రెడీ టు బడి | Spearkraft Academy India First Influencer School | Sakshi
Sakshi News home page

రెడీ టు బడి

Published Wed, Feb 21 2024 11:21 AM | Last Updated on Wed, Feb 21 2024 11:22 AM

Spearkraft Academy India First Influencer School - Sakshi

డిజిటల్‌ స్టార్‌ కావడం అనేది అదృష్టం కాదు. అవకాశం.ఆ అవకాశం చేతికి అందాలంటే ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనేది బాగా తెలిసి ఉండాలి.చాలామందిలో ఈ అవగాహన లోపించి ‘ఆరంభ శూరత్వం’ ప్రదర్శిస్తున్నారు.‘ఇది మనకు వర్కవుట్‌ అయ్యేలా లేదు’ అని రథాన్ని వెనక్కి మళ్లిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ కావాలని కలలు కనే యువతరం కోసం ‘స్పియర్‌క్రాఫ్ట్‌ అకాడమీ’లాంటి నయా స్కూల్స్‌ వస్తున్నాయి. ‘కంటెంట్‌ కోచ్‌’లాంటి నయా గురువులు వస్తున్నారు.కెమెరా యాంగిల్స్‌ నుంచి ‘ఏ టైమ్‌లో వీడియోను రోస్ట్‌ చేయాలి?’ ‘బ్రాండ్‌లతో ఎలా కొలాబరేట్‌ కావాలి... లాంటి సమస్త విషయాలను నేర్చుకుంటున్నారు...

దిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కడలికి డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ కావాలనేది కోరిక. పబ్లిక్‌ స్పీకింగ్, బ్లాగింగ్‌పై పట్టు సాధించడానికి షార్ట్‌ కమ్యూనికేషన్‌ కోర్సులో చేరింది. డిజిటల్‌ స్టార్‌డమ్‌ ప్రభావంతో, తాము కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పర్సనల్‌ బ్రాండ్‌ బిల్డింగ్‌ కోసం బడి బాట పడుతున్న అనేకానేక మందిలో కడలి  ఒకరు. 

2022తో పోల్చితే మన దేశంలో 2024లో కంటెంట్‌ క్రియేటర్‌ల సంఖ్య బాగా పెరిగిందని చెబుతోంది ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌ ఫర్మ్‌ జెమ్‌ఫో. ‘ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటే చాలు, ఆడియో అండ్‌ వీడియో కాప్చరింగ్‌ తెలిసి ఉంటే చాలు కంటెంట్‌ క్రియేటర్‌గా రాణించవచ్చు అని అనుకోవడానికి లేదు. నేర్చుకోవడానికి చాలా ఉంది’ అంటున్నాడు కంటెంట్‌ కోచ్, బ్రాండ్‌ కన్సల్టంట్‌ మనీష్‌ ΄ాండే. మనీష్‌లాంటి కంటెంట్‌ కోచ్‌ల ద్వారా సాంకేతిక విషయాలపై నైపుణ్యంతో ΄ాటు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో ఎలాంటి వీడియోలు ఆదరణ పోందుతున్నాయో తెలుసుకుంటున్నారు ఔత్సాహిక కంటెంట్‌ క్రియేటర్‌లు.

డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫ్లూయెన్సర్‌లు కావాలనుకునేవారి కోసం ‘స్పియర్‌క్రాఫ్ట్‌ అకాడమీ’ పేరుతో ఫస్ట్‌ స్కూలు ఏర్పాటయింది. ‘కంటెంట్‌ను ఎలా క్రియేట్‌ చేయాలి? ఎలా ఎడిట్‌ చేయాలి? పర్సనల్‌ గ్రూమింగ్, వార్డ్‌రోబ్‌ మేనేజ్‌మెంట్, బాడీ లాంగ్వేజ్‌...ఇలా వెరైటీ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది’ అని చెబుతున్నారు ‘స్పియర్‌క్రాఫ్ట్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సౌమ్యబాత్రసేన్‌ గు΄్తా.మరోవైపు మైక్రో అండ్‌ నానో న్‌ఫ్లూయెన్సర్‌లు కంటెంట్‌ కోచ్‌లకు బిగ్గెస్ట్‌ క్లయింట్స్‌గా ఉన్నారు.

కన్సల్టేషన్‌  కోసం తన దగ్గరకు వస్తున్న వారిలో చిన్న వ్యా΄ారాలు చేస్తున్నవారు, నెయిల్‌ ఆర్టిస్ట్‌లు, స్కిన్‌కేర్‌ క్రియేటర్‌లు... ఇలా అన్ని రకాల వారు ఉన్నారని హైదరాబాద్‌కు చెందిన కంటెంట్‌ కోచ్‌ ఇషిక పన్సారీ చెబుతోంది. ‘ఆరు నెలల వ్యవధిలో 600 మందికి శిక్షణ ఇచ్చాను’ అని చెబుతుంది ఇషిక. సెషన్‌లో భాగంగా కంటెంట్‌ ఐడియాలు ఇస్తుంది.

‘బార్టర్‌ డీల్స్‌ నుంచి బ్రాండ్‌ కొలాబ్రేషన్స్, యాడ్‌–జెనరేటెడ్‌ రెవెన్యూ వరకు కంటెంట్‌ క్రియేషన్‌ స్పేస్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయిన్పటికీ ‘డబ్బు’ అనేది చివరి అంశం. డబ్బు సం΄ాదించడానికి ఓపిక, స్థిరత్వం ఉండాలి’ అంటాడు కంటెంట్‌ కోచ్‌ మనీష్‌ ΄పాండే.
ఇరవై రెండు సంవత్సరాల దామినీ చౌదురీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణించాలనుకుంటుంది. ‘ఇటీవలే  పర్సనల్‌ స్టైలింగ్, ఇమేజ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశాను. నాకు 7,000 ఫాలోవర్స్‌ ఉన్నారు’ అంటున్న దామిని శిక్షణ ద్వారా ఓవరాల్‌ ప్రెజెంటేషన్, అ్ర΄ోచ్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకుంది.

‘ఆడియెన్స్‌తో కనెక్ట్‌ అయ్యే స్పార్క్‌ అనేది ఏ కొద్దిమందికో పరిమితమైనది కాదు’ అంటున్న కంటెంట్‌ కోచ్‌లు బ్రాండ్‌తో ఎలా కొలాబరేట్‌ కావాలి. ఎలా నెగోషియేట్‌ చేయాలి, కంటెంట్‌ను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి, బెటర్‌ కెమెరా యాంగిల్‌ ఎలా ఉపయోగించాలి... మొదలైన టెక్నికల్‌ యాస్పెక్ట్స్‌ను సులభంగా తెలియజేస్తున్నారు.

కంటెంట్‌ క్రియేషన్‌ కోర్సుల కోసం చాలామంది స్కిల్స్‌ షేర్, ఉడెమీలాంటి ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ΄్లాట్‌ఫామ్‌లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీడియో రోస్ట్‌ చేయడానికి రోజులో మంచి టైమ్‌ ఏమిటి? ఎలాంటి పరికరాలు కావాలి? ఎలాంటి లైటింగ్‌ బాగా ఉపయోగపడుతుంది... లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు.
 
కొండంత అండ...

మన దేశంలోని టాప్‌ డిజిటల్‌ స్టార్స్‌లో 27 సంవత్సరాల బృంద శర్మ ఒకరు. డిజిటల్‌ స్టార్‌ కావాలని, అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కొండలు, గుట్టలు అంటే ఆమెకు ఇష్టం. వాటిని వెదుక్కుంటూ వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్‌లో చేసే 9–5 ఉద్యోగం కంటే కొండల గుండెల చప్పుడు వినడం అంటేనే ఆమెకు ఇష్టం. ఎన్నో దేశాలలో ఎన్నో పర్వతాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్రను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లోకంతో పంచుకునేది. ఆ తరువాత ట్రావెలింగ్‌కు సంబంధించిన వీడియోలతో ఫుల్‌–టైమ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. ప్రకృతిపై ప్రేమ, ప్రయాణం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా ఉండేది బృంద. అయితే అనునయ్‌సూద్‌ అనే ఫ్రెండ్‌ సలహాతో ఇన్‌స్టాగ్రామ్‌ మిషన్‌ ్ర΄ారంభించింది. తన వీడియోలను వైరల్‌ చేయాలని, కావాలనీ... బృంద ఎప్పుడూ అనుకోలేదు. అయితే కంటెంట్‌లో ఉన్న సత్తాతో ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. బృందశర్మను డిజిటల్‌ స్టార్‌ను చేశాయి.
 

  ప్రేక్షక లోకమే ΄పాఠశాల
సీఏ పరీక్షలు పూర్తయిన తరువాత ఫైనాన్స్‌ర్΄÷ఫెషన్‌లోకి వచ్చింది ట్వింకిల్‌ జైన్‌.  ఫైనాల్సియల్‌ లిటరసీని దృష్టిలో పెట్టుకొని 2021 నుంచి సోషల్‌ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘బిజినెస్‌ అండ్‌ ఫైనాన్స్‌కు సంబంధించిన వీడియోలు ఎవరు చూస్తారు?’ అని అనుకొని ఉంటే 26 సంవత్సరాల వయసులోనే టాప్‌ డిజిటల్‌ స్టార్స్‌ జాబితాలో ట్వింకిల్‌ పేరు ఉండేది కాదు. తెలిసో తెలియకో జటిలమైన విషయాలను మరింత జటిలంగా చెబుతూ శ్రోతలను భయభ్రాంతులకు గురి చేస్తారు కొందరు. మరి కొందరు మాత్రం ఎంత జటిలమైన విషయాన్ని అయినా ‘ఓస్‌ ఇంతేనా’ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. ట్వింకిల్‌ జైన్‌ రెండో కోవకు చెందిన వ్యక్తి. ప్రేక్షక లోకమే ఆమె ΄ాఠశాల. వారి నుంచే విలువైన ΄ాఠాలను నేర్చుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement