
గుజరాత్‌లో గోపీచంద్ అకాడమీ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన అకాడమీ ద్వారా శిక్షణా కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో గుజరాత్‌లో మరో అకాడమీని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఇది వడోదరలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ తరహాలో అత్యుత్తమ సౌకర్యాలతో ఈ అకాడమీ నెలకొల్పాలని గోపి భావిస్తున్నారు. ఇదే తరహాలో రాజస్థాన్‌లో కూడా అకాడమీ ఏర్పాటు చేయాలని ఏథెన్స్ ఒలింపిక్స్ రజత పతక విజేత, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ , గోపీచంద్‌కు విజ్ఞప్తి చేశారు. ‘అందుబాటులో ఉన్న ప్రతిభను తీర్చి దిద్దితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. రాజస్థాన్ బ్యాడ్మింటన్ సంఘం కూడా అకాడమీ ఏర్పాటు చేయమని కోరింది. అనంతరం రాథోడ్‌తో చర్చించాక ప్రతిపాదలను సిద్ధం చేశాం. త్వరలో దేశంలో మరికొన్ని చోట్ల అకాడమీలు నెలకొల్పాలనే ఆలోచన ఉంది.’ అని గోపీచంద్ వెల్లడించారు.