Aditi Rao Hydari Buys New Audi Q7 Car Worth 90 Lakhs: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల తెలుగులో 'మహాసముద్రం' సినిమాతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ విలాసవంతమైన కారు కొనుగోలు చేసింది. ముంబైలో అత్యంత ఖరీదు చేసే 'ఆడి క్యూ 7' లగ్జరీ కారుకు యజమానురాలైంది అదితి. సుమారు ఈ కారు విలువ రూ. 90 లక్షలు ఉంటుంది.
అదితి రావు ఈ కారు కొనుగోలు చేసినట్లుగా ఆడి కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పలు ఫొటోలతో పోస్ట్ చేసింది. కారుతో అదితి రావు దిగిన అందమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అదితి రావు హైదరీ 2007లో 'శృంగారం' అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. సమ్మోహనం, వి, మహా సముద్రం, హై సినామిక, రాక్‌స్టార్, మర్డర్ 3, వజీర్, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, పద్మావత్ వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
చదవండి: సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు
Aditi Rao Hydari: లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?
Published Wed, May 4 2022 8:44 PM | Last Updated on Wed, May 4 2022 9:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment