breaking news
Navya Nair
-
పండ్లు, పూలు.. ఫైను.. జైలు!
డిక్లరేషన్స్ ఇవ్వకుండా.. కొప్పులో మల్లెపూలు పెట్టుకున్నందుకు మెల్బోర్న్ విమానాశ్రయ ఇమిగ్రేషన్స్ అధికారులు నవ్య నాయర్ అనే మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈమెకు ఎదురైన చేదు అనుభవం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవును, విదేశాల్లో ఇలాంటి చిత్రవిచిత్రమైన నిషేధాలు చాలా ఉన్నాయి.ప్రయాణం అంటేనే వెంట తీసుకెళ్లే వస్తువులతో బ్యాగులు నిండాల్సిందే. మౌత్ ఫ్రెషనర్, పెర్ఫ్యూమ్ వంటి రోజూ వాడే వస్తువులు అయినా.. బంధువులు, స్నేహితులకు ఇచ్చే పిండివంటలు, బహుమతులైనా.. బాధ్యత, ప్రేమతో సూట్‌కేస్ బరువెక్కాల్సిందే. మనతోని అట్లుంటది మరి. మన దేశంలో అయితే ఫర్వాలేదు. పరాయి దేశం వెళితేనే సమస్య. ఎందుకంటే మనదగ్గరిలా ఏదిపడితే అది విదేశాలకు తీసుకెళతామంటే అక్కడి నిబంధనలు ఒప్పుకోవు. ఆస్ట్రేలియాలో ఇటీవలే జరిగిన నటి నవ్య నాయర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో 2002లో జరిగిన సంఘటన సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, హర్భజన్స్ సింగ్ చెరి 200 న్యూజిలాండ్ డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. వాళ్లు బ్యాగుల్లో తీసుకొచ్చిన బూట్లకు మట్టి, గడ్డి ఉండడమే ఇందుకు కారణం. వేడి చేయని పాలను కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు. గ్రీసులోని ప్రాచీన పర్యాటక ప్రదేశాలకు హైహీల్స్‌తో వెళ్లడం నిషిద్ధం. ఇలాంటివి మరికొన్ని..ఆస్ట్రేలియా: బయో సెక్యూరిటీ, కస్టమ్ చట్టాల ప్రకారం తాజా పూలు, పండ్లు, కూరగాయలు, మట్టిని తీసుకెళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే ఇబ్బడిముబ్బడిగా వీటిని నాటితే అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నది వారి వాదన. సోన్‌పాపిడి, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, మసాలా దినుసులు, పాల ఉత్పత్తులు కూడా నిషేధమే. ఈ జాబితాలో ఇంకా చాలా ఉన్నాయి.ఆగ్నేయాసియా: ఘాటైన వాసన వచ్చే డ్యూరియన్స్ (పనసలాంటి) పండును ప్రయాణంలో తీసుకెళ్లడాన్ని చాలా విమానయాన సంస్థలు నిషేధించాయి. ముఖ్యంగా కోసిన పండును తీసుకెళ్లరాదు. దీన్ని భారత్‌కు తీసుకురావాలంటే సరైన పద్ధతిలో ప్యాక్ చేయాలి. సింగపూర్‌లో చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతి నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో గమ్స్‌ను ఉమ్మితే భారీ జరిమానా విధిస్తారు. మెడికల్ గమ్స్‌ను మాత్రమే అనుమతిస్తారు.దక్షిణ కొరియా: అమెరికాకు చెందిన ట్రేడర్ జో కంపెనీ తయారీ ‘ఎవిరీథింగ్ బట్ ది బేగల్ సీజనింగ్’ బ్రాండ్ మసాలాలను విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మసాలాల్లో గసగసాలు ఉండడమే ఇందుకు కారణం. ఆ దేశం గసగసాలను మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తుందట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్లలోనూ గసగసాలపై బ్యాన్ ఉంది. కరేబియన్స్ దీవులు: సైనికులు ధరించే దుస్తుల (క్యామఫ్లాజ్) వంటివి సాధారణ పౌరులు వేసుకోవడం చట్టవిరుద్ధం. సైన్యం మాత్రమే ధరించాలి. సైనికులుగా పొరపడే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణ వ్యక్తులు ఈ దుస్తులతో విమానాశ్రయాల్లో కూడా కనిపించకూడదు. అలా చేస్తే జరిమానా వేస్తారు లేదా జైలుకు పంపుతారు. యూఎస్: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అమితంగా ఇష్టపడే కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ (కిండర్జాయ్)ను విమానంలో తీసుకురావడం నిషేధం. గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో తినడానికి వీలుకాని వస్తువులను ఉంచకూడదు.న్యూజిలాండ్: పచ్చళ్లు, మాంసం, విత్తనాలు, విదేశీ మట్టి నిషేధం. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా సరిహద్దు నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇటలీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లిప్–ఫ్లాప్స్ లేదా శబ్దం వచ్చే బూట్లు వేసుకోకూడదన్న నిబంధన ఉంది. శబ్దం వస్తే స్థానికులకు చికాకు కలుగుతుందట.కెనడా: ఈ దేశంలో బేబీ వాకర్ నిషేధం. పిల్లలకు ఇందులో గాయాలవుతున్నాయని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కెనడా వీటిని తమ దేశంలో నిషేధించింది.ఉత్తర కొరియా : ఎంతో ఇష్టమని ఈ దేశానికి బ్లూజీన్స్‌తో వెళ్లేరు.. ఫైన్ కట్టాలి లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. పాశ్చాత్య సంస్కృతికి ఇవి చిహ్నమని, ఇవి తమ సంస్కృతిని పాడుచేస్తాయని వీటిపై బ్యాన్ విధించారట. -
మల్లెపూల ఎఫెక్ట్.. అస్ట్రేలియా అధికారులకు నటి లేఖ
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఆమె మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో దిగారు. అయితే, తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం. ఈ క్రమంలోనే నవ్య నాయర్ బ్యాగులో పూలు లభించడంతో ఆమెకు రూ. 1.14లక్షల జరిమానా విధించారు. ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు.తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖకు నవ్య నాయర్ లేఖ రాశారు. ఆపై ఆస్ట్రేలియన్ కస్టమ్స్ అధికారులకు కూడా ఆమె లేఖను పంపారు. "జరిమానా విధించిన తర్వాత నేను ఒక విధంగా షాక్ అయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవంగా ఆరోజు నా బ్యాగ్‌లో పువ్వులు తీసుకెళ్లనే లేదు. పువ్వులు నా జుట్టుమీద మాత్రమే ఉన్నాయి. అది అందరికీ బహిరంగంగానే కనిపిస్తుంది. దానిని నేను ఏమీ దాచలేదు. కానీ, నా బ్యాగులో మొదట పువ్వులు ఉంచడం వల్ల ఎయిర్‌పోర్ట్‌లోని స్నిఫర్ డాగ్స్ పసిగట్టాయి. బ్యాగులో ఒకటి లేదా రెండు ఫ్లవర్ బాగాలు ఉండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు ఫైన్ వేశారు. 28రోజుల్లో చెల్లించాలని కోరారు' అని ఆమె చెప్పారు.ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖను మెయిల్ ద్వారా నవ్య నాయర్ సంప్రదించారు. 'జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పాను. జరిమానా మొత్తాన్ని మాఫీ చేయమని కోరాను. వారు మాఫీ చేయకపోతే రూ. 26వేలు వసూలు చేస్తారని ఒక ఆర్టికల్‌లో చదివాను. ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే నాకు వేరే మార్గం లేదు. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి. ' అని ఆమె అన్నారు.ఆస్ట్రేలియాలో ఎందుకు నిషేదం..?బయోసెక్యూరిటీ నియమాల ప్రకారం మల్లెపూలతో పాటు ఇతర మొక్కలు, పూలు, గింజలు, కాయగూరలు, మట్టి, జంతు సంబంధిత ఉత్పత్తులు తీసుకెళ్లినా కూడా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. వాటి ద్వారా ఆయా క్రిమికీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని, ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని వారు కనుగొన్నారు. -
మూరెడు పూల మూల్యం లక్షకు పైగానే!
మీరు ఆస్ట్రేలియా వెళుతున్నారా? అయితే అక్కడి చట్టాలు, నియమ నిబంధనల గురించి కాస్తంత తెలుసుకుని ఆ తర్వాతే వెళ్లండి. ఎందుకంటే అక్కడ బ్యాగులో పూలు పెట్టుకోవడం కూడా తప్పే! మరీ ముఖ్యంగా బయటి నుంచి పూలు తీసుకువెళ్లామా... భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. ఇదెక్కడి చోద్యం... అంటారా? చోద్యం కాదు.. నిజం. ఎందుకంటే మలయాళ నటి నవ్యా నాయర్ విషయంలో అదే జరిగింది. ఓనమ్ పండుగ వేడుకలలో పాల్గొనేందుకు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్, తండ్రి ప్రేమతో ఇచ్చిన మల్లెచెండులో కొంత తలలో పెట్టుకుని మిగిలింది తర్వాత పెట్టుకుందాం లే అని బ్యాగ్‌లో పెట్టుకుందట. మెల్బోర్న్ విమానాశ్రయంలో ‘కష్టమ్స్’ అధికారులు ఆమె బ్యాగ్‌ను చెక్ చేసేటప్పుడు ఈ పూలమాల బయట పడిందట. అంతే! వారు ఆమె ఏదో ఘోర నేరం చేసినట్లు చూసింది చాలక, 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారట. (మన రూపాయలలో అది దాదాపు లక్షా పద్నాలుగు వేలు) ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం బయటి నుంచి పూలు, మొక్కలు, విత్తనాల వంటివి తీసుకు రావడం నేరమట. ఎందుకంటే బయటినుంచి వచ్చే ఇటువంటి వాటివల్ల అంటువ్యాధులు, వాతావరణ కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉందట. అందుకే అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఈ విషయాన్ని నటి నవ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘‘మా నాన్న ఇచ్చిన మూరెడు పూల చెండు మూల్యం అక్షరాలా లక్షా పద్నాలుగు వేల పైమాటే’’ అని కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం మంచిదే అయింది.. లేకపోతే అది తెలియని మన వాళ్లు తలనిండా పూలు తురుముకుని బ్యాగులో మరికాసిని పెట్టుకుని ఆస్ట్రేలియా వెళితే మన కరెన్సీలో సంచెడు రూపాయలు చలానాగా కట్టాల్సి వస్తుంది! -
విలువ లెక్కవేసే విధంబెట్టిదనిన..
ఒక వస్తువు యొక్క విలువ అనేది.. దాని తయారీ, ఉత్పత్తికి కాగల ఖర్చు మీదనే ఆధారపడి ఉంటుందని అనుకుంటాం. కానీ.. చాలా సందర్భాల్లో ఇంకా అనేకానేక కారణాల వల్ల.. విలువ ఏర్పడడం జరుగుతుంది. పైగా విలువ అనేది సాపేక్షికం కూడా.ఫరెగ్జాంపుల్.. ఒక క్షణం యొక్క విలువ ఎంత అని అడిగితే.. పొద్దస్తమానం టీవీ చూసుకుంటూ, మొబైల్ లో రీల్స్ చూసుకుంటూ గడిపే వాడు.. మిమ్మల్ని చూసి జాలిగా నవ్వుతాడు. ఒక క్షణానికి కూడా విలువ ఉంటుందా? అంటాడు! నా దగ్గర బోలెడు గంటలు ఖాళీగా ఉన్నాయి.. ఏదైనా విలువ కట్టి యివ్వు.. అని కూడా రెట్టిస్తాడు. కానీ.. ఒక ఘోరమైన యాక్సిడెంట్ లో రెప్పపాటులో ప్రాణం పోకుండా తప్పించుకున్న వాడిని అడిగిచూడండి.. ఒక క్షణం యొక్క విలువ ఎంతో చాలా చక్కగా చెప్తాడు.