South Actor, Businessman RK Clarifies On His Political Entry In Press Meet - Sakshi
Sakshi News home page

Actor Radha Krishna: పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన నటుడు ఆర్‌కే

Published Wed, Jun 8 2022 8:48 AM | Last Updated on Wed, Jun 8 2022 11:32 AM

South Actor, Businessman RK Clarifies His Political Entry - Sakshi

సాక్షి, చెన్నై: తాను రాజకీయాల్లోకి మాత్రం రానని నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త ఆర్‌కే అన్నారు. తొలిచిత్రం ఎల్లామ్‌ అవన్‌ సెయల్‌తోనే యాక్షన్‌ హీరోగా విజయం సాధించిన ఈయనకు సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ మ్యాన్‌గానూ గుర్తింపు ఉంది. పలు కొత్త కొత్త ప్రయోగాలతో ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్‌లో కొత్త పుంతలు తొక్కుతూ అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్‌ పుల్‌ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈయన ఉత్పత్తుల్లో వీఐపీ హెయిర్‌ కలర్‌ షాంపూ ఒకటి.

వ్యాపార రంగంలో తన అన్వేషణ కొనసాగుతుందంటున్న ఆర్‌కేను వివిధ రంగాలలో సాధనకు గాను 11 దేశాల నుంచి 18 గౌరవ డాక్టరేట్‌ పురస్కారాలు వరించాయి. ఈ అంశంపై గిన్నీస్‌ రికార్డులకెక్కింది. ఈయన సోమవారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. వ్యాపార రంగంలో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగడమే తన లక్ష్యం అన్నారు. ఎన్ని రంగాలలో ప్రవేశించినా రాజకీయ రంగంలోకి మాత్రం వచ్చే ప్రసక్తే లేదన్నారు. నిజానికి ఆ రంగంలో కుల, మత, స్వార్థం తప్ప సేవా రాజకీయాలు లేవన్నారు. అయితే సినీ రంగానికి మాత్రం దూరం కానని ఆర్‌కే స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement