
చెన్నై సినిమా: జై భీమ్ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటుడు సూర్య కథానా యకుడిగా నటించి తన 2డీ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన జై భీమ్ చిత్రం గత ఏడాది ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విష యం తెలిసిందే. ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. కాగా ఈయన సూర్యను మరోసారి డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కథ సూర్యకు నచ్చేయడంతో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
కాగా ప్రస్తుతం సూర్య బాలా దర్శకత్వంలో ఓ చిత్రం, వెట్రిమారన్ దర్శకత్వంలో 'వాడివాసల్' చిత్రాలను చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
చదవండి: 👉🏾 'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు..