ఓవర్ మేకప్: సారీ చెప్పిన నటి | Trolls make actor Navya Nair apologise for her 'weird makeup' | Sakshi
Sakshi News home page

ఓవర్ మేకప్: సారీ చెప్పిన నటి

Published Sun, Feb 21 2016 5:50 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

ఓవర్ మేకప్: సారీ చెప్పిన నటి - Sakshi

ఓవర్ మేకప్: సారీ చెప్పిన నటి

అతిగా మేకప్ వేసుకొని స్టేజ్ షోలో పాల్గొన్న నటిపై సోషల్ మీడియాలో రియాక్షన్ ఎక్కువవ్వడంతో చివరకు సారీ చెప్పింది. గతవారం తిరువనంతపురంలో జరిగిన ఏసియా నెట్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో మలయాళం నటి నవ్యా నాయర్ మామూలు కన్నా కొంచెం ఎక్కువ మోతాదులో మేకప్‌తో కనిపించారు. అప్పటి నుంచి సదరు నటిపై సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు ఎక్కువయ్యాయి. కావ్య మేకప్ ఎక్కువగా ఉన్న ఫోటోలతో జోకులు, కామెంట్లు వైరల్ అయ్యాయి. తాను అతిగా వేసుకున్న మేకప్‌కు ఎక్కువ మొత్తంలో కామెంట్లు పేలడంతో చివరకు కావ్య నాయర్ దిగివచ్చారు.

'ఏసియానెట్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్‌లో నా మేకప్ పై చాలా మేసేజ్‌లు పర్సనల్‌గా నాకు వస్తున్నాయి. ఆ రోజు నాకు మేకప్ నిజంగానే ఎక్కువయింది. ఆ మేకప్‌తో అభిమానులకు నన్ను చూడటం కొంచెం ఇబ్బందికరంగానే ఉండి ఉంటుంది. నన్ను ఇష్టపడే వారికి నా మేకప్ నిరాశ కలిగించి ఉంటుంది. చిన్న తప్పైనా.. తప్పు తప్పే. మిమ్మల్ని నిరాశ పరిచనందుకు సారీ. ఈ విషయంలో  మేకప్ ఆర్టిస్ట్‌ను నిందించడం సరికాదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది' అని తన ఫేస్ బుక్ పేజీలో అభిమానులకు ఇలా క్షమాపణలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement