సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం
చెన్నై: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డి.లిట్)ను ఆదివారం ప్రదానం చేసింది. కాటాన్ కొళత్తూరులోని వర్సిటీ టీపీ గణేషన్ ఆడిటోరియంలో ఆదివారం ప్రత్యేక స్నాతకోత్సవం జరిగింది. ఆ వర్సిటీ చాన్‌సలర్ పి.సత్యనారాయణన్, యూఎస్ అంబాసిడర్ ఎవన్ శామ్యుల్ డుబెల్‌ల చేతుల మీదుగా సైనా నెహ్వాల్‌కు డి.లిట్ ప్రదానం చేశారు.
అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏఆర్ లక్ష్మణన్‌ను కూడా డి.లిట్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ క్రీడారంగానికి చెందిన తనకు డి.లిట్‌ను ప్రప్రథమంగా ఎస్‌ఆర్‌ఎం ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. మోకాలి గాయంతో రియో ఒలింపిక్స్‌లో సరైన ప్రదర్శన చేయలేకపోయానని తెలిపింది. క్రీడల పరంగా పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించింది.