సీఎం చంద్రబాబు నివాసం రెండో అంతస్తులోకి చేరిన నీరు
సామాన్లూ తెచ్చుకోలేకపోయిన దుస్థితి.. బ్యారేజీ నుంచి 11.43లక్షల క్యూసెక్కులు విడుదల
అమరావతి కరకట్ట వెంబడి పలు చోట్ల గండ్లు పడే అవకాశం
ఎక్కడ గండి పడ్డా భారీ నష్టమే
ముందస్తు సమాచారం ఇవ్వని అధికారులు
కృష్ణా తీరంలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా నదీ తీరంలో కరకట్ట వెంబడి సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కూడా కృష్ణమ్మ వరద ముంచెత్తింది. కనీసం సామాన్లు కూడా బయటకు తెచ్చుకోలేనంతగా రెండో అంతస్తు వరకు వరద వచ్చింది. ఇది అక్రమ కట్టడమే అన్న విషయం అందరికీ తెలుసు. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా అందులో నివాసం ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎన్ని విమర్శలు వచి్చనా కొన్నేళ్లుగా చంద్రబాబు అదే తన నివాసంగా చేసుకొన్నారు.
రెండు రోజులుగా కృష్ణా నదికి తీవ్రంగా వరద రావడంతో ఆదివారం ఉదయం 6 గంటలకే ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా కప్పిపుచ్చారు. సీఎం చంద్రబాబు ఆదివారం నుంచి విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటున్నారు. ఇంటి వద్దకు వరద ఎంత వస్తుందో కూడా ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. దీంతో సోమవారం సీఎం ఇంట్లోని రెండో అంతస్తులోకి వరద నీరు వచి్చంది. ముఖ్యమంత్రి నివాసమే మునిగిపోయింది. కనీసం అందులో ఉన్న సామగ్రిని కూడా బయటకు తీయలేకపోయారు.
ప్రకాశం బ్యారేజి పరిసర ప్రాంతాలకు పోటెత్తిన వరద
కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నది పరిసర ప్రాంతాలన్నీ వరద పోటెత్తింది. బ్యారేజ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో సోమవారం 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచి్చంది. దీంతో ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు నిలిపి వేశారు. పుష్కర ఘాట్‌లకు వెళ్లే మార్గంలో రిటైనింగ్ వాల్ కూలి ప్రమాదభరితంగా మారింది. బకింగ్‌హామ్ కాలువ నీరు రెండు బ్రిడ్జిల మధ్య ఓవర్ ఫ్లో అవుతోంది. కొండవీటి వాగు స్లూయిజ్ వద్ద తూటాకు అడ్డుపడడంతో నీటిని బయటకు పంపడం సాధ్యం కావడంలేదు. కెనాల్‌లోని తూటాకును తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లు ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది.
కృష్ణా నీరు కొండవీటి వాగులోకి
ప్రకాశం బ్యారేజ్ వద్ద కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు రూ. 200 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిరి్మంచారు. అయితే వాగు వద్ద స్లూయిజ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఎత్తిపోతల వరకు భారీగా వరద వస్తోంది. కృష్ణానది ఎత్తులో ఉండడంతో ఆ నీరంతా వాగులోకి వచ్చి అక్కడి నుంచి గుంటూరు చానల్‌కు వెళ్లి ఉండవల్లిలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఉండవల్లి అమరావతి రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.
సారపాక వాగులోంచి వచి్చన వరద నీరంతా సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద నిలిచిపోయింది. అధికారులు ఇక్కడ గండి కొట్టి నీటిని మళ్లించారు. కాగా, వెంకటపాలెం వద్ద మంతెన సత్యనారాయణ రాజు నిరి్మంచిన ప్రకృతి వైద్యం ఆశ్రమానికి సోమవారం ఉదయం వరద నీరు రావడంతో ఆందోళన చెందిన రోగులు పెద్దపెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతికష్టం మీద తాడు సహాయంతో పై అంతస్తుల్లో ఉన్న వారిని కిందకు దించి పంపించి వేశారు.
కరకట్టకు ముప్పు
ప్రకాశం బ్యారేజ్ నుంచి హరిశ్చంద్రపురం వరకు కరకట్ట పలుచోట్ల దెబ్బతిని పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం గ్రామాల్లోకి నీరు చొచ్చుకు వస్తోంది. కొల్లిపర వద్ద కరకట్టకు గండ్లు పడే పరిస్థితి తలెత్తడంతో అధికారులు ఇసుక బస్తాలు వేస్తున్నారు. రేపల్లె పులిగడ్డ వద్ద కరకట్ట తెగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. కరకట్ట ఎక్కడైనా గండిపడితే నష్టం భారీగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఎప్పుడు వరదలు వచి్చనా ముందస్తుగా వివిధ శాఖల అధికారులు పలు ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment