హెచ్‌పీఎస్ వందేళ్ల ప్రస్థానంపై కాఫీ టేబుల్ బుక్.. ఆవిష్కరిస్తున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
చిన్నప్పుడు చదువుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన మైక్రోసాఫ్ట్ సీఈవో...
మైదానం, తరగతి గదుల పరిశీలన.. తన గురువులకు ఆత్మీయ పలకరింపు
స్కూల్ వందేళ్ల ప్రస్థానంపై పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరు
పాల్గొన్న మరో పూర్వ విద్యార్థి, అడోబ్ సీఈవో శంతను నారాయణ్
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: సుమారు 45 ఏళ్ల క్రితం తాను చదువుకున్న స్కూల్లోని జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో అడుగుపెట్టారు. తాను ఆడుకున్న మైదానం, కూర్చున్న తరగతి గదులను చూసి మురిసిపోయారు. తనకు చదువుచెప్పిన ఉపాధ్యాయులను ఆప్యాయంగా పలకరించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ‘ఫ్లైట్ ఆఫ్ ది ఈగిల్’ పేరిట రూపొందిన కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి సత్య నాదెళ్లతో పాటు హెచ్‌పీఎస్‌కు చెందిన మరో పూర్వ విద్యార్థి అడోబ్ సీఈవో శంతను నారాయణ్ (shantanu narayen) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1923లో జాగిర్దార్ కాలేజీగా ప్రస్థానం ప్రారంభమై వందేళ్లపాటు వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల ఘన చరిత్రపై పుస్తకాన్ని విడుదల చేశారు.
హెచ్‌పీఎస్‌లోనే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాం
నాదెళ్ల, శంతను ఈ సందర్భంగా నాదెళ్ల, శంతను మాట్లాడుతూ హెచ్‌పీఎస్‌లోనే (HPS) తాము నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నామని చెప్పారు. ఈ పాఠశాల తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని.. ఇక్కడ నేర్చుకున్న నాయకత్వ లక్షణాలతోనే ఇంత స్థాయికి ఎదిగామన్నారు. తన భార్య అనుపమ కూడా ఇక్కడే చదువుకుందని నాదెళ్ల తెలిపారు. హెచ్‌పీఎస్‌తో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు.
చదవండి: ‘ఎన్నారై’ కుటుంబం వేధింపులకు ఒకరి బలి
పుస్తకంలోని కథలు, దృశ్యాలు పాఠశాల స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు ప్రశంసించారు. పుస్తకానికి ప్రధాన సంపాదకుడిగా కృష్ణమూర్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ టేబుల్ బుక్ సబ్–కమిటీ సహ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి కందూర్, హెచ్‌పీఎస్ సొసైటీ అధ్యక్షుడు గుస్తీనోరియా, ఫయాజ్‌ఖాన్ క్రియేటివ్ హెడ్ ప్రణవ్ పింగిల్, హెడ్ రీసెర్చర్ సంజీవ్ చక్రవర్తి, హెడ్ డిజైనర్ అనీష్ పెంటి, లీడ్ రైటర్ అలోక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment