సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్‌కు బంగారు నాణేలు | Actor Suriya Gave Gold Coins To Film Unit | Sakshi
Sakshi News home page

సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్‌కు బంగారు నాణేలు

Published Mon, Nov 15 2021 10:48 AM | Last Updated on Mon, Nov 15 2021 5:49 PM

Actor Suriya Gave Gold Coins To Film Unit - Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా సూర్య నటిస్తున్న 'ఎతర్కుం తునింధావన్‌' చిత్ర యూనిట్‌కు గోల్డ్‌ కాయిన్‌ బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంతకుముందు తమిళనాడుకు చెందిన ఇరులర్​ ట్రైబ్​ (ఆదివాసీల) సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్​ను సూర్య దంపతులు కలిసి ఈ చెక్కును అందజేశారు. 

​‍
'ఎతర్కుం తునింధావన్‌' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్‌ ఇటీవల ప‍్రకటించారు. ఈ సందర్భంగా సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణలు, ఆర్టిస్టులందరికీ  బంగారు నాణేలు బహుకరించినట్లు చిత్ర యూనిట్‌ నుంచి సమాచారం. అలాగే దర్శకత్వం, సినిమాటోగ్రఫీ వంటి పలు విభాగాల్లోని సీనియర్లకు 'సావరీన్‌ కాయిన్స్‌' బహుమతిగా ఇచ్చారట. ఈ బహుమతితో మొత్తం యూనిట్ సంతోషంగా ఉన్నారట. 

సన్‌ పిక్చర‍్స్‌ నిర్మిస్తున్న ఈ చిత‍్రంలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా చేస్తుంది. సూర్య ఇదివరకు లానే ఈ సినిమాలో కూడా సామాజిక అంశాలతో రాబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement