Artificial Intelligence: 2023లో సంచనలం సృష్టించిన టెక్నాలజీ ఏదైనా ఉందంటే.. అది తప్పకుండా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) అనే చెప్పాలి. స్మార్ట్‌ఫోన్లే కుండా ఈ రోజుల్లో మనిషి ఎలా అయితే ఉండలేక పోతున్నాడో.. నేడు AI సహాయం లేకుండా కూడా ఉండలేడేమో అన్నట్టుగా అయిపోతోంది. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తూ వినియోగదారులను తెగ ఆకర్శించిన ఈ టెక్నాలజీ ప్రభావం ఎంతగా ఉందనే విషయాన్ని ఈ కథనంలో పరిశీలిద్దాం..
ఆరోగ్య సంరక్షణలో ఏఐ హస్తం
ఓ వైపు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మనిషి ఆయుఃప్రమాణం తగ్గుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. దీని కోసం ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. వర్కౌట్ ప్లాన్స్, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్లాన్స్, మైండ్‌ఫుల్‌నెస్ అండ్ మెడిటేషన్, మెడికల్ సింప్టమ్ చెకర్, మెంటల్ హెల్త్ సపోర్ట్ వంటి విషయంలో ఎక్కువ మంది టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు.
అటానమస్ సిస్టం (స్వయం ప్రతిపత్తి)
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో చాలామంది ఆటోమాటిక్ విధానానికి అలవాటు పడుతున్నారు. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు నుంచి మానవరహిత వైమానిక వాహనాల వరకు టెక్నాలజీ వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ.. వినియోగించడానికి కొంత భయపడుతున్నట్లు సమాచారం.
అటానమస్ సిస్టం మీద నమ్మకం పెంచడానికి, సమర్థవంతమైన రవాణాకు హామీ ఇవ్వడానికి కొన్ని సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆటోమోటివ్ పరిశ్రమే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో అటానమస్ సిస్టం రాజ్యమేలే అవకాశం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 15 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్‌లో సంచలన ఆవిష్కరణ
లాంగ్వేజ్ ప్రాసెసింగ్
కంప్యూటర్ లాంగ్వేజ్ మాదిరిగా ఏఐ కోసం ప్రత్యేకమైన లాంగ్వేజ్ అంటూ ఏది లేదు. ప్రారంభంలో కేవలం ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అనేక భాషల్లో అందుబాటులోకి వస్తోంది. వివిధ భాషలను ఏఐ అర్థం చేసుకోవడం వల్ల వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూ.. రోజు రోజుకి తనవైపు ఎంతోమంది ప్రజలను ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment