జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో.. | Telangana: Husband Suicide Over Family Issues With Wife | Sakshi
Sakshi News home page

జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో..

Published Thu, Apr 7 2022 8:25 AM | Last Updated on Thu, Apr 7 2022 8:48 AM

Telangana: Husband Suicide Over Family Issues With Wife - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,మంచిర్యాలక్రైం: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. హమాలీవాడకు చెందిన జనగామ సాయిక్రిష్ణ(28) పోస్టాఫిస్‌లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గతంలో ఓ బాలికను వేధించిన కేసులో 2021 అక్టోబర్‌ 20న జైలుకు వెళ్లి ఐదు నెలలు శిక్ష అనుభవించాడు. వారం రోజుల క్రితం విడుదల అయ్యాడు. అప్పటి నుంచి బాలిక ఫొటోను చూస్తూ ఆమె కోసం గాలిస్తున్నాడు.

ఈ విషయం సాయిక్రిష్ణ భార్య సంధ్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసై భార్యను వేధిస్తున్నాడు. ఈ నెల ఐదున భర్తతో గొడవ జరగడంతో సంధ్య కరీంనగర్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. సాయిక్రిష్ణ బుధవారం స్థానిక గాంధీనగర్‌ శివారులోని ఓ మూతపడిన సామిల్‌లో అతిగా మద్యం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

మరో ఘటనలో..
ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య
సాక్షి,నస్పూర్‌: పట్టణ పరిధిలోని శ్రీరాంపూర్‌ ఏరియా కృష్ణాకాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు శ్రీకృష్ణ (25) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీరాంపూర్‌ ఎస్సై మానస, స్థానికుల కథనం ప్రకారం మణుగూరుకు చెందిన శ్రీకృష్ణ ఆర్‌కే 5 గనిలో బదిలీ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు కొద్ది కాలంగా విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని అతడి సహచరులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడు తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి నాగేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మానస తెలిపారు.

చదవండి: ఏడాది ప్రేమ.. ఆపై పెళ్లి, వారం కాపురం చేసి పరార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement