సూర్య తర్వాతి చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ? | Suriya Etharkkum Thunindhavan Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Suriya: సూర్య తర్వాతి చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ?

Published Fri, Nov 19 2021 8:40 PM | Last Updated on Fri, Nov 19 2021 8:45 PM

Suriya Etharkkum Thunindhavan Movie Release Date Out - Sakshi

Suriya Etharkkum Thunindhavan Movie Release Date Out: తమిళ స్టార్‌ హీరో సూర‍్యకు పిచ్చి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన సినిమాల వేగాన్ని పెంచేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'జై భీమ్‌' తో మంచి విజయాన్ని అందుకున్నారు. మరో మూడు నెలల్లో తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'ఎతర్కుమ్‌ తునింధవన్‌' సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదలకు సిద‍్ధంగా ఉంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో ఓ వీడియోని పోస్ట్‌ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌. 

చదవండి: సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్‌కు బంగారు నాణేలు

ఈ వీడియోలో సూర్య మాస్‌ లుక్‌లో మాస్‌ బీట్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహించగా, సన్‌ పిక‍్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌లో సాగనుంది. వినయ్ రాయ్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌, శరణ్య, ఎం.ఎస్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు ఆర్‌. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, డి. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చారు. తమిళ హీరో శివ కార్తికేయన్‌, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ సాహిత్యమందించారు. కొవిడ్‌ కారణంగా సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్‌' రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్‌ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో 'ఎతర్కుమ్‌ తునింధవన్‌'ను థియేటర్లలో విడుదలవనుంది. సుమారు రెండేళ్ల తర్వాత సూర్య వెండితెరపై కనిపించనున‍్నారు. 

చదవండి: ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు :హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement