మలయాళ బ్యూటీ అర్థనా బిను సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత తమిళ, మలయాళ భాషల్లోనే వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె తన తండ్రి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తనను నటించవద్దని బెదిరిస్తున్నాడని ఇటీవలే తండ్రి, నటుడు విజయకుమార్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! దీనిపై విజయకుమమార్ స్పందిస్తూ.. తానేమీ దొంగచాటుగా ఇంట్లోకి చొరబడలేదని తన కూతుళ్లు అక్కడున్నారా? లేదా చూడటానికే వెళ్లానని చెప్పుకొచ్చాడు.
తాజాగా అతడి వ్యాఖ్యలపై అర్థనా బిను స్పందిస్తూ.. 'నా మీద నా కుటుంబం మీద నా తండ్రి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. మా నాన్న మమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్తుంటే మీకది జిమ్మిక్కుగా అనిపిస్తుందేమో! నిజం తెలియాలంటే మీరు ఇది పూర్తిగా చదవాలి. అప్పుడే అతడు మమ్మల్ని ఎంతగా బాధపెట్టాడో మీకర్థమవుతుంది.
1. నా సోదరి అతడి కోసం ఇంటి ద్వారం తెలిస్తే లోనికి వచ్చానని చెప్పిన మాట అబద్ధం. అతడి వాదనలు నిజమైతే మరి గేటు గుండా వెళ్లకుండా గోడ దూకి వెళ్లడం దేనికి? నేను పోస్ట్ చేసిన వీడియోలో అతడు గోడ దూకి రావడం మీరు స్పష్టంగా చూడవచ్చు. మా ఇంట్లో నేను, అమ్మ, చెల్లి, నానమ్మ ఉంటున్నాం. రేపు ఇతడిని చూసి ఇంకెవరైనా గోడ దూకి వస్తే మా పరిస్థితి ఏంటి?
2. అతడు ఇంటర్వ్యూలలో చట్టపరంగా ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదని చెప్తున్నాడు. కానీ కోర్టు ఇదివరకే మా అమ్మకు, తనకు విడాకులు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని ఈ పోస్ట్‌లో పొందుపరుస్తున్నాను.
3.మా చెల్లి చదువు కోసం జూలై 3న మా అమ్మ బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు డిపాజిట్ చేశానని తను చెప్తున్నాడు. అది అబద్ధం. అతడు అమ్మకు రూ.10 లక్షలు, బంగారం బాకీ ఉన్నాడు. దీనిపై అమ్మ పెట్టిన కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి నెల రూ.5000 మా అమ్మకు ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. కానీ అది కూడా సరిగా చెల్లించక మాకు బకాయిపడ్డాడు. అలా వాయిదా పడ్డ డబ్బే అతడు చెల్లించాడు.
4. అతడు పంపిన రూ.40 వేలు అందాయో, లేదో తెలుసుకుందామని ఇంటికి వచ్చానన్నాడు. కానీ అతడు డబ్బు పంపానని చెప్పగానే అమ్మ థాంక్యూ అని మెసేజ్ చేసింది.
5. నేను జరిగిన పరిణామాలపై కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అప్పటికే వేసిన కేసులే ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ కొత్త ఫిర్యాదులు వద్దని అమ్మ అంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ సుదీర్ఘ నోట్ షేర్ చేసింది హీరోయిన్.
Comments
Please login to add a commentAdd a comment