South actors
-
వారిపై న్యాయపోరాటం చేస్తున్న నటి గౌతమి
నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు నటి గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో నటి గౌతమికి భూములున్నాయి. కారైక్కుడికి చెందిన అళగప్పన్.. గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆపై వాటికి నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు. సుమారు రూ. 3కోట్లకు గౌతమి భూమిని ఆమె ప్రమేయం లేకుండా విక్రయించారు. దీంతో రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి వారు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, వారికి బెయిల్ ఇవ్వకూడదని గౌతమి తరఫున హాజరైన న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. -
కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో
నటుడు ధనుష్ మరో యువ దర్శకుడికి చాన్స్ ఇవ్వబోతున్నారన్నది తాజా సమాచారం. తన 50వ చిత్రం 'రాయన్' స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీంతో తన మేనళ్లుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ క్యామియో పాత్రను పోషిస్తున్నారు. అలాగే తెలుగులో కుబేర చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇళయరాజా బయోపిక్‌లో నటించనున్నారు. ఆ తరువాత హెచ్.వినోద్, సెల్వ రాఘవన్, మారి సెల్వరాజ్ల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కాగా తాజాగా యువ దర్శకుడితో పని చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇంతకు ముందు ప్రేమ ప్యార్ కాదల్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఎలన్.. డాడా సినిమాతో పాపులర్ అయిన నటుడు కవిన్ హీరోగా ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కవిన్‌తో 'స్టార్' అనే చిత్రాన్ని ఎలన్ రూపొందిస్తున్నారు. తాజాగా హీరో ధనుష్‌కు ఒక కథను ఎలన్ వినిపించారట.. అది నచ్చడంతో అందులో ధనుస్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎలన్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న స్టార్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ధనుష్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధం అవుతారని సినీ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
వీకింగ్స్ సిరీస్ పాత్రల్లో సౌత్, బాలీవుడ్ నటులు.. ఏఐ మాయాజాలం! (ఫొటోలు)
-
బాలీవుడ్లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్
ఉయ్యాలా జంపాలా చిత్రంతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం 2014లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి హీరో నాగార్జున నిర్మాత కావడం మరింత కలిసొచ్చింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి వరుస సినిమాలతో హీరోయిన్గా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో పాప్ కార్న్ సినిమాతో సహ నిర్మాతగా పలకరించినా అది అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న అవికా గోర్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీలోనే నెపోటిజం ఎక్కువగా ఉంటుందని నటి అవికా గోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రినయ్యా.. నా జీవితం పరిపూర్ణమైంది) 'స్టార్ హీరోల పవర్ మీదే సౌత్ ఇండస్ట్రీ మొత్తం నడుస్తోంది. బాలీవుడ్ కంటే సౌత్‌లో నెపోటిజం కొంచెం ఎక్కువే.. హిందీ చిత్రాలపై అక్కడ పక్షపాతం ఉంది. సౌత్ సినిమాలు నేడు బాలీవుడ్లో చాలా రీమేక్ అవుతున్నాయి. వాటిని ఇక్కడి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అక్కడి వారు మాత్రం బాలీవుడ్ చిత్రాలను పెద్దగా ఇష్టపడరు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మొత్తం బంధుప్రీతితో నిండి ఉంది. ప్రజలు కూడా దానినే ఇష్టపడుతున్నారు. #Bollywood Actress #AvikaGor about Nepotism in #Tollywood. pic.twitter.com/8MCnVpC9Dv— Crazy Buff (@CrazyBuffOffl) June 12, 2023 రాబోయే రోజుల్లో ఇది ఉండకపోవచ్చు' అని తెలిపింది. అవికా గోర్ కామెంట్లపై నెటిజన్లు మండి పడుతున్నారు. సౌత్‌లో అవకాశాలు దక్కించుకొని, మంచి పేరుతో పాటు డబ్బు సంపాదించాక చులకన చేసి మాట్లాడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు. కాగా అవికా గోర్ ప్రస్తుతం 1920 హారర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న '1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళ, హిందీలో విడుదల కాబోతోంది. (ఇదీ చదవండి: సీనియర్ హీరోయిన్‌పై మనుసు పడిన రౌడీబాయ్) -
బాలీవుడ్ రమ్మంది...
మామూలుగా ఉత్తరాది తారలు దక్షిణాదికి ఎక్కువగా వస్తుంటారు. ఈసారి కూడా నార్త్ నుంచి చాలామంది వచ్చారు. అలాగే సౌత్ నుంచి కూడా నార్త్‌కి వెళ్లారు. మన స్టార్స్‌ని బాలీవుడ్ రమ్మంది. ఈ ఏడాది హిందీ తెరపై కనిపించిన కొందరు సౌత్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. కెరీర్లో ఇరవైకి పైగా సినిమాలు చేసిన నాగచైతన్య నటించిన తొలి హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగచైతన్యది కీ రోల్. ఈ హిందీ చిత్రంలో గుంటూరుకు చెందిన తెలుగు కుర్రాడు బాలరాజు పాత్రను చేశారు నాగచైతన్య. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది. ఇక విజయ్ దేవరకొండ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలైంది. మరో హీరో అడివి శేష్ ‘మేజర్’తో హిందీ తెరకు పరిచయం అయ్యారు. ‘గూఢచారి’ చిత్రం తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన అమరవీరుడు ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూర్టీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. అలాగే ఏపీ (ఆంజనేయ పుష్పక్ కుమార్)గా హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పారు సత్యదేవ్. అక్టోబరు 25న రిలీజైన ‘రామసేతు’లోనే ఏపీగా సత్యదేవ్ కీ రోల్ చేశారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకుడు. అయితే బాలీవుడ్‌కు కీలక పాత్ర ద్వారా కాకుండా సత్యదేవ్ హీరోగా పరిచయం కావాల్సింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో జెన్నిఫర్ డైరెక్షన్లో ఆరంభమైన ఓ హిందీ చిత్రంలో సత్యదేవ్ హీరోగా కమిట్ అయ్యారు. కొంత షూటింగ్ జరిగాక ఈ సినిమా ఆగిపోయింది. దీంతో ‘రామసేతు’ సత్యదేవ్‌కి తొలి హిందీ చిత్రంగా నమోదైంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... రష్మికామందన్నా బాలీవుడ్ ఎంట్రీ ‘గుడ్ బై’ చిత్రంతో కుదిరింది. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబరు 7న విడుదలైంది. ఆసక్తికర విషయం ఏంటంటే... రష్మిక కెరీర్లో రిలీజైన తొలి హిందీ చిత్రం ‘గుడ్ బై’ అయినప్పటికీ ఆమె సైన్ చేసిన తొలి హిందీ చిత్రం మాత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక హీరో హీరోయిన్లుగా శాంతను భాగ్చీ తెరకెక్కించిన ‘మిషన్ మజ్ను’ డైరెక్టర్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఓ లీడ్ యాక్ట్రస్‌గా హిందీ తెరకు పరిచయమైంది కూడా ఈ ఏడాదే. రణ్వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో ఈ ఏడాది మేలో రిలీజైన ‘జాయేష్ భాయ్ జోర్ధార్’లో నటించారు షాలిని. 2023లో... ఇక కొందరు తారల బాలీవుడ్ జర్నీ కూడా ఈ ఏడాది ఆరంభమైంది. కానీ వచ్చే ఏడాదే వారు హిందీ తెరపై కనిపించనున్నారు. కెరీర్లో డెబ్బై చిత్రాలు చేశాక బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నయనతార. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జవాన్’ హిందీలో నయనతారకు తొలి చిత్రం. ఇటు అట్లీ చేస్తున్న తొలి హిందీ ఫిల్మ్ కూడా ‘జవాన్’ కావడం విశేషం. ఈ సినిమా వచ్చే జూన్ 2న రిలీజ్ కానుంది. ఇక 2005లో వచ్చిన తెలుగు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ ప్రయాణం ఈ ఏడాది నవంబరులో మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు వరుణ్‌తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడు. మరికొందరు స్టార్స్ కూడా వచ్చే ఏడాది హిందీ తెరపై కనిపించనున్నారు. -
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నటుడు ఆర్కే
సాక్షి, చెన్నై: తాను రాజకీయాల్లోకి మాత్రం రానని నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త ఆర్కే అన్నారు. తొలిచిత్రం ఎల్లామ్ అవన్ సెయల్తోనే యాక్షన్ హీరోగా విజయం సాధించిన ఈయనకు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్‌గానూ గుర్తింపు ఉంది. పలు కొత్త కొత్త ప్రయోగాలతో ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్‌లో కొత్త పుంతలు తొక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ పుల్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈయన ఉత్పత్తుల్లో వీఐపీ హెయిర్ కలర్ షాంపూ ఒకటి. వ్యాపార రంగంలో తన అన్వేషణ కొనసాగుతుందంటున్న ఆర్కేను వివిధ రంగాలలో సాధనకు గాను 11 దేశాల నుంచి 18 గౌరవ డాక్టరేట్ పురస్కారాలు వరించాయి. ఈ అంశంపై గిన్నీస్ రికార్డులకెక్కింది. ఈయన సోమవారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. వ్యాపార రంగంలో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగడమే తన లక్ష్యం అన్నారు. ఎన్ని రంగాలలో ప్రవేశించినా రాజకీయ రంగంలోకి మాత్రం వచ్చే ప్రసక్తే లేదన్నారు. నిజానికి ఆ రంగంలో కుల, మత, స్వార్థం తప్ప సేవా రాజకీయాలు లేవన్నారు. అయితే సినీ రంగానికి మాత్రం దూరం కానని ఆర్కే స్పష్టం చేశారు. -
సూర్య తర్వాతి చిత్రం విడుదల ఎప్పుడో తెలుసా ?
Suriya Etharkkum Thunindhavan Movie Release Date Out: తమిళ స్టార్ హీరో సూర్యకు పిచ్చి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన సినిమాల వేగాన్ని పెంచేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'జై భీమ్' తో మంచి విజయాన్ని అందుకున్నారు. మరో మూడు నెలల్లో తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'ఎతర్కుమ్ తునింధవన్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని ట్విటర్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. చదవండి: సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్‌కు బంగారు నాణేలు ఈ వీడియోలో సూర్య మాస్ లుక్‌లో మాస్ బీట్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌లో సాగనుంది. వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, శరణ్య, ఎం.ఎస్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించగా, డి. ఇమ్మాన్ స్వరాలు సమకూర్చారు. తమిళ హీరో శివ కార్తికేయన్, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సాహిత్యమందించారు. కొవిడ్ కారణంగా సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా', 'జై భీమ్' రెండు చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో 'ఎతర్కుమ్ తునింధవన్'ను థియేటర్లలో విడుదలవనుంది. సుమారు రెండేళ్ల తర్వాత సూర్య వెండితెరపై కనిపించనున్నారు. #EtharkkumThunindhavan is releasing on Feb 4th, 2022!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop #SaranyaPonvannan #MSBhaskar @priyankaamohan #Vinay @sooriofficial @AntonyLRuben @VijaytvpugazhO #ETOnFeb4th pic.twitter.com/hwuwEkX3Bm — Sun Pictures (@sunpictures) November 19, 2021 చదవండి: ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు :హీరో -
సూర్య మంచి మనసు.. ఆ చిత్ర యూనిట్‌కు బంగారు నాణేలు
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా సూర్య నటిస్తున్న 'ఎతర్కుం తునింధావన్' చిత్ర యూనిట్‌కు గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇచ్చి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంతకుముందు తమిళనాడుకు చెందిన ఇరులర్ ట్రైబ్ (ఆదివాసీల) సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను సూర్య దంపతులు కలిసి ఈ చెక్కును అందజేశారు. 'ఎతర్కుం తునింధావన్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణలు, ఆర్టిస్టులందరికీ బంగారు నాణేలు బహుకరించినట్లు చిత్ర యూనిట్ నుంచి సమాచారం. అలాగే దర్శకత్వం, సినిమాటోగ్రఫీ వంటి పలు విభాగాల్లోని సీనియర్లకు 'సావరీన్ కాయిన్స్' బహుమతిగా ఇచ్చారట. ఈ బహుమతితో మొత్తం యూనిట్ సంతోషంగా ఉన్నారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా చేస్తుంది. సూర్య ఇదివరకు లానే ఈ సినిమాలో కూడా సామాజిక అంశాలతో రాబోతున్నారు. -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటిపై కేసు నమోదు
తమిళ నటి, బిగ్ బాస్ ఫేం యషిక ఆనంద్ ఇటీవల ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఇటీవల కోలుకుని డిశ్చార్జీ అయ్యింది. అయితే యషిక తన స్నేహితురాలు పావని మరో ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా మహాబలేశ్యరం వద్ద కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యాషిక ఫ్రెండ్ పావని అక్కడిక్కడే మృతి చెందగా, యషిక మరో ఇద్దరూ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఫొటోలు ఇటీవల సోషల్ వైరల్ వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కోలుకున్న యషిక డిశ్చార్జ్ అయిన తరువాత తనకు తెలిసిన ఓ నర్స్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. తన సొంతింటికి వెళ్లితే స్నేహితురాలు పావని జ్ఞాపకాలే గుర్తుకొస్తాయని అందుకే తెలిసిన నర్సు ఇంటికి వెళ్లి అక్కడే చికిత్స, విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు చెప్పారు. కాగా ఈ ప్రమాదం యషిక ర్యాష్ డ్రైవింగ్ వల్లే జరింగిందని గుర్తించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. చెంగల్పట్టు జిల్లా కానత్తూరు పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 279 (అతి వేగంగా(ర్యాష్‌గా) కారు నడపడం) 304 ఏ (నిర్లక్ష్యంగా కారు నడిపి వ్యక్తి మృతికి కారణం అయినందుకు) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అంతేగాక పోలీసులు ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా యషిక సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ.. పావని మృతిని తలచుకని బాధపడిన సంగతి తెలిసిందే. ‘నేను కూడా చనిపోయుంటే బాగుండేది. ఇప్పుడు బతికున్నా సంతోషంగా లేను. పావని నువ్వు జీవితంలో నన్న క్షమించవని తెలుసు. వీలైతే మళ్లీ మా మధ్యకు రా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యింది. అంతేగాక దేవుడు తనను బతికించనందుకు సంతోషపడాలో.. తన స్నేహితురాలిని తీసుకెళ్లినందుకు బాధపడాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా యషిక ఫుల్‌గా తాగి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మొదట్లో వార్తలు రాగా వాటిపై కూడా ఆమె స్పందించింది. ‘చట్టం అందరికి ఒకేలా ఉంటుంది. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించకపోయిన పర్లేదు, తప్పుడు వార్తలు మాత్రం సృష్టించకండి’ అంటూ నెటిజన్లపై మండిపడింది. కాగా యషిక విజయ్ దేవరకొండ ‘నోటా’ సినిమాలో నటించింది. -
కేరళ : దక్షిణాది తారల భారీ విరాళం
కేరళ వరద బాధితులకు ప్రపంచ నలుమూలలనుంచీ భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. దేశీయంగా రాజకీయ, సినీ, క్రీడారంగ,ఇతర ప్రముఖుల కూడా స్పందన కూడా విరివిగానే లభిస్తోంది. తాజాగా దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో 1980ల నాటి సినీ తారలంతా తమ వంతుగా స్పందించారు. ‘80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' పేరుతో కేరళ వరద బాధితుల సహాయార్ధం భారీ విరాళాన్నిచ్చింది. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ‘80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' పేరుతో వసూలు చేసిన 40 లక్షల రూపాయల విరాళం అందజేశామని సీనియర్ హీరోయిన్ సుహాసిని ట్విటర్ ద్వారా వెల్లడించారు. శుక్రవారం కేరళ సీఎంను కలిసి ఈ నగదును అందజేసామంటూ, ఆమె ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి హీరోయిన్లు కుష్బు , లిజీ కూడా పాల్గొన్నారు. 80's సౌత్ యాక్టర్స్ రీ-యూనియన్' ఆధ్వర్యంలో స్నేహితులు, బంధువుల నుంచి కూడా విరాళాలు సేకరించామని నటి లిజి మీడియాకు తెలిపారు. గాడ్స్ ఓన్ కంట్రీ వాసులు పూర్తిగా కోలుకునేలా తమ వంతు సహాయాన్నందించేందుకు నిర్ణయించామని నటి కుష్బు తెలిపారు.ఈ ఆపద సమయంలో తామంతా వారికి అండగా ఉన్నామనే భరోసా కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నామన్నారు. Handed over 40 lakhs to cm Kerala..from 80 s reunion and friends today at 3 pm pic.twitter.com/v0tvvgKFSc — Suhasini Maniratnam (@hasinimani) August 31, 2018 80s re union list of contributors to Kerala pic.twitter.com/e7RZUGzGZP — Suhasini Maniratnam (@hasinimani) August 31, 2018 -
ఒక్క సెల్ఫీతో ఇండియన్ సినిమా!
సాక్షి, సినిమా : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటుడిగానే కాదు.. బిజినెస్ మాన్‌గా కూడా సక్సెస్ అయ్యాడన్నది తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ, ఐపీఎల్ జట్టుతోపాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన సౌత్ స్టార్లతో కలిసి ఓ ఈవెంట్లో చేసిన సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ తమ కొత్త బ్రాంచ్‌లను మస్కట్(ఒమన్)లో ప్రారంభించింది. ఈ లాంఛింగ్ కార్యక్రమానికి తారా లోకం కదిలి వచ్చింది. సౌత్‌లో ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని(టాలీవుడ్), శివరాజ్‌కుమార్(శాండల్‌వుడ్), ప్రభు(కోలీవుడ్), మంజువారియర్(మాలీవుడ్)కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్లో ఈ సంస్థకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంబాసిడర్ అన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యకారణాలతో ఆయన ఈ కార్యక్రమానికి గైర్హాజరు కాగా, ఆ లోటును షారూఖ్ తీర్చినట్లయ్యింది. దీంతో సౌత్ స్టార్లు, కింగ్ ఖాన్‌తో దిగిన ఓ సెల్ఫీ వైరల్ అవుతోంది. ఒక్క ఫ్రేమ్‌లో టోటల్ ఇండియన్ సినిమాను చూపించారంటూ ఆ ఫోటో చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు. -
తారలొచ్చారు
ఓటు వేయడానికి మనతారలు తరలి వచ్చారు. ప్రేక్షకులకు తమ నటనతో కాలక్షేపాన్ని ఇవ్వడమే కాక, సామాజిక బాధ్యతపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ఎన్నికల వేళ తాము ముందుంటామని నిరూపించారు. తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు గురువారం జరిగిన నేపథ్యంలో పలువురు ప్రముఖ నటీనటులు ఓటు హక్కును వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. వీరిలో రజనీకాంత్, కమలహాసన్, శివకుమార్, సూర్య, విజయ్, అజిత్, కార్తీ, విశాల్, జీవా తదితరులు ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకోండి రజనీకాంత్ పోయెస్‌గార్డెన్ సమీపంలోని స్టెల్లామేరి కళాశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటువేశారు. అనంతరం రజనీ విలేకరులతో మాట్లాడుతూ అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుస్థిర ప్రభుత్వం మరో ప్రముఖ నటుడు కమలహాసన్, గౌతమి దంపతులు తేనాంపేటలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు. నటుడు శరత్‌కుమార్ కొట్టివాక్కంలోని నెల్లై నాడార్ రోడ్డులోని పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. భార్య రాధికతో కలసి వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు విజయ్ అడయారు కామరాజర్ అవెన్యూలో ఓటు వేశారు. నటుడు అజిత్ తిరువాన్మియూరులోని కార్పొరేషన్ పాఠశాలకు ఉదయం 6.50 నిమిషాలకు వచ్చి పోలింగ్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండి ఓటు వేశారు. నటి ఖుష్బు, తన భర్తతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు జీవా టీ.నగర్లో హిందీ ప్రచార సభలోని పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు.