మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్ | Manju Warrier Comments About Husband Dileep Latest News | Sakshi
Sakshi News home page

Manju Warrier: భర్త గురించి అడిగారు.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్

Published Wed, Feb 7 2024 7:55 AM | Last Updated on Wed, Feb 7 2024 9:14 AM

Manju Warrier Comments About Husband Dileep Latest - Sakshi

మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలుసు. సొంత భాషలో సినిమాలు చేస్తూ  బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తమిళంలోనూ సీనియర్‌ హీరోల సరసన నటిస్తోంది. ధనుష్‌ 'అసురన్‌' మూవీతో కోలీవుడ్‌కు పరిచయమైన మంజు.. ఆ తర్వాత అజిత్‌‌తోనూ నటించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రజనీకాంత్‌ కొత్త మూవీలో యాక్ట్ చేస్తోంది. 

(ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?)

ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న మంజూ వారియర్.. గతంలో మలయాళ నటుడు దిలీప్‌‌ని పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు.. కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు  మంజూ వారియర్‌ దగ్గరే ఉంటున్నాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భర్త గురించి మంజూ వారియర్‌కి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిచ్చిన ఈ హీరోయిన్.. 'ఆ ఒక్కటి అడగొద్దు' అని క్లారిటీ ఇచ్చేసింది. తన బిడ్డతో కలిసి తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈమె తమిళంలో పాటు మలయాళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement