కన్నడ హీరో దర్శన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గజ ఒకటి. ఈ మూవీ హీరోయిన్ నవ్య నాయర్ అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఈమె అసలు పేరు ధన్య వీణ. కానీ సినిమాల్లోకి వచ్చేవారికి ఈ పేరేం బాగుంటుందని దర్శకుడు శిబి మలయిళ్ తనకు నవ్య నాయర్ అని నామకరణం చేశాడు. ఈ హీరోయిన్ మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసి అక్కడే స్థిరపడిపోయింది.
కొత్త కారు
కన్నడలో దృశ్యం 1, 2 చిత్రాల్లోనూ నటించింది. తాజాగా ఈమె కొత్త కారు కొనుక్కుంది. బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న ఆమె అందుకోసం రూ.1.3 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ కారు ముందు కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే యూట్యూబ్‌లో వ్లాగ్ పెట్టింది. ఈ ఫోటోలు, వీడియోలలో ఎక్కడా ఆమె భర్త కనిపించలేదు. ఇది చూసిన జనాలు నీ భర్త ఎక్కడంటూ నటిని నిలదీస్తున్నారు. అదేంటి? నువ్వు సింగిల్ మదర్‌వా? నీ భర్తతో కలిసున్నావా? లేక విడిపోయావా? అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి దీనికి నవ్య ఏమని సమాధానమిస్తుందో చూడాలి!
పాత చీరల బిజినెస్
నవ్యకు 2010లో బిజినెస్‌మెన్ సంతోష్ మీనన్‌తో పెళ్లయింది. వివాహం తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె కేరళ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. కరోనా, లాక్‌డౌన్ పరిణామాల తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య చీరల బిజినెస్ కూడా ప్రారంభించింది. తను వాడిన చీరలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. అటు డ్యాన్స్ క్లాసుల ద్వారానూ సంపాదిస్తోంది.
చదవండి: కత్రినా లేకుండానే ఫంక్షన్‌కు.. నటితో హీరో స్టెప్పులు..
Comments
Please login to add a commentAdd a comment