కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉద్యోగులపైన అలాగే ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మరో కంపెనీ తాజాగా సుమారు 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. అమెరికాకు చెందిన అటానమస్ డెలివరీ రోబోట్ స్టార్టప్ న్యూరో తన క్యాపిటల్ రన్‌వేను మరింత విస్తరించడానికి 30 శాతం మంది లేదా 340 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. గత వారంలో న్యూరో కో-ఫౌండర్స్ 'డేవ్ ఫెర్గూసన్ అండ్ జియాజున్ ఝూ' మాట్లాడుతూ.. కంపెనీ సిబ్బందిని తగ్గించి వనరులను వాణిజ్య కార్యకలాపాల నుంచి రీసర్చ్ & డెవెలప్మెంట్ వైపు మారుస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది కంపెనీ తమ మూడవ జనరేషన్ డెలివరీ రోబోట్స్ వాణిజ్య కార్యకలాపాలను పెంచడంతో పాటు వాల్యూమ్ ఉత్పత్తిని ఆలస్యం చేయడానికి తమ ప్రణాళికలను ఫాజ్ చేస్తుంది. ఈ మార్పుల వల్ల కంపెనీ మునుపటికంటే రెండు రెట్లు ఎక్కువ పని చేసే అవకాశం ఉంది.
(ఇదీ చదవండి: Apna Founder Success Story: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!)
గతంలో కూడా కంపెనీ అటానమస్ సిస్టం అభివృద్ధి చేసింది. దీని కోసం కస్టమ్ వెహికల్స్ కూడా రూపొందించింది. అయితే ఈ కొత్త విధానం న్యూరో ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసే అవకాశం ఉందని బలంగా భావిస్తున్నారు. వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు క్యాపిటల్ రన్‌వేను విస్తరించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడం ఇది రెండవ సారి.
కంపెనీ గత ఏడాది నవంబర్ నెలలో కూడా సుమారు 20 శాతం లేదా 300 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఇప్పుడు మరో సారి ఉద్యోగాల కోతలు సుమారు 340 మంది ఉద్యోగులపైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment