
సాక్షి, అవనిగడ్డ: భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్‌కు చెందిన ఇల్లు కృష్ణానది వరద నీటిలో కొట్టుకుపోయింది. సినీ నటుడు శర్వానంద్‌కు హరిప్రసాద్ తాతయ్య కావడంతో గతంలో గ్రామానికి వచ్చినప్పుడు శర్వానంద్ ఇదే భవనంలో గడిపేవారు. అణు శాస్త్రవేత్తగా, సంఘ సేవకుడిగా మైనేని హరిప్రసాద్, సినీ నటుడిగా శర్వానంద్ గుర్తింపు కలిగిన వారు కావడంతో వారికి చెందిన భవనం వరదల్లో కొట్టుకుపోతుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ ఇంటి పరిసరాల్లో నిలబడి ఒకింత ఆవేదనకు గురయ్యారు. గత ఏడాది సంభవించిన వరదల్లో శర్వానంద్ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment