పాత చీరలు అమ్ముతున్న హీరోయిన్‌.. ఒక్కోటి వేలల్లోనే! | Navya Nair New Venture: Old Sarees For Sale | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ నయా బిజినెస్‌! వాడిపడేసిన చీరలు అమ్మకానికి..

Published Thu, Mar 21 2024 5:49 PM | Last Updated on Thu, Mar 21 2024 6:16 PM

Navya Nair New Venture: Old Sarees For Sale - Sakshi

నవ్య నాయర్‌.. ఈమె ఒక మలయాళ హీరోయిన్‌. చిన్నప్పుడే డ్యాన్స్‌ నేర్చుకుంది. క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఈమె అసలు పేరు ధన్య వీణ. కానీ స్క్రీన్‌పై ఆ పేరు బాగోదని నవ్య నాయర్‌గా మార్చుకుంది. 2001లో ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమా సక్సెస్‌ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి. నచ్చిందల్లా చేసుకుంటూ పోయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. అలా తమిళ, కన్నడ భాషల్లోనూ చిత్రాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె రెండేళ్ల క్రితమే రీఎంట్రీ ఇచ్చింది.


 
వాడిన చీరలు అమ్మకానికి..
ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క మాతంగి స్కూల్‌ పేరిట క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తోంది నవ్య. తాజాగా మరో బిజినెస్‌ మొదలుపెట్టింది. తన చీరలను అమ్మేందుకు ప్రీలవ్‌డ్‌ బై నవ్యనాయర్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచింది. ఇందులో కట్టుకుని వదిలేసిన చీరలను అమ్మకానికి పెట్టింది. కాంచీపురం, బనారస్‌ సహా అనేక రకాల చీరలు ఇందులో అమ్మకానికి ఉన్నాయి. రూ.2,500 నుంచి రూ.5000 పై చిలుకు ఖరీదైన చీరలున్నాయి. డెలివరీ చార్జీలు అదనం!

ఒక్కో చీర ఖరీదు..
ప్రస్తుతానికైతే ఆరు చీరల ఫోటోలు అప్‌లోడ్‌ చేశారు. అందులో ఒక చీర ఖరీదు రూ.2500 కాగా బ్లౌజ్‌ కూడా కావాలంటే రూ.5000 చెల్లించాలని చెప్తున్నారు. షిప్పింగ్‌ చార్జీలు అదనమని రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు నటిపై సెటైర్లు వేస్తున్నారు. ఇంత రేటు పెట్టి పాత చీర కొనాలా? అయినా పేదవారికి ఫ్రీగా ఇవ్వొచ్చుగా.. ఇక్కడ కూడా డబ్బులు సంపాదించాలనే తాపత్రయమేనా? అని మండిపడుతున్నారు.

చదవండి: సూర్యను ఇచ్చేయమన్న వీరాభిమాని.. జ్యోతిక ఏమందంటే?
అమ్మ నాగబాబు.. ఇంత కడుపు మంట?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement