
హీరోయిన్ నవ్య నాయర్ కొత్త కారు కొనుగోలు చేసింది.

బీఎమ్‌డబ్ల్యూ కారు కొని దాని ముందు దిగిన ఫోటోలు నెట్టింట షేర్ చేసింది. ఈ కారు విలువ రూ.1.3 కోట్లు అని తెలుస్తోంది.

ఈమె సినిమాల విషయానికి వస్తే.. ఇష్టం అనే మలయాళ సినిమాతో ఈమె హీరోయిన్‌గా మారింది.

అళగియ తీయె చిత్రంతో తమిళంలో, గజ మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది.

ఎక్కువగా మలయాళంలోనే నటిస్తూ మాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణించింది.

కన్నడలో దృశ్యం 1, 2 చిత్రాల్లోనూ మెరిసింది. క్లాసికల్ డ్యాన్స్‌లో ఎంతో అనుభవమున్న ఈమె మాతంగి స్కూల్ ద్వారా విద్యార్థులకు నాట్యం నేర్పిస్తోంది.

మరోవైపు తను చీరల బిజినెస్ కూడా పెట్టింది.

కాకపోతే ఇక్కడ తను వాడిన పాత చీరలు మాత్రమే అమ్మకానికి పెడుతూ ఉంటుంది. వాటిని అభిమానులు ఎగబడి మరీ కొంటుంటారు.
