Audi Q 7
-
లగ్జరీ కారు కొన్న అదితి రావు హైదరీ.. ధర ఎంతంటే ?
Aditi Rao Hydari Buys New Audi Q7 Car Worth 90 Lakhs: తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దూసుకుపోతోంది బ్యూటీఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవల తెలుగులో 'మహాసముద్రం' సినిమాతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ విలాసవంతమైన కారు కొనుగోలు చేసింది. ముంబైలో అత్యంత ఖరీదు చేసే 'ఆడి క్యూ 7' లగ్జరీ కారుకు యజమానురాలైంది అదితి. సుమారు ఈ కారు విలువ రూ. 90 లక్షలు ఉంటుంది. అదితి రావు ఈ కారు కొనుగోలు చేసినట్లుగా ఆడి కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పలు ఫొటోలతో పోస్ట్ చేసింది. కారుతో అదితి రావు దిగిన అందమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అదితి రావు హైదరీ 2007లో 'శృంగారం' అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. సమ్మోహనం, వి, మహా సముద్రం, హై సినామిక, రాక్‌స్టార్, మర్డర్ 3, వజీర్, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, పద్మావత్ వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. చదవండి: సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు View this post on Instagram A post shared by Audi Mumbai West (@audi_mumbaiwest) -
భైంసాకు చేరిన ఆడిక్యూ 7
ముథోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ కుమారుడు అఖిలేశ్ పటేల్ రూ.1.11 కోట్లతో ఆడిక్యూ-7 కారు కొనుగోలు చేశారు. ఈ కారు బుధవారం భైంసాకు చేరింది. కంపెనీ ఆడిక్యూ-7 కొత్త వెర్షన్ వాహనాలను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ముంబై, ఢిల్లీలో ఒక్కో వాహనం ఇవ్వగా.. హైదరాబాద్ జంట నగరాల్లో మొదటి వాహనాన్ని అఖిలేశ్ పటేల్ కొనుగోలు చేశారు. కాగా.. ఈ కారులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని చూసేందుకు స్థానికులు భారీగా గుమికూడారు. వేగానికి అనుగుణంగా కారు గేర్లు వాటంతట అవే మారిపోవడం, జీపీఎస్ ద్వారా కారు చేరుకున్న ప్రదేశం, గమ్యస్థానానికి ఎంత దూరం ఉన్నామనే వివరాలు స్టీరింగ్‌కు పక్కనే ఉన్న డిస్ప్లేపై ఎప్పటికప్పుడు వచ్చే ఆప్షన్ కారులో ఉందని స్టోర్ నిర్వాహకులు తెలిపారు. కారులో ఉన్న ఇంధనం, టైర్లలో గాలి, రోడ్లపై ఉన్న గుంతలు, మూలమలుపుల విషయూలు సౌండ్ సిస్టం ద్వారా డ్రైవర్ కు సమాచారం ఇచ్చే విధానం ఇందులో ప్రత్యేకత. కారు ఎక్కగానే సీటు బెల్టు ధరిస్తేనే ఇంజన్ ఆన్ అయ్యేలా ఈ కారును డిజైన్ చేశారు. మొత్తానికి అత్యాధునిక కారు భైంసా రావడంతో.. ఆ ప్రాంత మంతాసందడిగా మారింది.