‘రోమ్ లో బతుకుతున్నప్పుడు.. రోమన్ లాగానే బతుకు’ అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. చాలా మందికి ఈ సామెతలోని ఆంతర్యం అర్థం కాదు. మనం ఏ ప్రాంతంలో ఉండదలచుకుంటే, ఏ ప్రాంతానికి వెళ్లదలచుకుంటే.. ఆ ప్రాంత ధర్మాన్ని పాటించడం నేర్చుకోవాలి. ముందుగా.. ఆ ప్రాంతానికి ఉండే ‘ధర్మం’ ఏమిటో తెలుసుకోవాలి! వ్యక్తులకు కొన్ని గుణగణాలు, వ్యక్తిత్వ విశేషాలు ఉన్నట్లుగానే.. ప్రాంతాలకు కూడా కొన్ని గుణగణాలు, నియమనిబంధనలు ఉంటాయి. వాటిని ముందు మనం పాటించాలి. పాటించాలంటే.. ముందుగా అవేమిటో మనం తెలుసుకోవాలి. అలా కాకుండా.. నేను మోనార్క్ ని. నేను ఎవ్వడి మాటా వినను. నాకు తలచిందే చేస్తా.. అని విర్రవీగే పనైతే, అలాంటి వారు తమ ఇల్లుదాటకుండా బతికేయాలి. మరొకరి ఎరీనాలోకి ఎంటర్ కాకూడదు!మానవ సంబంధాలను కొనసాగించే విషయంలో అతిగొప్ప వ్యక్తిత్వ వికాస లక్షణం ఇది. ఎదుటి వారి అభిప్రాయాల్ని, ఎదుటి వారి అలవాట్లను గౌరవించగలిగితేనే నీకు వారితో మానవసంబంధాలు పదిలంగా ఉంటాయి. మన అలవాట్ల ప్రకారం, మన ఇష్టాయిష్టాల ప్రకారం ఎదుటి వాళ్లు నడుచుకోవాలని కోరుకోవడం వర్కవుట్ కాదు.అదే మాదిరిగా ఒక పని యొక్క, ఒక వస్తువు యొక్క విలువ కూడా స్థల కాల నియమాలను బట్టి, ప్రాంత ధర్మాన్ని బట్టి మారిపోతుంటుంది. ఒక వాటర్ బాటిల్ ఖరీదు మామూలుగా ఇరవై రూపాయలు కావొచ్చు. కానీ ఎడారిలో దారితప్పిన, కొన్ని రోజులుగా అలమటిస్తున్న ఓ కుబేరుడికి అమ్మితే అతను లక్షల్లో దానికి విలువ కట్టవచ్చు. అంటే ఒకే వస్తువు విలువ మారిపోయినట్టే కదా! ఇలాంటి అనుభవమే..కేరళకు చెందిన సినీనటి నవ్య నాయర్‌కు ఎక్కువైంది. ఆమె ఇటీవల మెల్ బోర్న్ ప్రయాణం పెట్టుకుంది. బయల్దేరేప్పుడు.. తండ్రి ఓ మూరెడు మల్లెపూలు తెచ్చి ఇచ్చారు. బహుశా ఏ యాభై రూపాయలో పెట్టి తెచ్చి ఉండొచ్చు. అక్కడకు వెళ్లి విమానం దిగిన తరువాత.. వాటిని సిగలో తురుముకోవచ్చునని అనుకున్నదో ఏమో.. మొత్తానికి హ్యాండ్ బ్యాగులో పెట్టుకుంది. తీరా మెల్ బోర్న్ లో దిగిన తర్వాత.. అధికారుల తనిఖీల తర్వాత ఆమెకు అర్థమైన సంగతి ఏంటంటే.. కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలు అమలయ్యే ఆస్ట్రేలియాకు ఇతర దేశాల నుంచి మల్లెపూలు తేవడం నిషేధం. ఆ సంగతి ఆమెకు అర్థమయ్యేలోగా.. ఆమెకు లక్షరూపాయల జరిమానా పడింది. తప్పేదేముంది. అప్పటికి చెల్లించింది గానీ.. ఆ తర్వాత కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన కోసం కొన్న మల్లెపూల ఖరీదు.. మూర లక్షరూపాయలు అంటూ.. తన మీద తనే సెటైరు వేసుకుని అందరినీ నవ్వించింది. నిజమే కదా.. ఆమె మల్లెపూల విలువ లెక్కకడితే లక్షరూపాయలే!రోమ్ నగరం సామెతను పైన చెప్పుకున్నది అందుకే! మనం ఒక ప్రాంతానికి వెళుతున్నామంటే.. అక్కడి ధర్మాన్ని ముందుగా అర్థం చేసుకుని వెళ్లాలి. లేకపోతే మనం అనుకునే విలువలకు, అక్కడ దక్కే, భారంగా మారే విలువలకు మధ్య వ్యత్యాసం భారీగా ఉండొచ్చు. వ్యక్తి యూనిట్ గా చూసినప్పుడు.. ఎదుటి వారిని గౌరవించడం, ఎదుటి వారి గురించి ముందే తెలుసుకోవడం.. జీవితంలో బంధాలు నిలబడడానికి, విలువలు మారిపోయి నష్టాలు వాటిల్లకుండా ఉండడానికి చాల ముఖ్యం అని అర్థమవుతుంది.:::ఎం. రాజేశ్వరి -
మూరెడు మల్లెపూలే కాదు.. వీటితోనూ తంటాలే!
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్‌కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్‌పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?.. ఓనం ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్‌పోర్టులో దిగారు. అయితే.. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు. మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్జామూన్, మైసూర్ పాక్, సోన్‌పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే. ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్‌కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!. నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్‌లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ, ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్‌లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్‌తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు. -
మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా
జడకు పెట్టుకున్న మల్లెపూలు.. ప్రముఖ నటిని చిక్కుల్లో పడేశాయి. ఏకంగా రూ.లక్ష ఫైన్ కట్టించేలా చేశాయి. ఈ విషయాన్ని సదరు నటి బయటపెట్టింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది?మలయాళ నటి నవ్య నాయర్.. రీసెంట్గా ఓనం సెలబ్రేషన్స్ కోసం ఓ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే మెల్బోర్న్ విమానాశ్రయంలో దిగేటప్పుడు మల్లెపూలని తన బ్యాగులో పెట్టుకుంది. వీటిని చూసి ఎయిర్పోర్ట్ అధికారులు.. ఈమెకు 1980 ఆస్ట్రేలియన్ డాలర్స్ జరిమానా విధించారు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1.14 లక్షలు.(ఇదీ చదవండి: నేను వెళ్లిపోవడానికి కూడా రెడీ.. బిగ్‌బాస్ 9 Day 1 ప్రోమోస్ రిలీజ్)కఠినమైన బయోసెక్యూరిటీ ఉన్న విమానాశ్రయాల్లో మెల్బోర్న్ ఒకటి. పండ్లు, విత్తనాలు, పూలు తీసుకెళ్లడం ఇక్కడ నిషిద్ధం. వీటి వల్ల వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉండటంతోనే అధికారులు ఈ నిబంధన పెట్టారు. ఇది తెలియని నటి నవ్య నాయర్.. తన బ్యాగులో మల్లెపూలు పెట్టేసింది. దాన్ని గుర్తించిన సిబ్బంది.. జరిమానా విధించారు. 28 రోజుల్లోపు ఈ మొత్తం కట్టాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈమెకు చెప్పారు.విమానాశ్రయంలో ఈ తతంగమంతా జరిగిన తర్వాత మెల్బోర్న్లో ఓనం ఈవెంట్ లో పాల్గొన్న నవ్య నాయర్.. అక్కడ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది. తాను తీసుకువచ్చిన పూలు.. లక్ష రూపాయలు ఖరీదైనవనని ఫైన్ వేసేవరకు తనకు తెలియదని తనపై తానే కౌంటర్ వేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) -
Navya Nair : స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నవ్య నాయర్ (ఫోటోలు)
-
కొత్త కారు కొన్న హీరోయిన్.. వాడిన చీరలు అమ్మడమే ఆమె బిజినెస్! (ఫోటోలు)
-
కొత్త కారు కొన్న హీరోయిన్.. భర్తతో విడిపోయిందా?
కన్నడ హీరో దర్శన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గజ ఒకటి. ఈ మూవీ హీరోయిన్ నవ్య నాయర్ అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఈమె అసలు పేరు ధన్య వీణ. కానీ సినిమాల్లోకి వచ్చేవారికి ఈ పేరేం బాగుంటుందని దర్శకుడు శిబి మలయిళ్ తనకు నవ్య నాయర్ అని నామకరణం చేశాడు. ఈ హీరోయిన్ మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసి అక్కడే స్థిరపడిపోయింది. కొత్త కారుకన్నడలో దృశ్యం 1, 2 చిత్రాల్లోనూ నటించింది. తాజాగా ఈమె కొత్త కారు కొనుక్కుంది. బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న ఆమె అందుకోసం రూ.1.3 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ కారు ముందు కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే యూట్యూబ్‌లో వ్లాగ్ పెట్టింది. ఈ ఫోటోలు, వీడియోలలో ఎక్కడా ఆమె భర్త కనిపించలేదు. ఇది చూసిన జనాలు నీ భర్త ఎక్కడంటూ నటిని నిలదీస్తున్నారు. అదేంటి? నువ్వు సింగిల్ మదర్వా? నీ భర్తతో కలిసున్నావా? లేక విడిపోయావా? అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి దీనికి నవ్య ఏమని సమాధానమిస్తుందో చూడాలి!పాత చీరల బిజినెస్నవ్యకు 2010లో బిజినెస్మెన్ సంతోష్ మీనన్‌తో పెళ్లయింది. వివాహం తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె కేరళ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ పరిణామాల తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య చీరల బిజినెస్ కూడా ప్రారంభించింది. తను వాడిన చీరలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. అటు డ్యాన్స్ క్లాసుల ద్వారానూ సంపాదిస్తోంది. View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) చదవండి: కత్రినా లేకుండానే ఫంక్షన్‌కు.. నటితో హీరో స్టెప్పులు.. -
పాత చీరలు అమ్ముతున్న హీరోయిన్.. ఒక్కోటి వేలల్లోనే!
నవ్య నాయర్.. ఈమె ఒక మలయాళ హీరోయిన్. చిన్నప్పుడే డ్యాన్స్ నేర్చుకుంది. క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఈమె అసలు పేరు ధన్య వీణ. కానీ స్క్రీన్‌పై ఆ పేరు బాగోదని నవ్య నాయర్‌గా మార్చుకుంది. 2001లో ఇష్టం సినిమాతో హీరోయిన్గా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమా సక్సెస్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి. నచ్చిందల్లా చేసుకుంటూ పోయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. అలా తమిళ, కన్నడ భాషల్లోనూ చిత్రాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె రెండేళ్ల క్రితమే రీఎంట్రీ ఇచ్చింది. వాడిన చీరలు అమ్మకానికి.. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మాతంగి స్కూల్ పేరిట క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తోంది నవ్య. తాజాగా మరో బిజినెస్ మొదలుపెట్టింది. తన చీరలను అమ్మేందుకు ప్రీలవ్డ్ బై నవ్యనాయర్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచింది. ఇందులో కట్టుకుని వదిలేసిన చీరలను అమ్మకానికి పెట్టింది. కాంచీపురం, బనారస్ సహా అనేక రకాల చీరలు ఇందులో అమ్మకానికి ఉన్నాయి. రూ.2,500 నుంచి రూ.5000 పై చిలుకు ఖరీదైన చీరలున్నాయి. డెలివరీ చార్జీలు అదనం! ఒక్కో చీర ఖరీదు.. ప్రస్తుతానికైతే ఆరు చీరల ఫోటోలు అప్లోడ్ చేశారు. అందులో ఒక చీర ఖరీదు రూ.2500 కాగా బ్లౌజ్ కూడా కావాలంటే రూ.5000 చెల్లించాలని చెప్తున్నారు. షిప్పింగ్ చార్జీలు అదనమని రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు నటిపై సెటైర్లు వేస్తున్నారు. ఇంత రేటు పెట్టి పాత చీర కొనాలా? అయినా పేదవారికి ఫ్రీగా ఇవ్వొచ్చుగా.. ఇక్కడ కూడా డబ్బులు సంపాదించాలనే తాపత్రయమేనా? అని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Pre-Loved By Navya Nair (@prelovedbynavyanair) View this post on Instagram A post shared by Navya Nair (@navyanair143) చదవండి: సూర్యను ఇచ్చేయమన్న వీరాభిమాని.. జ్యోతిక ఏమందంటే? అమ్మ నాగబాబు.. ఇంత కడుపు మంట? -
హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు
మనీలాండరింగ్ కేసులో మలయాళ ప్రముఖ నటి నవ్య నాయర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్‌తో నవ్య నాయర్‌కు సన్నిహిత స్నేహం ఉందని ఈడీ గుర్తించింది. ఈ కేసులో నవ్య నాయర్‌ను ముంబయికి పిలిపించి ఈడీ ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ అవుతానని ఊహించలేదు..ఆ చిత్రం నాకు చాలా స్పెషల్: ఆనంది) సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సచిన్ సావంత్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆదారాలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా అతని మొబైల్ డేటాను అధికారులు పరిశీలించారు. అందులో వాట్సప్ ద్వారా ఆయన చేసిన చాటింగ్స్ స్టేట్మెంట్లను వారు సేకరించారు. దీనిలో భాగంగానే ఆయనతో నవ్య నాయర్‌కు మంచి పరిచియమే ఉందని ఈడీ గుర్తించింది. వాటి అధారంగా ఐఆర్ఎస్ అధికారి సచిన్ సావంత్, నవ్య నాయర్ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నటి నవ్య నాయర్‌ని కలిసేందుకు సచిన్ సావంత్ సుమారు 10 సార్లు పైగానే కొచ్చిన్‌కు కూడా వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈడీ ప్రశ్నిస్తే... తనకు సచిన్ సావంత్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపింది. తామిద్దరం కేవలం స్నేహితులమనే తెలిపింది. కానీ నవ్య నాయర్‌కు సచిన్ సావంత్ నగలతోపాటు కొన్ని బహుమతులు ఇచ్చాడని పక్కా ఆధారాలతో విచారణలో తేలింది. దీనికి సమాధానంగా సచిన్ తమ స్నేహానికి గుర్తుగా కొన్ని నగలను బహుమతిగా ఇచ్చాడని నవ్య నాయర్ తెలిపింది. ఆమె వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఈడీ జత చేసింది. ఎవరీ సచిన్ సావంత్ సచిన్ సావంత్ గతంలో ముంబైలోని జోనల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా (ED) నియమించబడ్డారు . సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అతన్ని అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సచిన్ సావంత్ పేరును చేర్చింది. ప్రస్తుతం కస్టమ్స్, జీఎస్టీ అదనపు కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నాడు. అతను భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారలు లభించడంతో సీబీఐ ఎంట్రీ ఇచ్చి అతన్ని విచారిస్తుంది. ఈ విచారణలో కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులు, సన్నీహితుల పేర్లతో పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగానే మలయాళ నటి నవ్య నాయర్ పేరు తెరపైకి వచ్చింది. -
ఓవర్ మేకప్: సారీ చెప్పిన నటి
అతిగా మేకప్ వేసుకొని స్టేజ్ షోలో పాల్గొన్న నటిపై సోషల్ మీడియాలో రియాక్షన్ ఎక్కువవ్వడంతో చివరకు సారీ చెప్పింది. గతవారం తిరువనంతపురంలో జరిగిన ఏసియా నెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్లో మలయాళం నటి నవ్యా నాయర్ మామూలు కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో మేకప్‌తో కనిపించారు. అప్పటి నుంచి సదరు నటిపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు ఎక్కువయ్యాయి. కావ్య మేకప్ ఎక్కువగా ఉన్న ఫోటోలతో జోకులు, కామెంట్లు వైరల్ అయ్యాయి. తాను అతిగా వేసుకున్న మేకప్‌కు ఎక్కువ మొత్తంలో కామెంట్లు పేలడంతో చివరకు కావ్య నాయర్ దిగివచ్చారు. 'ఏసియానెట్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్లో నా మేకప్ పై చాలా మేసేజ్‌లు పర్సనల్‌గా నాకు వస్తున్నాయి. ఆ రోజు నాకు మేకప్ నిజంగానే ఎక్కువయింది. ఆ మేకప్‌తో అభిమానులకు నన్ను చూడటం కొంచెం ఇబ్బందికరంగానే ఉండి ఉంటుంది. నన్ను ఇష్టపడే వారికి నా మేకప్ నిరాశ కలిగించి ఉంటుంది. చిన్న తప్పైనా.. తప్పు తప్పే. మిమ్మల్ని నిరాశ పరిచనందుకు సారీ. ఈ విషయంలో మేకప్ ఆర్టిస్ట్‌ను నిందించడం సరికాదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది' అని తన ఫేస్ బుక్ పేజీలో అభిమానులకు ఇలా క్షమాపణలు చెప్పారు.