ఆదిలాబాద్: రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు.
వీటితోపాటు అధునాతన పరికరాలు సిటీ స్కానింగ్, డయాలసిస్ సెంటర్, డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈ హెల్త్‌సెంటర్, పేయింగ్ రూమ్స్, పీడియాట్రిక్ ఐసీయూ, టెలీమెడిసిన్ సెంటర్లను మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో సింగిల్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో 10 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment