జైభీమ్‌ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్‌' ఛానెల్‌లో | Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel | Sakshi
Sakshi News home page

Jai Bhim: జైభీమ్‌ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్‌' ఛానెల్‌లో

Published Tue, Jan 18 2022 1:27 PM | Last Updated on Tue, Jan 18 2022 1:41 PM

Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel - Sakshi

Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్‌, వైవిధ్యమైన రోల్స్‌లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్‌ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్‌'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్‌తో  ప్రేమాయణం, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించి, సూపర్‌ డూపర్‌ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. 

అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్‌ హిట్‌ 'ది షాషాంక్‌ రిడంప్షన్‌' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్‌ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్‌ సినిమాకు ఇలాంటి రేటింగ్‌  రాలేదు. అలాగే గోల్డెన్‌ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినే​ట్‌ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్‌' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ (ఆస్కార్‌) అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో 'సీన్‌ ఎట్‌ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు.

అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్‌ ఛానెల్‌లో జైభీమ్‌ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్‌' ఇండియన్‌ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్‌ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 




ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్‌’ మూవీ ఎలా ఉందంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement