కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇచ్చిన స్టార్‌ హీరో | Director Elan Get Top Hero Movie Chance | Sakshi
Sakshi News home page

కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇచ్చిన స్టార్‌ హీరో

Apr 19 2024 9:53 AM | Updated on Apr 19 2024 12:06 PM

Director Elan Get Top Hero Movie Chance - Sakshi

నటుడు ధనుష్‌ మరో యువ దర్శకుడికి చాన్స్‌ ఇవ్వబోతున్నారన్నది తాజా సమాచారం. తన 50వ చిత్రం 'రాయన్‌' స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీంతో తన మేనళ్లుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ క్యామియో పాత్రను పోషిస్తున్నారు. అలాగే తెలుగులో కుబేర చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇళయరాజా బయోపిక్‌లో నటించనున్నారు.

ఆ తరువాత హెచ్‌.వినోద్‌, సెల్వ రాఘవన్‌, మారి సెల్వరాజ్ల దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కాగా తాజాగా యువ దర్శకుడితో పని చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇంతకు ముందు ప్రేమ ప్యార్‌ కాదల్‌ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఎలన్‌..  డాడా సినిమాతో పాపులర్‌ అయిన నటుడు కవిన్‌ హీరోగా ఒక చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు.

ప్రస్తుతం కవిన్‌తో 'స్టార్‌' అనే చిత్రాన్ని ఎలన్‌ రూపొందిస్తున్నారు. తాజాగా హీరో ధనుష్‌కు ఒక కథను ఎలన్‌ వినిపించారట.. అది నచ్చడంతో అందులో ధనుస్‌ నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఎలన్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న స్టార్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ధనుష్‌ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలకు సిద్ధం అవుతారని సినీ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement