రాజవంశానికి చెందిన ఓ పెద్దాయన కన్ను మూస్తాడు. అంత్యక్రియలు ఘనంగా మొదల య్యాయి. అంతలో ఏదో డ్రామా జరిగిందట. మరి... ఈ డ్రామా సూత్రధారి ఎవరో తెలియాలంటే ‘డ్రామా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మోహన్‌లాల్. రంజిత్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘డ్రామా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కనిహా, కోమల్ శర్మ, అరుంధతి నాగ్, నిరంజ్, సిద్ధిక్ కీలక పాత్రధారులు. రంజాన్ సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. ముందుగా ఈ సినిమాకు రిప్ (ఆర్.ఐ.పి) అనే టైటిల్ అనుకున్నప్పటికీ ఫైనల్‌గా ‘డ్రామా’ టైటిల్‌ను ఫిక్స్ చేశారట. మూడేళ్ల క్రితం వచ్చిన ‘లోహం’ చిత్రం తర్వాత మోహన్‌లాల్, రంజిత్ కాంబోలో వస్తున్న చిత్రమిది.
Comments
Please login to add a commentAdd a comment