జీలుగుమిల్లి మండలం సమీపంలో ఓ డాబా వద్ద ఓ లారీ డ్రైవర్ను హతమార్చి నగదు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు.
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జీలుగుమిల్లి మండలం సమీపంలో ఓ డాబా వద్ద గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్, క్లీనర్పై దాడి చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ మరణించగా, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.
వీరిద్దరూ లారీ ఆపి నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజాము ప్రాంతంలో దొంగలు దాడి చేసి 19 వేల రూపాయిల నగదు దోచుకెళ్లారు. డ్రైవర్, క్లీనర్ సమీప బంధువులు. వీరిని మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.