మిగిలిన ఇరువురు కుటుంబాలకు గత ఐదేళ్లుగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంధువుల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు తోడి కోడళ్ల మధ్య గొడవకు కారణమయ్యాయి. గతంలో మృతురాలి భార్యభర్తలు ద్విచక్రవాహనం మీద వెళుతున్నప్పుడు తమకు తగిలిందని వారిలో ఒక తోడి కోడలు మంగళవారం ఉదయం గొడవ పెట్టుకొని, ఆమెతో పాటు బావలు, మరుదులు, వీరి మద్దతుదారులు మృతురాలు పద్మపై చేతులతో, కాళ్లతో దాడి చేశారు. శరీరంపై దుస్తులు చెదిరిపోయేలా దాడి చేయడంతో ఆమె అవమానానికి గురైంది. ఆ సమయంలో ఆమె భర్త బ్రహ్మయ్య అడ్డుపడి వారిని వారించి పద్మను ఇంటిలోకి పంపి బయట తలుపు వేశాడు. దాంతో వారు బ్రహ్మయ్యపై కూడా చేయి చేసుకున్నారు. అరగంట అనంతరం తోడికోడళ్లు దాడి చేశారని అవమానభారంతో ఇంటిలోకి వెళ్లిన పద్మ లోపల గడియ వేసుకోవడంతో పాటు కిటికీలను సైతం మూసి వేసి ఫ్యానుకు చీర తగిలించి ఉరి వేసుకుంది. భర్త అనుమానంతో తలుపు తీసేందుకు ప్రయత్నించి రాక పోవడంతో వాటిని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడటంతో ఆమె ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. వెంటనే ఆమె వదిన, బావలు ఉరి వేసుకున్న చీరను కూరగాయల కత్తితో కోసి ప్రాణాలతో ఉన్న ఆమెను కిందకు దించారు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు రాజారావును పిలిచి చూపించగా అతను మెరుగైన వైద్యశాలకు తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. ఈ లోగా సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గ్రామంలో ఘర్షణ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆమె మృతి చెందడంతో సమాచారాన్ని తమ ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్చార్జ్ ఎస్ఐ కే అజయ్ బాబు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ నాగరాజు, ఇంకొల్లు సీఐ రాంబాబులు సందర్శించి పరిశీలించారు. బాధితుడు బ్రహ్మయ్యను జరిగిన సంఘటనపై విచారించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసు బృందం గ్రామంలోకి తెప్పించారు. జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు, ఒక ఎస్ఐను కూడా గ్రామంలో ఉంచి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ప్రస్తుతం 10 మంది మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వారిని కూడా తీసుకొచ్చి విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. -
ముగ్గురిని బలిగొన్న కుటుంబ కలహాలు!
రైల్వేగేట్(వరంగల్): కుటుంబ కలహాలతో రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం... కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన కొంగ మహేశ్(33) కొంతకాలం వరంగల్‌లో నివసించాడు. రెండేళ్లుగా సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొండపాడులో రేఖ కెమికల్ ఫ్యాక్టరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన తల్లి పూలమ్మ(60), కూతురు దర్శిని(13), భార్య సంగీత, కుమారుడు కార్తికేయతో కలసి బుధవారం ఖమ్మంలో నాగర్సోల్ రైలు ఎక్కి సాయంత్రానికి వరంగల్ చేరుకున్నారు. సంగీత కార్తికేయతో కలసి కాజీపేటలో తల్లిగారింటికి వెళ్లింది. మహేశ్, పూలమ్మ, దర్శిని మాత్రం కాశిబుగ్గలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి అర్ధరాత్రి వరంగల్ జాన్‌పీరిల సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాన్ని సరిగా చూసుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మహేశ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల వల్లే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి నట్లు సీఐ తెలిపారు. సంగీత మాత్రం తమ మధ్య ఎలాంటి గొడవల్లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదని రోదించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం వంగవీడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంలో ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే పురుగుల మందు తాగి తనువు చాలించారు. మృతులు వెంకటరామిరెడ్డి(55), పుల్లమ్మ(45) అని తెలుస్తోంది. కుటుంబ కలహాలే వారి మరణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
ప్రియుడు అనుకొని.. కొడుకుని నరికాడు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్‌పల్లెలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సోమన్న రామలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని సోమన్న అనుమానిస్తుండేవాడు. దీంతో దంపతులకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పీకల దాకా మద్యం సేవించిన సోమన్న ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో తన భార్య ప్రియుడు ఇంట్లో ఉన్నాడని భావించి బెడ్‌పై పడుకుని ఉన్న పెద్ద కొడుకు పరుశురామ్(14)పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో పరుశురామ్‌కు తీవ్ర గాయాలవడంతో బేతంచెర్లకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడుని కర్నూలుకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సోమన్నపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
భార్య దూరమైందని భర్త ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భార్య తన నుంచి విడిపోయిందని మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తంజావూరు అన్నానగర్ ప్రాంతానికి చెందిన గిరి(35) మాణంబచ్చావడి చిన్న ఆసుపత్రి సమీపంలో వెల్డింగ్ వర్కుషాపు నడుపుతున్నాడు. ఇతని భార్య సుధ. వీరికి వివాహం జరిగి 10 ఏళ్లవుతోంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా సుధ భర్త నుంచి వీడిపోయి పుట్టింటికి వెళ్లింది. ఒంటరిగా నివసిస్తూ వచ్చిన గిరికి అప్పుల సమస్యలు తోడయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన గిరి వెల్డింగ్ వర్కుషాపులో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తంజావూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గిరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నం
కుషాయిగూడ: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మహేష్నగర్కు చెందిన జీనా(24) బుధవారం రాత్రి భర్తతో గొడవపడింది. మనస్తాపం చెందిన ఆమె అర్థరాత్రి సమయంలో తాము ఉంటున్న భవనంపై నుంచి దూకింది. గమనించిన స్ధానికులు వెంటనే తీవ్రంగా గాయపడిన జీనాను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కుటుంబకలహాలతో దంపతుల ఆత్మహత్య
పొన్నూరు (గుంటూరు జిల్లా) : కుటుంబకలహాలతో దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. నండూరు గ్రామానికి చెందిన షేక్ హబీబుల్లా, షర్మిల దంపతుల కుటుంబంలో గత కొంతకాలంగా కలతలు చెలరేగాయి. ఈ నేఫథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరికి నాలుగవ తరగతి చదివే కుమారుడు, రెండవ తరగతి చదివే కుమార్తె ఉన్నట్లు సమాచారం. -
కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య
బేతంచర్ల (కర్నూలు జిల్లా) : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సీతారామాపురం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. సీతారామాపురం గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య(38) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొంతకాలంలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కుటుంబకలహాలు జరుగుతుండటంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మీదేవితో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. -
కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య
బేతంచర్ల (కర్నూలు జిల్లా) : కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ఆర్.ముక్కాపురం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రమల్ల రాముడు(36) వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య రామాంజనమ్మ, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అయితే వారి కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో రామాంజనమ్మ, పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన రాముడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.