ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం శుభపరిణామం
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వై.వి రెడ్డి వెల్లడి
ఆస్కిలో ‘వర్క్ విస్‌డమ్ లెగసీ’ పుస్తకావిష్కరణ
అనేక రంగాల ప్రముఖుల వ్యాసాలతో పుస్తకం
హైదరాబాద్: ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానానికి చేరుకోవడం శుభ పరిణామం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత వై.వి.రెడ్డి అన్నారు. పలు రంగాల ప్రముఖులు రాసిన వ్యాసాల సంపుటి ‘వర్క్ విస్‌డమ్ లెగసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో జరిగింది. ఈ కార్యక్రమంలో వై.వి.రెడ్డి మాట్లాడుతూ.. అనేక కులాలు, భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆర్థిక వెనకబాటుతో ఉన్న చిన్నచిన్న సంస్థానాలు, రాజ్యాలు కలిసి భారత్‌గా ఏర్పడిన తరుణంలో.. దేశం ఎలా నెట్టుకొస్తుందా అని స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అనుమానాలు ఉండేవని తెలిపారు.
వాటిని పటాపంచలు చేస్తూ ప్రపంచంలో గొప్ప దేశంగా అవతరించడం గర్వకారణమని పేర్కొన్నారు. యూనియన్ బ్యాంక్ మాజీ జనరల్ మేనేజర్ రవి మీనన్, సీనియర్ పాత్రికేయుడు షాజీ విక్రమన్, రచయిత, ఆర్థికవేత్త కవి యాగ మాట్లాడుతూ.. వై.వి.రెడ్డి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఎంతో సీరియస్‌గా ఉంటారని అందరూ భావించేవారని, కానీ ప్రతి సందర్భంలోనూ ఆయన ఛలోక్తులు విసురుతూ అందరినీ నవి్వస్తూ ఉండేవారని గుర్తుచేశారు.
మేధోమథన సమాహారం.. ఈ పుస్తకం అనేక రంగాల ప్రముఖుల లోతైన అభిప్రాయాలతో కూడిన వ్యాసాల సమాహారమే వర్క్ విస్‌డమ్ లెగసీ పుసక్తం. రవి మీనన్, షాజీ విక్రమన్, కవి యాగ సహకారంతో వై.వి.రెడ్డి స్వయంగా ఈ వ్యాస సంపుటిని సంకలనం చేశారు. ఆస్కి చైర్మన్ డాక్టర్ పద్మనాభయ్యతో కలిసి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. రాజకీయ ప్రముఖులు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీనియర్ పాత్రికేయులు, సామాజికవేత్తలు, దేశ ప్రగతిలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు రాసిన 31 వ్యాసాలను ఇందులో పొందుపరిచారు.
భారతదేశ ప్రగతి ప్రస్థానం, అభివృద్ధి, ప్రజా జీవితంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. విద్య, ఉపాధి రంగాల్లో వచ్చిన మార్పులకు సాక్షులుగా నిలిచిన వ్యక్తులే ఈ వ్యాసాలను రాయటం విశేషం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో పని విధానం ఎలా ఉండేది? క్రమంగా ఎలా మారుతూ వచ్చింది? వివిధ రంగాల్లో ఉద్యోగుల పని విధానం ఎలా ఉంది? అనే అంశాలను ఈ వ్యాసాల్లో చర్చించారు. పీ చిదంబరం, కేవీ కామత్, అరుణ్Ôౌరి, నారాయణ మూర్తి, యశ్వంత్‌సిన్హా తదితర ప్రముఖుల వ్యాసాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment