yv reddy
-
మాటలు కావవి.. ప్రతిపక్షాలకు గుచ్చే బాణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాస్ లీడరే కాదు.. ఆయన ప్రసంగం కూడా మాసే. పురాణాలను, ఆ పురాణాల్లోని ఇతివృత్తాలను, పాత్రలను గుర్తు చేస్తూ.. ఆ పాత్రలను నేటి రాజకీయాలతో పోల్చుతూ ఆయన చేసే ప్రసంగాలను అభిమానులనే కాదు.. ప్రతీ ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. "ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే శ్రీకృష్ణ పరమాత్ములు..నేను అర్జునుడిని" అన్న డైలాగ్.. వీపరీతంగా జనంలోకి వెళ్లింది. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలు కౌరవ సేనను చీల్చిచెండాడినట్లు.. జగన్ మాటలు ఎల్లో మందను చీల్చి చెండాడుతున్నాయి. ప్రజలను శ్రీకృష్ణుడి స్థానంలో కూర్చోపెడుతున్న తీరు.. ఓ స్పష్టమైన సంకేతాన్నిస్తోంది. ప్రజల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని ఆయన సుస్పష్టంగా చెప్పేస్తున్నారు. ఆయుధం పట్టకుండా శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించినట్లు.. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలే తనను గెలిపించాలని చెబుతున్నారు. "జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాన్ని బయటకు తీయండి" అన్నారు. మహాభారతంలో పాండవులు వనవాసం, అజ్ఞాత వాసానికి వెళ్లేటప్పుడు వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్తారు. వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయ్యాక తిరిగి జమ్మ చెట్టు దగ్గరకు వచ్చి ఆయుధాలు తీసుకుంటారు. ప్రజల ఓట్లను ఆయుధాలతో పోల్చడమంటే.. కౌరవ సేన లాంటి ఎల్లో మందను ఓటు అనే ఆయుధంతో చీల్చి చెండాడాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం.. ఉత్తర కోస్తా సిద్ధం..రాయలసీమ సిద్ధం..ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధమని సభకు వచ్చిన లక్షలాది జనంలో ఉత్తేజం నింపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సభ ముగిసిన తర్వాత కూడా ప్రజలు, మీడియానే కాదు తెలుగుదేశం, ఎల్లో మీడియా కూడా సీఎం జగన్ ప్రసంగం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. "బిందువు బిందువు కలిసి సింధువైనట్లు" అనగానే జనం స్పందించిన తీరు.. సమర నినాదాన్ని గుర్తు చేసింది. మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాడీ లాంగ్వేజీలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన వచ్చిన తరువాత ఈ సభ జరిగింది. సహజంగానే ఈ సభ ఎలా ఉంటుంది..? సీఎం జగన్ స్పీచ్ ఎలా ఉంటుంది..? అని వైఎస్ఆర్ సీపీ నేతలే కాదు కూటమిలోని నేతలు కూడా ఎదురు చూశారు. 2014లో కూడా ఇలానే ముగ్గురు కలిసి వచ్చారని.. తరువాత ప్రజలను మోసం చేసి ఎవరిదారిన వారు వెళ్లారని సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తు చేశారు. 2014 టీడీపీ మేనిఫెస్టో సిద్ధం వేదిక నుంచి చూపిస్తూ.. ఇలా రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి వస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న తనకు ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో.. ప్రతి ఇంట స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని.. ఈ మహా సంగ్రామానికి మీరంతా సిద్ధమా..? అని సభకు వచ్చిన వారిని ఉద్దేశించి జగన్ అన్నప్పుడు.. సిద్ధం.. సిద్ధం..సిద్ధమంటూ లక్షలాది గొంతుకలు ఒక్కసారిగా నినదించాయి. చంద్రబాబుది తుప్పుపట్టిన సైకిల్ అని.. ఆ సైకిల్‌కు టైర్లు, ట్యూబ్‌లు కూడా లేవని.. ఆ తుప్పు పట్టిన సైకిల్‌ను తోయడానికి పొత్తులతో వస్తున్నాడని జగన్ అన్నప్పుడు సభా ప్రాంగణం దద్దరిల్లి పోయింది. కిల్ సైకిల్.. కిల్ సైకిల్ అని యవత అరవడం వినిపించింది. గంటా 21 నిమిషాలు పాటు సాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా 15 లక్షల మంది, టీవీల్లో అంతే స్థాయిలో, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దాదాపు కోటి మంది చూసి ఉంటారని గూగుల్ లెక్కలు చెబుతున్నాయి. పొత్తుల తరువాత జరిగిన సభ కావడంతో జాతీయ ఛానల్స్ కూడా విస్తృత ప్రచారాన్ని ఈ సిద్ధం సభకు ఇచ్చాయి. దురదృష్టమేమంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, లోకేష్‌కు లక్షలాది జనం గ్రాఫిక్స్‌లా కనిపించడం... ఓ రకంగా ఇది ప్రజలను అనుమానించడం, అవమానించడమే. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపించడమంటే ఇదేనేమో. ఐటీడీపీ గ్రాఫిక్స్‌ను ఫ్రంట్ పేజీలో వేసుకునే స్థాయికి దిగజారడం శోచనీయం. -వైవీ రెడ్డి -
రాష్ట్రాల అసమానతలు తొలగాలంటే...
16వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్స్) నియామకం త్వరలో జరగనుందని భావిస్తున్నారు. 15వ కమిషన్స్ ఏర్పాటైన 2017తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ, దేశీయ సవాళ్లు భిన్నంగా ఉన్నాయి. కోవిడ్–19 ప్రేరేపించిన ఆర్థిక షాక్‌లు, భౌగోళిక రాజకీయ సవాళ్లతో సహా ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితిని 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అన్నారు. కొన్ని రాష్ట్రాలు అఖిల భారత పేదరిక నిష్పత్తిలో చాలా వెనుకబడి ఉన్నాయి. 16వ ఆర్థిక సంఘం ఈ అసమానతలను పరిశీలించి, ఆర్థిక పరిష్కారాలను అందించాలి. 2022–23లో కేంద్రం, రాష్ట్రాల సంయుక్త లోటు, అప్పులు వరుసగా 10 శాతం, 89 శాతంగా ఉన్నాయి. కేంద్ర పన్ను రాబడిలో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలి అనే క్షితిజ లంబ(వెర్టికల్) వాటాలనూ, దాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే క్షితిజ సమాంతర(హారిజాంటల్) వాటాలనూ ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. కేంద్ర పన్నుల భాగస్వామ్య పూల్‌లో రాష్ట్రాల వాటాలను 14వ ఆర్థిక కమిషన్స్ 32 నుండి 42 శాతానికి పెంచింది. అయితే రాష్ట్రాల సంఖ్యను 28కి తగ్గించినప్పుడు, రాష్ట్రాల వాటాను 41 శాతంగా 15వ కమిషన్స్ సిఫార్సు చేసింది. 2022–23లో 6.5 శాతం ఆర్థిక లోటు, 58 శాతం అప్పుతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అసమతుల్యతతో ఉన్నందున ఈ వాటాను పెంచే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. అయితే, 16వ ఆర్థిక కమిషన్స్ సెస్సులు, సర్‌ఛార్జీల అంశాన్ని పరిశీలించాలి. 2011–12లో ఉన్న 10 శాతం నికర పన్ను రాబడి (జీటీఅర్) నుండి 2019–20కి 20 శాతానికి పెరిగింది. వాస్తవానికి, కేంద్ర జీటీఅర్‌లో రాష్ట్రాల నిష్పత్తి 2018–19లో ఉన్న 36.6 శాతం నుండి 2022–23లో 30.2 శాతానికి తగ్గింది. సెస్సులు, సర్‌చార్జ్‌ల కోసం 10 శాతం జీటీఅర్ గరిష్ఠ పరిమితిగా ఉండాలని రంగరాజన్, శ్రీవాస్తవ సూచించారు. కమిషన్స్ దీనిని సిఫారసు చేయవచ్చు. అది 10 శాతాన్ని దాటితే, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను పెంచవచ్చు. మరో మాటలో చెప్పాలంటే– సెస్సులు, సర్ఛార్జ్ల వాటాపై ఆధార పడి క్షితిజ లంబ వాటాను మార్పు చేయవచ్చు. పెరుగుతున్న అంతరాలు ఫైనాన్స్ ్స కమిషన్స్ అమలు చేస్తున్న క్షితిజ సమాంతర పంపిణీ ఫార్ములా అనేది, రాష్ట్రాల అసమానతలను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన పరికరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అసమాన తలపై రాసిన ఒక కథనంలో, ఫైనాన్స్ ్స కమిషన్స్ మినహా మరే ఇతర ప్రభుత్వ సంస్థ కూడా రాష్ట్రాల మధ్య అసమానతలపై దృష్టి సారించలేదని సూచించారు. అంతకుముందు ప్రణాళికా సంఘం తలసరి ఖర్చులు కూడా ధనిక రాష్ట్రాలకే ఎక్కువగా ఉండేవి. కేంద్ర ప్రాయో జిత పథకాలకు తగిన వాటా రాష్ట్రాలు చెల్లించగలగాలి. కానీ దేశీయ మార్కెట్ రుణాలు, బాహ్య రుణాల నిబంధనలు, షరతులు ధనిక రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలలోనే పరిశ్రమ, వ్యాపారం కేంద్రీకృతమై ఉన్నందున బ్యాంక్ రుణ పరపతి తిరోగమనంగా ఉంటుంది. కేంద్ర పన్ను రాయితీలు కూడా తిరోగ మనంగానే ఉంటాయి. 12వ ఆర్థిక సంఘం నుండి 15వ ఆర్థిక సంఘం వరకు తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)పై పోల్చదగిన డేటాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాష్ట్రాల్లో అసమా నతలు విస్తృతమవుతున్నాయి. రాష్ట్రాల వ్యాప్తంగా ‘కోఎఫిషియెంట్ ఆఫ్ వేరియేషన్స్’ 0.46 నుండి 0.67కి పెరిగింది. తలసరి జీఎస్డీపీలో అసమానతలు 15వ కమిషన్స్ నివేదికలో ఇచ్చిన డేటాలో అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి, రాష్ట్ర స్థాయిలో ఆదాయంలో విస్తరిస్తున్న అసమాన తలను 16వ కమిషన్స్ పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్రాలన్నింటిలోనూ, క్షితిజ సమాంతర పంపిణీ అనేది జనాభా, ప్రాంతం, తలసరి ఆదాయం వంటి సూచికలపైనా, జనాభా మార్పు, అటవీ విస్తీర్ణం వంటి ప్రోత్సాహక సంబంధిత సూచికలపైనా ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలన్నింటిలోనూ ఆదాయ అసమానత లను పరిష్కరించడానికి తలసరి ఆదాయంలో అంతరం అత్యంత ముఖ్యమైన సూచిక. 15వ కమిషన్స్లో ఆదాయ అంతరం 45 శాతం. ఆదాయ అంతరం వెనుక ఉన్న ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, రాష్ట్రాల మధ్య ఆర్థిక సామర్థ్య వ్యత్యాసాలు అనేవి పౌరులకు ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవలను పొందడానికి ఆటంకం కాకూడదు. ఇప్పటికీ దిగువే... ఫైనాన్స్ కమిషన్స్ నివేదికల్లోని పోల్చదగిన గణాంకాలను బట్టి, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలు తక్కువ ర్యాంకులో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీటిలో పెద్ద మార్పు లేదు. కనిష్ఠ తలసరి జీఎస్డీపీ (బిహార్‌కి చెందినది) మరియు గరిష్ఠ తలసరి జీఎస్డీపీ నిష్పత్తి (ఇది గోవాను మినహాయించిన తర్వాత, పంజాబ్ లేదా హరియాణాను సూచిస్తుంది) 1999–2002 లోని త్రైవార్షిక సగటు 23.3 శాతం నుండి 2016–2019లో 17.7 శాతానికి తగ్గింది. బహుమితీయ పేదరికంపై నీతి అయోగ్ ఇటీవలి నివేదిక ప్రకారం చూసినప్పుడు, అఖిల భారత పేదరికం నిష్పత్తి అయిన 15 శాతంతో పోలిస్తే బిహార్‌లో అత్యధిక పేదరికం (33.76 శాతం) ఉంది. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ (28.81), యూపీ (22.93), మధ్యప్రదేశ్ (20.63), అస్సాం (19.35) ఉన్నాయి. ఈ నేపథ్యంలో, 16వ కమిషన్స్ సిఫార్సులు అసమానతలను తగ్గించడంలో, ప్రత్యేకించి ఆదాయం విషయంలో ముఖ్యమైనవి. క్షితిజ సమాంతర పంపిణీ అనేది రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం. అధిక పనితీరు కనబరుస్తున్న దక్షిణాది రాష్ట్రాలు, కాలక్రమేణా తమ వాటా తగ్గుముఖం పట్టిందనీ, ఆదాయం, జనాభా స్థిరీకరణ, మానవాభివృద్ధిలో మెరుగైన పనితీరు కారణంగా తమను దండి స్తున్నారనీ ఫిర్యాదు చేస్తున్నాయి. పన్నుల పంపిణీకి సమాంతర పంపిణీ సూత్రంతో ముడిపెట్టకూడదని ఒక సూచన. తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు గ్రాంట్లు అందించవచ్చు. కానీ పన్నుల పంపిణీ అనేది మొత్తం బదిలీలలో 80 శాతంగా ఉన్నట్లయితే ప్రగతిశీలంగా ఉంటుందనీ, గ్రాంట్లు (మొత్తం బదిలీలలో 20 శాతం)గా ఉన్నట్ల యితే తిరోగమన శీలంగా ఉంటుందనీ అనుభవం సూచిస్తోంది. అందువల్ల, తక్కువ తలసరి ఆదాయ రాష్ట్రాలకు సహాయం చేయడా నికి గ్రాంట్లు మరింత ప్రగతిశీలంగా ఉండాలి. సాధారణంగా, అంత ర్రాష్ట్ర అసమానతలను పరిష్కరించే ఏకైక సంస్థ అయినందున, ఫైనాన్స్ ్స కమిషన్స్ పన్నుల పంపిణీ, గ్రాంట్లు రెండింటిలోనూ సమధర్మ సూత్రానికి మరింత సున్నితంగా ఉండాలి. రాష్ట్రాలే ప్రగతికి కీలకం 16వ ఆర్థిక సంఘం పరిశీలించాల్సిన ఇతర అంశాలు: సంక్షో భాన్ని ఎదుర్కోవడానికి మరిన్ని ప్రోత్సాహకాలు, మానవాభివృద్ధిని మెరుగుపరచడం, రెవెన్యూ లోటు గ్రాంట్ల పరిశీలన, స్థానిక సంస్థలకు నిధుల బదిలీ, కేంద్రం, రాష్ట్రాలు రెండూ అందిస్తున్న ఉచితాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) పునరుద్ధరణ. సీఎస్ఎస్ విషయానికొస్తే, రాష్ట్రాలు మరింత సరళతతో పథకాల రూపకల్పనలో పాల్గొనవచ్చు. ఆదాయ వ్యయాల శాతంగా ఉచితాలపై కొంత పరి మితి ఉండాలి. ఉచితాలపై సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలు రెండింటికీ వర్తిస్తాయి. ఆర్థిక నియమాల ఆధారంగా రుణాన్ని, ఆర్థిక స్థిరత్వ విశ్లేష ణను అందించడానికి స్వతంత్ర ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా ఉన్నాయి. చివరగా, సమ్మిళిత అభివృద్ధితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధించాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది. ఈ లక్ష్యా లను సాధించడంలో రాష్ట్రాల పాత్ర సమానంగా లేదా అంతకంటే ముఖ్యమైనది. రాష్ట్రాలు మొత్తం ప్రభుత్వ వ్యయంలో 60 శాతం ఖర్చు చేస్తాయి. విద్య, ఆరోగ్య వ్యయంలో 70 శాతం, మూలధన వ్యయంలో మూడింట రెండు వంతులు ఖర్చు చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులలో 79 శాతం మందిని రాష్ట్రాలు నియమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అంతర్రాష్ట్ర అసమానతలను తగ్గించడంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ముఖ్యమైనవి. ఎస్. మహేంద్ర దేవ్ వ్యాసకర్త హైదరాబాద్ ‘ఇక్ఫాయ్’లో విశిష్ట ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్స్ టైమ్స్’ సౌజన్యంతో) -
చారిత్రక తీర్పుకు రెండేళ్లు
-
ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి రెండేళ్లు
రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు. ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. పదేళ్లు ప్రజల్లో ఉన్నారు. పొలం గట్టెక్కారు..పూరి గుడిసెలో బువ్వ తిన్నారు. కాల్వ గట్లు మీద ఇరిగేషన్ పాఠాలు చదివారు. ప్రజల కష్టాలను పుస్తకాల్లో కాకుండా కళ్లతో కళ్లారా చూశారు. చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు చేయి పట్టుకుని, చేతిలో చేయివేసి జీవితాలకు భరోసా ఇచ్చారు. ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల కోసమే. ప్రజలంటే ఆయనకు ప్రాణం..వారికి సేవ చేయడానికే పుట్టినట్లు ఆలోచిస్తారు. ప్రజలను నమ్ముకుని అడుగులు వేశారు. ప్రజలను అమ్ముకునే వాళ్లతో పోరాటం చేశారు. ఢిల్లీ కోటను ఢీకొని ..తనకు ప్రజలకిచ్చిన మాట కంటే ..ఏదీ ఎక్కువ కాదని దేశం మొత్తం వినబడేలా నినదించారు. ఒక చిరునవ్వుతో శత్రువులను చిందవందర చేశారు. మే23, 2019 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని రోజు. అప్పటి వరకు ప్రజలను పీక్కుతిన్న రాబందులు ఓడిన రోజు. అవినీతి పాలన అంతమైన రోజు. దుర్యోదనుల పాలనకు ప్రజలు చరమ గీతం పాడి..ధర్మరాజు పాలన తెచ్చుకున్న రోజు. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్దం 18 రోజులు జరిగి ఉండొచ్చు..కలియగంలో ఈ కురుక్షేత్ర యుద్దం పదేళ్లు జరిగింది. పదేళ్లు పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ అలసటను మరిచిపోయేలా ఆంధ్రులు అదిరిపోయే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు చూసి చంద్రబాబుకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాని పరిస్థితి. 175 అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం ( 1,56,86,511 ఓట్లు) ఓట్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో రికార్డు విజయం సాధించింది. 39 శాతం (1,23,03,620) ఓట్లతో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది. అంతేకాదు..25 లోక్ సభ స్థానాల్లో 22 సీట్లను వైఎస్ఆర్ సీపీ గెల్చుకుని సత్తా చాటింది. టీడీపీ గెలిచిన ఆ 3 సీట్లు కూడా ముక్కుతూ మూలుగుతూ గెలిచినవే. వైఎస్ఆర్ సీపీ విజయంతో ఓ రాకాసి పాలన నుంచి ప్రజలు బయటపడినట్లు సంబరాలు చేసుకున్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు..దేశ విదేశాల్లో వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు ..వైఎస్ఆర్ సీపీ జెండాలు పట్టుకుని పండగ చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ..ప్రజలకు బంగారు భవిష్యత్తు కోసం..ప్రజలకు నేనున్నాననే ధైర్యం చెప్పడం కోసం ఢిల్లీకి అడ్డంగా నిలబడి పోరాటం చేసి గెలిచిన రాజకీయ వీరుడు, ధీరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మే23, 2019 ఫలితాలు వచ్చిన తరువాత మే30న సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. అప్పుడు వైఎస్ జగన్ ఓ మాట అన్నారు. 6 నెలలు తిరగకుండానే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. ఆ హామీని అక్షరాల నెరవేర్చుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని చంద్రబాబు అనుకూల పత్రికలు రాశాయి. ఆర్ధికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారని మరికొందరు హేళన చేశారు. వీరందరి హేళనలను పునాదిలోనే తొక్కేస్తూ పాలనలో రామ బాణమై దూసుకెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారం చేపట్టినప్పటి నుంచి ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ, అవినీతికి తావులేని పాలన చేస్తున్నారు. ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు తాను చూసిన, తెలుసుకున్న క్షేత్రస్థాయి పరిస్థితుల నుంచి రూపొందించిన 'నవ రత్నాల'ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. ఈ 'నవ రత్నాలే' సీఎం వైఎస్ జగన్ పాలనకు పునాదులు. రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనానికి కాపలాగా ఉన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల ముఖంలో సంతోషం చూస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. 545 సేవలు గ్రామ సచివాలయాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డ్ సచివాలయలతో ప్రభుత్వ సేవలను ఇంటి ముందరకు తీసుకెళ్లిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతోంది. ఈ రెండేళ్ల పాలనలో రూ.1.25 లక్షల కోట్లు ప్రజల జేబుల్లోకి నేరుగా వెళ్లాయని చెప్పొచ్చు. దీంతో గ్రామాల్లో ఆర్ధిక విప్లవం వచ్చింది. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు జీవితాలకు భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో 26.03 కోట్ల పని దినాలు కల్పించడం రాష్ట్రంలో ఓ చరిత్ర. ఈ రోజున పెరిగిన ధరల కంటే..ఏపీలో కూలీల ఆదాయం ఎక్కువుగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం పాలనలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులే ఆదాయం పెరిగేలా చేస్తున్నాయని అనడంలో సందేహం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 అమలు చేసి చూపించింది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోలను వెబ్ సైట్ల నుంచి తొలగించడాన్ని చూశాం. కానీ.. సీఎం వైఎస్ జగన్‌కు మాత్రం మేనిఫెస్టో అంటే..భగవద్గీత, బైబిల్, ఖురాన్. అంతేకాదు..సంక్షేమ క్యాలండర్‌ను రూపొందించి అమలు చేస్తోన్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతోంది. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యావైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనిపై పలువురు విమర్శలు చేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. విద్యా రంగంపై వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.25,714.13 కోట్లు. అంతేకాదు..2021-22 బడ్జెట్లో విద్యారంగానికి ఏకంగా రూ.38,327.20 కోట్లు కేటాయించి తన చిత్తశుద్దిని చాటుకున్నారు. 2021 -22 సంవత్సరానికి అమ్మ ఒడి పథకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.6,107.36 కోట్లు కేటాయించింది. నాడు - నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోంది. తొలి దశలో 15, 715 పాఠశాలలు ఆధునీకరించగా, రెండో దశలో 16,345 పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించనుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.3,500 కోట్లు కేటాయించారు. ఇక..ఆరోగ్య రంగానికి కూడా సీఎం వైఎస్ జగన్ భారీగా నిధులు కేటాయించారు. మొత్తంగా రూ.13,830.44 కోట్లు ఆరోగ్యానికి కేటాయించారు . దీనిలో ఆరోగ్య శ్రీ పథకానికి రూ.2,258 కోట్లు ఇచ్చారు. ఆరోగ్య శ్రీలో 2,400 జబ్బులు చేర్చారు. అంతేకాదు..కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి భయంకరమైన వ్యాధులను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు. సమాజం మారాలంటే విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు అవసరమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు చెబుతూనే ఉన్నారు. అందుకు తగినట్లుగానే బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగాయి. 2020-21 కంటే ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో రూ.4,403.95 కోట్లు అధికంగా కేటాయించారు. 104, 108 పథకాలకు బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించి ప్రజల ప్రాణాలు ఎంత విలువైనవో సీఎం జగన్ గారు చెప్పారు. అంతేకాదు..కరోనాకు ఇప్పటి వరకు రూ.2,500 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. కరోనాతో అనాధలైన పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.10లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేసి..దానిపై వచ్చిన వడ్డీని..వారి పోషణకు ఉపయోగించాలని అధికారులను ఆదేశించి చరిత్ర సృష్టించారు. విద్యావైద్యరంగాల్లోనే కాదు అన్ని రంగాల్లో ఈ రెండేళ్లలో వైఎస్ జగన్ తన ముద్ర వేశారు. అవినీతిని రాష్ట్రం సరిహద్దుల అవతలకు తరిమేశారు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు అనే సిద్దాంతాన్ని బలంగా నమ్మే నాయకుడు సీఎం వైఎస్ జగన్. అందుకు తగినట్లుగానే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.31,256. 36 కోట్లు కేటాయించారు. 2021 -22 బడ్జెట్లో రూ.13,237.78 కోట్లు కేటాయించి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంలో తన చిత్తశుద్దిని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణవాయువైన పోలవరం ప్రాజెక్ట్‌కు ఈ బడ్జెట్లో రూ.4,510.41 కోట్లు కేటాయించారు. ఈ రెండేళ్లలో రైతన్నలకు వివిథ పథకాల రూపంలో రూ.82,368.31 కోట్లు బ్యాంక్ ఖతాల్లో జమ చేశారు. మొత్తం 4,65,58,972 మంది రైతులు పథకాల ద్వారా లబ్ది పొందారు. ఈ రెండేళ్లలోనే మరో బృహత్తర కార్యక్రమం నెరవేర్చారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదల సొంతింటి కల నిజం చేయాలని సంకల్పించుకున్నారు. 30.76 లక్షల మంది మహిళలకు రూ.25,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇప్పటికే పంపిణీ చేశారు. 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. ఏపీ టిడ్కో నేతృత్వంలో పట్టణ ప్రాంతాల్లో 2.62 లక్షల గృహాల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇళ్ల నిర్మానానికి వీలుగా బడ్జెట్లో రూ.5,661.567 కోట్లు కేటాయించారు. పిల్లలకు మేనమామల సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేస్తారు. బాలల వికాసమే లక్ష్యంగా 39 పథకాల కింద రూ.16,748. 47 కోట్లు పిల్లల కోసం కేటాయించారు. ఇప్పటి వరకు మహిళలకు వివిధ పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.82,368.31 కోట్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఈ రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా 4,65,58, 594 మంది మహిళలు లబ్ధి పొందారు. అంతేకాదు..మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకొచ్చి దేశానికి దిక్సూచి అయ్యారు. 2021- 22 బడ్జెట్లో దిశ యాక్ట్‌కు 33.77 కోట్లు జగనన్న ప్రభుత్వం కేటాయించింది. మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఓ సామాజిక బాధ్యత. ఈ రెండేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడవచ్చు. గ్రామీణం - రైతులు - వ్యవసాయం - మహిళలు -విద్యా - వైద్యం పునాదులుగా వైఎస్ జగన్ పాలన చేస్తున్నారు. ఇప్పటికీ 65 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారు. ఈ రంగం బాగుంటేనే పల్లెలు, పట్టణాలు బాగుంటాయని నమ్మిన నాయకుడు ఆంధ్రులకు దొరకడం అదృష్టం. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విప్లవంతోపాటు సామాజిక విప్లవం తీసుకొస్తున్నారు. ఆయన చేపట్టి అమలు చేస్తోన్న ప్రతి పథకం సామాజిక, ఆర్థిక విప్లవానికి నాంది పలికేదే..!. దిశ యాక్ట్ నుంచి నిత్యావసరాల డోర్ డెలివరీ వరకు ప్రతి ఒక్కటీ దేశంలోని ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఆలోచించి అమలు చేసేవి..రేపు దేశం అమలు చేస్తుంది. ప్రజలకు మేలు చేయాలని..ప్రజలను బాగా చూసుకోవాలి అని మనసులో ఉన్నప్పుడే అద్భుత ఆలోచనలు మెదడును తడుతాయి. ఏపీలో వైఎస్ జగన్ పాలన చూస్తుంటే మహాత్మ గాంధీ ఆలోచనలు చూస్తున్నట్లుంది. రాజ్యాంగ బద్దమైన పాలనలో అంబేద్కర్ ఆశయాలు చూస్తున్నట్లుంది. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు రాజకీయ విప్లవంతోపాటు సామాజిక, ఆర్థిక విప్లవాలను తీసుకురాగలడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది ఇదే..!. - వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ -
భారత్‌కు అంతర్జాతీయ పరిణామాల ముప్పు’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై క్రమంగా పెరుగుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి అన్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలకు భారత్ కూడా కారణం అవుతోందని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ‘చైనా, ఇరాన్, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల ప్రభావం చమురు లభ్యత, నిధుల ప్రవాహానికి అవరోధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు భారత్‌కు స్వల్ప కాలానికి హాని కలుగజేసే సమస్యలే. అంతర్జాతీయ వ్యాపారంపై చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై యూఎస్ఏ ఆధిపత్యం ఉంది. ఇది కూడా అంతర్జాతీయ సంఘర్షణకు ఒక కారణం. ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు దేశాల దయాదాక్షిణ్యాలపై ప్రపంచం నడుస్తోంది. యూఎస్‌లో వినియోగం కోసం ఉన్న యూఎస్ డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీగా వాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. -
నీతి ఆయోగ్‌ను సంస్కరించాలి: వైవీరెడ్డి
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ను సంస్కరించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ వైవీ రెడ్డి పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నిర్ణయాలు ‘‘విస్తృత ప్రాతిపదికన ఆమోదం’’ పొందడంలేదని పేర్కొన్న ఆయన, ‘‘అంశాల పట్ల నిర్దిష్ట కేంద్రీకరణ’’ కూడా లేదని విశ్లేషించారు. కేంద్ర, రాష్ట్రాలను సమన్వయం చేస్తూ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా నీతి ఆయోగ్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ప్రధాన అంశంగా వైవీరెడ్డి ‘ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆవిష్కరణను పురస్కరించుకుని ఆర్బీఐ మాజీ గవర్నర్ మాట్లాడుతూ వ్యయాలు, బదలాయింపులకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలన్నారు. రాష్ట్రాల మధ్య ద్రవ్య, ఆర్థిక సమన్వయం విషయంలో ఒకప్పటి ప్రణాళికా సంఘం కీలక పాత్ర పోషించిందని వైవీరెడ్డి పేర్కొన్నారు. అయితే దీని స్థానంలో 2015లో నీతిఆయోగ్ ఏర్పాటయిన తర్వాత ఆయా బాధ్యతల నిర్వహణకు సంబంధించి పలు సందేహాలు వ్యక్తమయ్యాయని అన్నారు. కనీస ఆదాయ పథకం సాధ్యమే... కానీ పేదల సంక్షేమానికి రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం గురించి కూడా వైవీ రెడ్డి ప్రస్తావించారు. ప్రస్తుతం చేస్తున్న కొన్ని వ్యయాలకు కోతపెట్టడం ద్వారా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయడానికి వీలుంటుందన్నారు. అయితే ద్రవ్యలోటు కొంత అవకాశం ఉందని పేర్కొన్న ఆయన, ఈ సమస్యనూ అధిగమించడానికి కేంద్రానికి అవకాశం ఉంటుందన్నారు. అయితే రాష్ట్రాలకు మాత్రం ఇలాంటి పథకాలు అమలు చేయడం కష్టమ చెప్పారు. రుణాలకు సంబంధించి రాష్ట్రాలకు పరిమితులు ఉండడం, తమ ఆర్థిక అవసరాలకు కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి దీనికి కారణమన్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఇలాంటి పథకం అమలు చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇలాంటి సందర్భం ‘‘క్లిష్టతకు’’ దారితీసే అవకాశం ఉందన్నారు. -
కేంద్ర పథకాల అమలుపై సమీక్ష జరగాలి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎంతకాలం అమలు చేయాలి? వాటి అమలు తీరు వంటి అంశాలపై సమీక్ష జరగా లని 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎన్కే సింగ్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ప్రధాన్‌మంత్రి సమ్మాన్ యోజన వంటి సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు భారీగా పెంచాల్సిన అవసరం ఉం దన్నారు. కేంద్ర పథకాలు కిందిస్థాయికి వెళ్లేసరి కి నిధులు ఎంతమేర తరుగుదలకు గురవుతున్నాయో పరిశీలించాలని సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో బుధవారం ‘బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఆర్థిక సమాఖ్యవాదం; స్థూల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు’అంశంపై పలువురు ఆర్థికవేత్తలు 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్కే సింగ్ మాట్లాడుతూ..15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 నుంచి అమ ల్లోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రాలు కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వా రా మెరుగైన వాటాను కోరుకుంటున్నాయని, అందుకుతగ్గట్టుగా ప్రాధామ్యాలను గుర్తించి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రతిపాదనలు చేయాల్సి ఉందన్నారు. జీఎస్టీ పన్నువిధానంలో పలుమార్పులు చోటుచేసుకోవడం, స్లాబులు మారడం వంటివి జరగడంతో రాబడి, తదితర అంశాలపై స్పష్టత సాధించా ల్సి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త వై.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చైనాలో స్థానిక ప్రభుత్వాలకు వనరుల నిర్వహణ, కేటాయిం పులు, ఖర్చులకు సంబంధించి స్వేచ్ఛను ఇచ్చారని, అందుకు భిన్నంగా భారత్‌లో పరిస్థితులున్నాయని చెప్పారు. మార్కెట్లు గతంలో మాదిరి గా భూమి, ఇతరత్రా కేటాయింపులు కోరుకోవడం లేదని, వాటికి అవసరమైన నీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలికసదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థికసంఘం నిర్వహించాల్సిన పాత్రను పునర్నిర్వచిం చుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బహుళపార్టీ వ్యవస్థకే ఆదరణ ఉందని చెప్పారు. జీఎస్టీతో నష్టపోతున్నాయి జీఎస్టీ అమలుతో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, రాబడి రాక అవి తీవ్రంగా నష్టపోతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మహంతి అన్నారు. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాన్ని భర్తీచేసే చర్యలు ఆర్థిక సంఘం తీసుకోవాలన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు. జీఎస్టీ, విపత్తుల నిర్వహ ణ వంటి అంశాలపై ఆర్థిక సంఘం దృష్టి పెట్టాలని విశ్రాంత ఐఏ ఎస్ అధికారి వి.భాస్కర్ సూచించారు. జీఎస్టీ అమలు ద్వారా కేంద్రం వద్ద పెద్దమొత్తంలో పన్నులు పోగుపడటం సరికాదన్నారు. ఎండీఆర్ఎఫ్ కింద రాష్ట్రాలకు కేటాయించే నిధులను 25 నుంచి 30 శాతానికి పెంచాలన్నారు. కేంద్ర పథకాలను కొన్ని రాష్ట్రప్రభుత్వాలు అమలు చేసేందుకు సంసిద్ధంగా లేక పోతే ఇతరత్రా రూపాల్లో ఆయా రాష్ట్రాలకు నిధులు అందేలా ఆర్థికసంఘం చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు మెరుగైన ఫలి తాలు సాధిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యు లు అనూప్‌సింగ్, అశోక్ లహరి, అరవింద్ మెహ తా, రమేశ్ ఛాడ్, ఆర్థిక వేత్తలు డా.ప్రేమ్ చంద్, నారాయణ్ వల్లూరి, ప్రొ.భగవాన్ చౌదరి, డా.డి.శివారెడ్డి, ప్రసన్న తంత్రి, ఎన్ఏఖాన్, రాధికా రస్తోగి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు సమాధానం ఇచ్చుకోవాలి
కోల్హాపూర్: ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి ఇటీవలే వెలుగు చూసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు–నీరవ్ మోదీ రూ.13,000 కోట్ల స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యజమానిగా ఈ తరహా స్కామ్‌ల వల్ల పెరిగిపోతున్న నష్టాలపై పన్ను చెల్లింపుదారులకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎన్బీలో చోటుచేసుకున్నది కచ్చితంగా మోసమేనని, దీనిపై ఎక్కువగా ఆందోళన చెందేది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులను సురక్షితంగా ఉంచడం ఎలా అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో పాల్గొని వైవీరెడ్డి మాట్లాడారు. తమ డబ్బులకు సంరక్షకుడిగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ తరహా స్కామ్‌లను నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతుందని పన్ను కట్టేవారు ప్రశ్నించాలని సూచించారు. ప్రభుత్వం తాను నియమించిన డైరెక్టర్లు ఏం చేస్తున్నారనే దానిపై... తన సొంత పెట్టుబడుల పర్యవేక్షణ, నియంత్రణ విషయంలో కచ్చితంగా ఆందోళన చెందాల్సిందేనన్నారు. ఆర్బీఐ ప్రధాన బాధ్యత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, డిపాజిట్ల పరిరక్షణ అయినప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత విస్మరించరానిదని అభిప్రాయపడ్డారు. మోసాలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పలువురు బ్యాంకర్లపై ఇటీవలే సీబీఐ చేపట్టిన చర్యలు అసాధారణంగా ఉన్నాయని వైవీ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల వద్ద డిపాజిట్లు తగినన్ని ఉన్నాయని, అవి బాగున్నంత వరకు అవి కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద డిపాజిటర్లకు సరిపడా నిధులు లేకపోయినప్పటికీ, ఎక్కువ వాటా ప్రభుత్వానిదే కనుక డిపాజిట్‌దారుల సొమ్ము సురక్షితమేనన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయంలో జాప్యం, అనిశ్చితి ఆందోళనలు కలిగించే అంశాలేనని వైవీ రెడ్డి అన్నారు. -
చర్చలు రగిలించిన మానవతామూర్తి
నివాళి సాగర్‌లో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారు. ఉపదేశాలకు బదులు విద్యార్థుల్లో ఆలోచనలు రేపే చర్చలు రగిలించేవారు. ప్రతి ప్రిన్సిపాల్ తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పిల్లలు విమర్శిస్తే సంతోషపడతారు. దాని వలన తన గౌరవం పెరుగుతుంది అనుకుంటారు. కానీ వై.వి రెడ్డి (వై. వెంకటరెడ్డి) తనకన్నా ముందున్న ప్రిన్సిపాళ్లను పొగిడితే సంతోషపడతాడు. ఈనాడు తన కుర్చీని పటిష్టంగా చేసింది వారే కదా అంటాడు. తన కన్న ముందున్న ప్రిన్సిపాళ్లను ఎంతో గౌరవంగా చూసేవాడు. ఆయనను నేను ప్రిన్సిపాల్‌గా, పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చూశాను. తనతో ఏకీభవించనివాళ్లను వాళ్లముందే విమర్శిస్తాడు. కానీ వారు లేనప్పుడు వారి మంచితనాన్ని పొగుడుతాడు. ఇది చాలామందిలో ఉండదు. మానవత్వానికి ప్రతీక ఆయన. ఆయనే నాగార్జున సాగర్ ఎ.పి.రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీకి నా తర్వాత వచ్చిన ప్రిన్సిపాల్. అలాంటి మనిషి విద్యార్థులకే కాదు, నాలాంటి వారికి కూడా ఆదర్శనీయం. చనిపోయిన తర్వాత వచ్చే కీర్తి అది శాశ్వత కీర్తి. బతికున్నప్పుడు వచ్చే కీర్తి నీళ్ల మీద రాతలే. కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా ఏ ప్రాంతానికి వెళ్లినా, తమ పనిద్వారా, నడవడిక ద్వారా ప్రత్యేకముద్ర వేస్తారు. తరగతి గది అంటే అది సిలబస్‌కు, పరీక్షలు నిర్వహించటానికి మాత్రమే కేంద్రం కాదు. తరగతి గదిని పరీక్షలతో పాటుగా భవిష్యత్ సమాజంలో విద్యార్ధులు జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సన్నద్ధం చేస్తారు. వై.వి. రెడ్డి నల్గొండ ఎన్.జి. కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు సహ అధ్యాపకుడు. ఆయన ప్రతిరోజు దేశంలో, ప్రపంచంలో పత్రికల్లో వచ్చే వార్తలను విశ్లేషించి చెప్పేవాడు. వార్తల రూపం వెనుక ఏం జరిగి ఉంటుందని విశ్లేషించి చెప్పేవాడు. పలానా దేశంలో పరిస్థితులు ఏమిటి? అక్కడ ప్రజల చైతన్యస్థాయి ఏమిటి? ప్రజలు ఇలాంటి సమస్యలపై ఏ రకంగా ప్రతిస్పందిస్తారు అన్న అంశాలను నల్గొండ స్టాఫ్ రూమ్‌లో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మా మదిలో ఎప్పటికీ గుర్తుకు వస్తుంటాయి. వై.వి. రెడ్డి ప్రతిరోజు విద్యార్థుల అసెంబ్లీలో మాట్లాడే మాటల విశ్లేషణలు విన్నాను. విద్యార్థులకు ఆయన హితోపదేశాలు చేసేవాడు కాదు. విద్యార్థులు ఆలోచించుకోవటానికి అనుగుణమైన చర్చను మాత్రం వారిలో రగిలించేవాడు. సమస్యలకు పరిష్కారం చెప్పేవాడుకాదు. కానీ పిల్లలను పాత్రధారులను చేసేవారు. దాని వల్ల ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈనాడు సైంటిస్టులుగా, పాలనా రంగంలో, వివిధ వృత్తుల్లో ఉన్నతమైన దశలో ఉన్నారు. ఏ సమస్యకైనా, ఏ సవాళ్లకైనా పరిష్కారాలు చెప్పే పాలనాదక్షులయ్యారు. అలా ఒక విద్యాసంస్థను తీర్చిదిద్దడంలో వై.వి. రెడ్డి సఫలీకృతులయ్యారు. ప్రిన్సిపాలే పరిష్కారం చెబితే అతని గొప్పతనం మాత్రమే బయటపడుతుంది. కానీ అందులో పిల్లలను నిమగ్నం చేస్తే వాళ్లు భవిష్యత్‌ను నిర్ణయిస్తారు. దాంతో భవిష్యత్ నిర్మాణం జరుగుతుంది. వై.వి. రెడ్డి దీర్ఘదృష్టి కలవాడు. కోదాడ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సమయంలో అక్కడి విద్యార్థులకు.. సమాజానికి కాలేజీకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో ఆయన ఆచరణ ద్వారా చెప్పగలిగాడు. నాగార్జునసాగర్‌లో ప్రిన్సిపాల్‌గా ఉండి దేశానికి అవసరమైన పాలనాదక్షులను తయారుచేయటానికి దోహదపడ్డాడు. ఖమ్మంలో ఆయనపైన నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా ముద్ర పడింది. ఎమర్జెన్సీ కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. సాగర్‌లో డిగ్రీ చదువులో రెసిడెన్షియల్ వ్యవస్థ అంత గొప్పగా ఉండటానికి కారణం వై.వి. రెడ్డి లాంటి ప్రిన్సిపాళ్లు ఉండటమే. ఒక ప్రిన్సిపాల్‌ను అంచనా వేయాలంటే ఆయన పనిచేసిన కాలేజీలో లక్ష్యం ఏమేరకు చేరుకోగలిగారో అదే గీటురాయిగా చెప్పవచ్చు. పరిశోధన అంటే సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న విజ్ఞానం నుంచి పరిశోధనాత్మకమైన దృక్కోణం రావాలి. దానికి కావాల్సింది సబ్జెక్టుపైన అవగాహనే. పరిశోధనాత్మక దృక్కోణం ఉన్న టీచర్లను తీసుకోవాలి. అదే కోణంలో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీకాలేజీల్లో అధ్యాపకుల నియామకం జరిగింది. అంతకుముందే డిగ్రీ కాలేజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారిని తీసుకొన్నారు. ఇలాంటి మనుషులను తీసుకొన్నట్లయితే పరిశోధనకు అవసరమైన విద్యార్థులు తయారవుతారని దూరదృష్టితో ఈ రెసిడెన్షియల్ వ్యవస్థను నిర్మిం చారు. దీన్ని నిర్వహించే ప్రిన్సిపాళ్లకు కూడా ఈ లక్ష్యంవైపుకు తీసుకుపోయే శక్తిసామర్థ్యాలు ఉండాలి. ఆనాటి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ వ్యవస్థ విద్యార్థులను ఆర్ఈసీలకు, పిల్లలను ఐఐటీలకు పంపి సాంకేతిక మానవ సంపదను తయారుచేసేది. అదే విధంగా డిగ్రీల్లో మానవీయశాస్త్రాలు, సైన్స్ సబ్జెక్టులలో రీసెర్చ్ చేసే మనుషులను తయారుచేసింది. ఆ దారిలో సంస్థను ముందుకు నడిపించే దీక్షాదక్షత, శక్తి వై.వి.రెడ్డికి ఉన్నాయి. ఆయనకు సామాజిక చింతన ఉంది. లక్ష్యంకోసం పట్టు వదలకుండా పనిచేసే ధైర్యం ఉంది. పిల్లలను తీర్చిదిద్దగల నైపుణ్యం ఉంది. కొత్తకోణాలను ఆవిష్కరించగల శక్తి వై.వి. రెడ్డికి ఉంది. అలాంటి ప్రిన్సిపాళ్లకోసం సమాజం ఎప్పుడూ ఎదురుచూస్తుంది. వై.వి. రెడ్డి వృత్తికి అంకితమైన మహామనిషి. ఆయనకు అధ్యాపకులందరి తరపున స్మృత్యంజలి ఘటిస్తున్నాను. (నేటి సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడలో, రేపు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రంవారిపాలెంలో వై.వి. రెడ్డి సంతాపసభ, ఆయనపై ‘నిలువెత్తు పుస్తకం’ పుస్తకావిష్కరణ ఉంటాయి) - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
వ్యవసాయ రుణ మాఫీ మంచిది కాదు: వైవీ రెడ్డి
న్యూఢిల్లీ: వ్యవసాయ రుణాల మాఫీ ఆర్థిక ప్రగతికి సరి కాదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయ నిర్ణయాలు దీర్ఘకాలంలో సమర్ధనీయం కాదని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక రాష్ట్రంలో లేదా జాతీయ స్థాయిలోనో రుణాల మాఫీ హామీలు ఇస్తూనే ఉన్నాయని వైవీ రెడ్డి చెప్పారు. ‘ఆర్థిక ప్రగతికి గానీ రుణాల సంస్కృతికి గాని రుణ మాఫీ విధానాలు సరికావు. దేశంలోని ప్రతీ రాజకీయ పార్టీ ఏదో ఒక రాష్ట్రంలోనో లేదా జాతీయ స్థాయిలోనో వ్యవసాయ రుణాల మాఫీ హామీలు ఇచ్చాయి. ఇది అంతిమంగా రాజకీయ అంశాలపరమైన నిర్ణయమే. దీర్ఘకాలంలో ఇది సమర్ధనీయం కాదు‘ అని ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ ఇండియా సదస్సు–2017లో పాల్గొన్న సందర్భంగా వైవీ రెడ్డి చెప్పారు. మరోవైపు, వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేసే బదులుగా వాటిని తిరిగి చెల్లించేందుకు మరింత అధిక వ్యవధినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని రిజర్వ్ బ్యాంక్ మరో మాజీ గవర్నర్ సి. రంగరాజన్ అభిప్రాయపడ్డారు. కావాలంటే ఓ ఏడాది వాయిదాలను, వడ్డీని మాఫీ చేయొచ్చని పేర్కొన్నారు. ఇవేవీ పనిచేయనప్పుడు మాత్రమే వ్యవసాయ రుణాల మాఫీపై దృష్టి పెట్టొచ్చని తెలిపారు. -
రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీపై ఆర్బీఐ మాజీ గవర్నర్లు వైవీ రెడ్డి, రంగరాజన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రుణాల మాఫీ ఆర్థికవ్యవస్థ, పరపతి సంస్కృతికి మంచిది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. రుణమాఫీ పూర్తిగా రాజకీయ నిర్ణయమని, దీన్ని దీర్ఘకాలంలో సమర్ధించలేమని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి రాజకీయ పార్టీ ఆయా రాష్ట్రాల్లో రుణమాఫీని ప్రకటిస్తున్నాయని అన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రుణమాఫీ బదులు అప్పులు తిరిగి చెల్లించేందుకు రైతులకు సుదీర్ఘ సమయం ఇవ్వడంతో పాటు వాయిదా చెల్లింపును నిలిపివేయడం, నిర్దిష్ట సంవత్సరానికి వడ్డీ తగ్గించడం వంటి ప్రత్యామ్నాయాలు మెరుగైనవని ఆయన సూచించారు. కరువు పరిస్థితుల్లో వడ్డీ చెల్లింపులు మాఫీ చేయడం, రుణాల చెల్లింపుకు దీర్ఘకాలం ఉండేలా రీషెడ్యూల్ చేయడం మంచిదని చెప్పారు. ఈ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వనప్పుడే రుణమాఫీకి ప్రభుత్వాలు మొగ్గుచూపాలన్నారు. పంజాబ్, యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించిన క్రమంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
మరో రెండేళ్లు జీఎస్టీ, నోట్ల రద్దు దెబ్బ!
ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్), వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో పాటు బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయిల ప్రతికూల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతే అధిక వృద్ధి బాటలోకి పయనించవచ్చని అంచనా వేశారు. వీకెండ్లో ఇక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధి రేటు అంచనాలను వెల్లడించడం కష్టసాధ్యమైన విషయం. మళ్లీ మన ఆర్థిక వ్యవస్థ వాస్తవ సామర్థ్యానికి అనుగుణంగా 7.5–8 శాతం వృద్ధిని ఎప్పటికల్లా అందుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేం. వచ్చే రెండేళ్లలో మాత్రం ఇది సాధ్యం కాదని భావిస్తున్నా. డీమోనిటైజేషన్, నోట్ల రద్దు షాక్‌ల కారణంగా వృద్ధి మందగమనం నెలకొంది. అయితే, వీటివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే సమస్యలు తప్పవు. ప్రయోజనాలు భవిష్యత్తులో లభిస్తాయి. ఇవి ఏమేరకు ఉంటాయి, ఎన్నాళ్ల తర్వాత అనేది ఇక్కడ ప్రధానమైన అంశం’ అని వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్బీఐ గవర్నర్‌గా తన హయాంలో ముడిచమురు ధరల భారీ తగ్గుదల కారణంగా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. అయితే, ఇప్పుడు జీఎస్టీ, డీమోనిటైజేషన్, బ్యాంకుల్లో భారీ మొండిబకాయిల వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావాలు వృద్ధి రేటును దెబ్బతీస్తున్నాయని వైవీ రెడ్డి పేర్కొన్నారు. -
చిదంబరంతో విభేదాలతో రెండుసార్లు వైదొలగాలనుకున్నా!
న్యూఢిల్లీ: ప్రభుత్వంతో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్లకు ఉన్న చేదు జ్ఙాపకాలు కొత్తేమీ కాదు. మాజీ ఆర్బీఐ గవర్నర్ వైవీ రెడ్డికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట అప్పట్లో. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరంతో విభేదాలను వైవీ రెడ్డి తన స్వీయ చరిత్ర.. ‘అడ్వైజ్ అండ్ డిసెంట్:మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్’లో బయటపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే చిదంబరంతో పొసగకపోవడంతో రెండుసార్లు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అనుకున్నారట. తొలుత 2004లో చిదంబరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ల తర్వాత కాగా, యూపీఏ–1 సర్కారు చివరినాళ్లలో మరోసారి గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని భావించినట్లు వైవీ రెడ్డి పేర్కొన్నారు. 2003 నుంచి 2008 మధ్యకాలంలో ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. తమ మధ్య బేదాభిప్రాయాలను సద్దుమణిగేలా చేయడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం కూడా చేసుకున్నారని.. తాను చిదంబరానికి బేషరతుగా క్షమాపణలు చెప్పానని కూడా వైవీ రెడ్డి తన ఆత్మకథలో తెలిపారు. అయినప్పటికీ.. తమ మధ్య విభేదాలు సమసిపోలేదని చెప్పారు. దేశీ బ్యాంకింగ్ రంగంలో యాజమాన్య హక్కులను విదేశీ సంస్థలు దక్కించుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనసాగించే విషయంలో చిదంబరం తనకు మధ్య అసలు గొడవ మొదలైందని.. అది 2008 నాటికి తారస్థాయికి చేరినట్లు వైవీ రెడ్డి రాసుకున్నారు. ‘ఆర్థిక వ్యవస్థను రెండంకెల వృద్ధి దిశగా పరుగులు పెట్టించే సంస్కరణవాదిగా ఆయన(చిదంబరం)కు ఒక పేరు ఉండేది. అయితే, కొన్ని సంస్కరణలు, ప్రభుత్వ విధానాల అమలును వ్యతిరేకిస్తూ.. హెచ్చరికలు చేయడం ఆయనకు నచ్చలేదు. సంస్కరణల గురించి చెప్పుకోవడానికి ఏమీలేకపోవడంతో ఇన్వెస్టర్లకు మొహం చూపించుకోలేక ఒకసారి చిదంబరం విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు’ అని వైవీ రెడ్డి తన పుస్తకంలో వెల్లడించారు. -
వామనుడేగానీ ఆజానుబాహుడు
సందర్భం ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పుడు ‘బంగారం తాకట్టు’ విధానాన్ని అమలు చేయడంలో వైవీరెడ్డి పాత్ర గొప్పది. అది ఒక విధంగా అగ్నిపరీక్షే. ఇక 2008 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభ కాలంలో ఆయన భారత్‌ను అమోఘంగా నిలబెట్టారు. వారి జీవిత చరిత్ర చదివాను. మట్టిలో నుంచి మాణిక్యాలు పుట్టినట్లు కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో మారుమూల కుగ్రామంలో పుట్టి, అంతర్జాతీయ స్థాయికి ఎదగగలిగిన మేటి దిట్ట. ప్రాథమిక స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగే వారికి, అర్ధంతరంగా పైకి వచ్చిన వారికి ఎంతో తేడా ఉంటుంది. అది ప్రభుత్వ అధికారులైనా, రాజకీయ నాయకులైనా అదే పరిస్థితి. క్రిందిస్థాయి నుంచి అంగీకరించిన బాధ్యతలను అమలు చేయడానికి అనేక ఆటుపోట్లుంటాయి. ఒక్క దఫా మంచి చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆటంకాలు ఎదురుకావడం అన్నిచోట్లా చూశాను. ఇలాంటి అనుభవాలు వైవీరెడ్డి జీవన గమనంలో మనం చూడవచ్చు. పదవులను ఆశించకుండా తమ విద్యుక్త ధర్మాన్ని పాటించుకుంటూ పోవటం, దాని ఫలి తంగా ఏమొస్తే దాన్ని మనఃస్ఫూర్తిగా స్వీకరించడం అత్యంత కష్టసాధ్యం. అయితే అలాంటి స్థితిలో పట్టుదల, నిర్మలత్వం, తొణికిసలాడకుండా, ఊగిసలాడకుండా దిటువుగా నిలబడటం ఎలా అనే ప్రశ్నకు వైవీరెడ్డి నిగ్రహ విగ్రహమే సమాధానం. ఉగాది ఉత్సవాలకోసం గవర్నర్ ఆహ్వానం మేరకు నేను హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌కు వెళ్లాను. అనుకోకుండా వైవీరెడ్డి పక్కన కూర్చునే అవకాశం కలిగి నందుకు సంతోషించాను. ప్రధాని మోదీ నల్లధనంపై దాడి చేసిన తర్వాత, ఈ అంశంపై సెమినార్ పెట్టడానికి వైవీరెడ్డిని ఆహ్వానించాను. వారు సున్నితంగా తిరస్కరించారు. ఉగాది సందర్భంగా కలిసినప్పుడు ఆ అంశాన్ని ప్రస్తా వించాను. దానికి వారి సమాధానం ‘నా బయోగ్రఫీ నీకు పంపుతాను, దాన్ని చదవండి’ అన్నారు. ‘మీరెందుకు పంపడం, నేనే తెప్పించుకుంటాను సార్’ అన్నాను. తర్వాత విశాలాంధ్ర బుక్‌హౌస్ ద్వారా తెప్పించుకున్నాను. ఆర్బీఐకి సంబంధించి నల్లధనంపై నేను సలహా అడిగితే, తన జీవిత చరిత్ర చదవమంటారేంటి అనుకొని అనాసక్తిగా చదవడం మొదలుపెట్టాను. జన్మ నేపథ్యం తర్వాత వారి చదువు, ఉద్యోగం, ఎస్ఆర్ శంకరన్‌తో పనిచేయడం చూశాక నాకు కొంత చదవడానికి ఆసక్తి పెరిగింది. క్రమంగా అంచెలంచెలుగా బాధ్యతలు పెరగడం, ప్రతి సందర్భంలో నిగ్రహ విగ్రహం గుర్తొస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఇంతటి లోతుపాతులు నాకు తెలియదు. ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తుందని మాత్రమే తెలుసు. అయితే అదే ఆర్బీఐ పాత్రపై నాకు అపనమ్మకం, అసంతృప్తి కూడా ఉంది. దానికి కారణం ఎగవేతదారులపై చర్యలు, రెండవది మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ రుణ వ్యవస్థ)పై నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. అందులో మైక్రో ఫైనాన్స్ బాధితుల తరఫున నేను ప్రత్యక్ష యుద్ధం చేశాను. మైక్రో ఫైనాన్స్ మాఫియాపై దాడి చేయండని బహిరంగంగానే పిలుపిచ్చాను. జయప్రదం అయ్యిందానికి సంతృప్తిపడ్డాను. సరళీకరణ, అంతర్జాతీయ ఒప్పం దాలు, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ఒత్తిడి. అందులో భాగంగా మైక్రో ఫైనాన్స్ సంస్థల పట్ల ఆర్బీఐ వైఖరి, దాని వైఫల్యం గురించి వైవీరెడ్డి పొరపాటు అంచనా వేశామని కూడా అంగీకరించారు. అన్నింటికంటే ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వైవీరెడ్డి తీసుకున్న దృఢమైన వైఖరి అనూహ్యం. అందుకే వామనావతారమైనా ఆజానుబాహుడని సంబోధించేం దుకు సాహసించాను. బంగారానికి మన సమాజంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. అది సెంటిమెంట్ గాకుండా, జీవనాధారంగా, భారతీయులకు అదొక రక్షణ కవచం. ఆ మధ్య బంగారు నగలపై మోదీ ప్రభుత్వం కొంత కదిలించి, తిరోగమన పలాయనం చెందిన చేదు అనుభవం మనం మరవలేదు. అలాంటి సెంటిమెంట్ గేమ్‌లో కూడా వైవీరెడ్డి జయప్రదం అయ్యారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడినప్పుడు తీవ్రమైన ఆలోచనతో ‘బంగారం తాకట్టు’ విధానాన్ని అమలు చేయడంలో వైవీరెడ్డి పాత్ర గొప్పది. అది ఒక విధంగా అగ్నిపరీక్షే. అదే వైఫల్యం చెంది ఉంటే వైవీరెడ్డి నిజంగా వామనుడిగానే ఉండేవారు. సహకార సంస్థలు, ప్రైవేటు బ్యాంకులపై కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఆర్థిక నిపుణులు కూడా ‘ముందస్తు ఎలా పసిగట్టావ్ వేణు’ అని ఆశ్చర్యపోయిన ఘటనలు చూస్తే అర్థమవుతుంది. అలాగే 2008లో అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైంది. ఆ సందర్భంలో కూడా భారతీయ పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకులు, రుణాలు తదితరాలపై తీవ్ర కృషితో హోంవర్క్ చేశారు. సాహసంగా నిలబడ్డారు. ఆ సందర్భంలో పైపై సంక్షోభం తప్ప, గ్రామీణ స్థాయిలో తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఏర్పడలేదు. ఇక్కడ ఒక్కమాట చెప్పాలి. అది వైవీరెడ్డి చెప్పలేరు. నా మాటలో చెప్పడం కన్నా, కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన ఆనాటి ఆర్థిక మంత్రి చిదంబరం మాటల్లో చెప్పాలంటే.. ‘ఈ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా మనం అతీతులుగా ఉన్నందుకు కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు. అంటే యూపీఏ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర వహించారు. ఆ సందర్భంగా మన్మోహన్ సింగ్, చిదంబరంలు ఆర్థిక వ్యవస్థలో కొంత మార్పుకు ప్రయత్నించగా, దాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. దాని ఫలితంగా చిదంబరం లాంటి వారు కూడా కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు తెలియజేయడమనేది రాజ కీయ ప్రాముఖ్యత కలిగింది. అదే సందర్భంలో వ్యవస్థాగత నిర్ణయాలకు వైవీరెడ్డి కేంద్ర బిందువయ్యారు. ఈ జీవిత గ్రంథంలో ఆర్బీఐ ఆర్థిక విధానాలు, రాజకీయ ప్రముఖుల ప్రస్తావన, ఆర్థిక నిపుణులలో సైతం భిన్నాభిప్రాయాలు, వాటిని ఏ విధంగా అధిగమించాలో చాలా గొప్పగా వివరించారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ అధిగమించాలో? ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ తప్పును నమ్రతతో అధిగమించాలో తెలుసుకుని, విజయం పొంది నప్పుడు కాలరెగరేసి మాట్లాడకుండా ఒదిగి మన్ననలను పొందేవారు వైవీరెడ్డి. అంతా చదివాక మిలియన్ డాలర్ల ప్రశ్న నాలో మిగిలింది. మోదీ నల్లధనంపై దాడి ఘటన సందర్భంలో ఆర్బీఐ గవర్నర్‌గా వైవీరెడ్డి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో? అంగీకరించేవారా? వ్యతిరేకించేవారా? వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యదర్శి - 94909 52222 డాక్టర్ కె. నారాయణ -
22న నర్సారెడ్డి ‘ఆత్మకథ’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖ మాజీ మంత్రి పి.నర్సారెడ్డి ఆత్మకథ పుస్తకావిష్కరణ ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ పుస్తకాన్ని తమిళనాడు మాజీ గవర్నర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని గోల్డెన్ జూబ్లీ బ్లాక్‌లో ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి హాజరుకానున్నారు. ఎంపీ పి.గోవర్ధన్, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మహేశ్వర్‌రెడ్డి, కమలాకర్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
సంక్షోభాల్లో బంగారమే ఆదుకుంది
పసిడి నిల్వలతోనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది: ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి ♦ ప్రస్తుతం బంగారంపై అనేక అపోహలు నెలకొన్నాయి ♦ కడ్డీలు, బిస్కెట్లు భారీగా ఉంటేనే నల్లధనంగా గుర్తించాలి ♦ ప్రజల ఆభరణాలకు భరోసా ఉండాలి ♦ ఘనంగా ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సాక్షి, హైదరాబాద్: దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో బంగారం నిల్వలు మన ఆర్థిక వ్యవస్థను ఆదుకొన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చెప్పారు. విదేశాల తరహాలో బంగారాన్ని కేవలం ఒక మారక వస్తువుగా అంచనా వేయడం సరికాదని, దేశ చరిత్ర, సంస్కృతిలో దానికి గొప్ప స్థానం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూడోరోజు జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘గోల్డ్: బ్లాక్, వైట్ అండ్ ఎల్లో’ అన్న అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘‘హోటల్‌కు వెళ్లి రూ.10 వేలు ఖర్చు చేసినట్లుగా బంగారాన్ని ఖర్చు చేయడం సరైంది కాదు. బంగారం నిల్వలు పుష్కలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. మన వద్ద ఉండే బంగారం నిల్వలపైన ఆధారపడే ప్రపంచ దేశాల్లో మనకు ఒక హోదా లభిస్తుంది. 1990లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొనిపోయినప్పుడు బంగారమే కాపాడింది. ప్రభుత్వం వద్ద బంగారం నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఆ సమయంలో ప్రజల వద్ద ఉన్న బంగారం, ఆభరణాలు ఎంతో ఆదుకున్నాయి. అయితే నల్లధనం కూడా బంగారం రూపంలోనే ఉంది. 1990 వరకు ఉన్న నల్లధనం అంతా బంగారం రూపంలోనే బయటకు వచ్చింది. 1997లో బంగారంపై ఒక విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి బ్యాంకు లావాదేవీల్లో దీన్ని వినియోగిస్తున్నారు’’ అని చెప్పారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఏది నల్లధనం కిందకు వస్తుంది? ఏది రాదు అన్న అంశంపై స్పష్టత అవసరమని అన్నారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో భారీ ఎత్తున ఉన్న నిల్వలనే నల్లధనం కింద గుర్తించాలన్నారు. ప్రజల వద్ద ఉన్న బంగారు ఆభరణాలకు భరోసా ఉండాలని పేర్కొన్నారు. 11 మంది జీవిత గాథలతో హర్షమందిర్ పుస్తకం ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ నేత, రచయిత హర్షమందిర్ ఇటీవల రచించిన ‘ఫాటల్ యాక్సిడెంట్స్ ఆఫ్ ఎ బర్త్’ పుస్తకంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అణచివేతకు, హింసకు గురవుతున్న సామాజిక వర్గాలకు చెందిన 11 మంది వ్యక్తుల వాస్తవిక జీవితాలను ఆయన తన పుస్తకంలో కథలుగా రాశారు. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేములకు ఆ పుస్తకాన్ని అంకితం చేసినట్లు హర్షమందిర్ వివరించారు. ‘‘ఏ మనిషి కూడా ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ కులంలో పుట్టాలో తెలుసుకొని పుట్టడు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది వారి కులం, పరిస్థితుల వల్ల హింసకు, వివక్షకు గురవుతున్నారు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముగిసిన వేడుకలు మూడ్రోజులపాటు కన్నులపండువగా జరిగిన 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వేడు కలు ఘనంగా ముగిశాయి. సుమారు 16 వేల మందికి పైగా సందర్శకులు తరలి వచ్చారు. 11 దేశాల నుంచి 139 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీల్లో మహిళల అక్రమ రవాణా: సునీతా కృష్ణన్ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, బాలికల అక్రమ రవాణా ప్రమాద కరంగా ఉందని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సునీతా కృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల అక్రమ రవాణాపై జరిగి న చర్చలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ వంటి రాజధాని నగరంలోనూ మనుషుల అక్రమ రవాణా మాఫియా వేళ్లూనుకుంద న్నారు. ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చట్టాలు అవసరమ న్నారు. తన 15వ ఏటా సామూహిక అత్యా చారానికి గురైనప్పుడు సమాజం నుంచి వివక్షకు, బహిష్కరణకు గురయ్యా నని ఆమె చెప్పారు. బెంగళూరులో మిస్‌వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినప్పుడు జైలుకు వెళ్లానని అప్పుడు తన సొంత కుటుంబం నుంచే వివక్షను ఎదు ర్కోవలసి వచ్చిందని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ కుంగిపోకుండా బలంగా నిలబడి పోరాడినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 17 వేల మందికిపైగా మహిళలను అక్రమ రవాణా, వ్యభిచారం నుంచి విముక్తులను చేసి పునరావాసం కల్పించినట్లు చెప్పారు. -
రేపట్నుంచే కళల పండుగ
27 నుంచి 29 వరకు కన్నుల పండువగా ఉత్సవాలు పాల్గొననున్న అంతర్జాతీయ, జాతీయ కవులు.. ‘అతిథి’గా ఫిలిపీన్స్ ముఖ్యఅతిథులుగా అశోక్ వాజ్‌పేయి, అరుణ్‌శౌరీ, వైవీ రెడ్డి హాజరు సాక్షి, హైదరాబాద్: సాహితీ ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, కళా, సామాజిక రంగాలకు చెందిన అనేక అంశాలపై ఈ మూడు రోజుల పాటు చర్చలు, సదస్సులు, వర్క్‌షాపులు జరుగనున్నాయి. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 27న ప్రారంభమయ్యే 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో ప్రముఖ హిందీ కవి అశోక్ వాజ్‌పేయి కీలకోపన్యాసం చేస్తారు. అలాగే ఫిలిప్పీన్స్ అతిథి దేశంగా పాల్గొననుంది. ఆ దేశ రాయబారి మా తెరిస్తా సి.డాజా, ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ టి.విజయ్‌కుమార్ ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు... ఈ ఏడాది దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఫిలిప్పీన్స్, బ్రిటన్, అమెరికా, పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన వందమందికి పైగా రచయితలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు ఫెస్టివల్లో పాల్గొననున్నారు. సదస్సులు, వర్క్‌షాపులు, చర్చలు, నాటకాలు, నృత్యాలు, వీధి నాటకాలు, పుస్తక ప్రదర్శనలు, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ వంటి విభిన్న రంగాలకు చెందిన 130 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిలిప్పీన్స్‌లో రామాయణాన్ని ఆంగ్ల నాటక రూపంలో విస్తృతంగా ప్రదర్శించిన ప్రముఖ కళాకారుడు ఫెర్నాండెజ్, గోవాకు చెందిన ప్రముఖ కళాకారిణి క్యాథరీనా కక్కర్ వేడుకల్లో పాల్గొంటారు. అనేక ప్రత్యేకతలు... ►మొదటి రోజు ప్రముఖ హక్కుల ఉద్యమకారిణి నందితా హక్సర్ మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రసంగిస్తారు. కల్పన కన్నబీరన్ ఈ చర్చకు నేతృత్వం వహిస్తారు. ► గుజరాత్‌కు చెందిన బుధన్ థియేటర్ ’స్తనదాయిని’ నాటకాన్ని హిందీలో ’చోళీ కే పీచే క్యాహై’ అనే పేరుతో ప్రదర్శించనున్నారు. ►2వ రోజు అరుణ్‌శౌరి ‘లెసన్స్ ఫర్ లీడర్స్ అండ్ ఫాలోవర్స్’అనే అంశంపై ప్రసంగిస్తారు. ► 3వ రోజు ప్లీనరీలో వైవీ రెడ్డి ‘గోల్డ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఎల్లో’అనే అంశంపైన ప్రసంగిస్తారు. ► ప్రముఖ నృత్యకారిణి లీలా శ్యామ్సన్ నృత్య ప్రదర్శన చేయనున్నారు. ►హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కళాకారిణి శ్రీలేఖ పెయింటింగ్ ప్రదర్శన. ► తమిళనాడుకు చెందిన ప్రముఖ కళాకారిణి ఐశ్వర్యమణి మణ్ణన్ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ ’సిలంబమ్’ ప్రదర్శన. ► సినీనటులు ప్రకాష్‌రాజ్, నందినీరెడ్డిలు ‘మీనింగ్‌ఫుల్ సినిమా’పై జరిగే చర్చలో పాల్గొంటారు. ఇది మన పండుగ అందరికీ, అన్ని భావజాలాలకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వేదిక. ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇది మన పండుగ. – ప్రొఫెసర్ టి.విజయ్‌కుమార్, వ్యవస్థాపక డైరెక్టర్, హెచ్ఎల్ఎఫ్ చాలా విషయాలు తెలుస్తాయి ప్రతి సంవత్సరం వస్తున్నా. అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు బాగుంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. – సునీతారెడ్డి, సాహిత్యాభిమాని యువత కోసం యంగిస్తాన్ కొత్తగా ‘యంగిస్తాన్’ ఏర్పాటు చేస్తున్నాము. యువత తమ సృజనాత్మకతను ఆవిష్కరించేందుకు ఇది వేదిక. – కిన్నెరమూర్తి, డైరెక్టర్, హెచ్ఎల్ఎఫ్ -
ఆర్బీఐ హక్కులు హరిస్తే సంక్షోభం
వైవీ రెడ్డి ‘నా జ్ఞాపకాలు’ పుస్తకావిష్కరణలో జైపాల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యమంటే అర్థం.. స్వతంత్ర సంస్థల హక్కులను హరించడం కాదని, వాటిని కాపాడటమేనని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. ఆర్బీఐ స్వేచ్ఛని రాజకీయ నాయకులు హరిస్తే సంక్షోభం సంభవిస్తుందన్నారు. శుక్రవారం విద్యారణ్య పాఠశాలలో ఆర్బీఐ మాజీ గవర్నర్ యాగా వేణుగోపాల్‌రెడ్డి ఆత్మకథ ‘నా జ్ఞాపకాలు’ పుస్తకాన్ని జైపాల్ ఆవిష్కరించారు. ఆర్థిక సంస్కరణ లెప్పుడూ పేదవాడి పక్షమే వహించాలని భావించి, ఆచరించిన ఆర్థికరంగ నిపుణుడు వైవీ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఆర్బీఐలో కొత్త ఒరవడి, నూతన ప్రమాణాలకు అంకురార్పణ చేసిన వైవీ రెడ్డి కృషిని దేశం యావత్తు కొనియాడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని సాధించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం రెండు భిన్నమైన విషయాలను ఏకకాలంలో సమర్థవంతంగా నిర్వహించిన ఘనుడన్నారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కీలకమైన నిర్ణయాలు చేసి, వాటిని అమలు చేశారన్నారు. ఈ పుస్తకం భవిష్యత్ ఆర్థిక రంగ నిపుణులకు ఉపకరిస్తుందన్నారు. వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ పుస్తకాన్ని కళ్లతో చదువుతూ, హృదయంతో అనుభవించాలన్నారు. చట్టబద్ధంగా ప్రజలకు మంచి చేసే ఏ పనైనా ఆలస్యం చేయకూడదన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, శాస్త్రవేత్త రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉంది
14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ వైవీ రెడ్డి పేర్కొన్నారు. ఎకనామిక్స్ కాన్క్లేవ్-2016 పేరిట ఆర్థిక శాస్త్ర సదస్సు బుధవారం సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైవీ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో పోల్చుకుంటే అభివృద్ధి దిశగానే సాగుతుందన్నారు. జాతీయాదాయంలో ద్రవ్యలోటు 3 శాతం ఉండాలని, అప్పుడే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉపాధి రేటు, వ్యవసాయం, వనరుల నిర్వహణ స్థిరంగా ఉంటే సంక్షోభాలు తలెత్తవని సూచించారు. తాను ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో వడ్డీ రేట్లు పెంచినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రొఫెసర్లు, ఆర్థిక నిపుణులు, పరిశోధక విద్యార్థులు చర్చల్లో పాల్గొన్నారు. -
లివింగ్ లెజెండ్స్ పుస్తకావిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లీడర్షిప్ అంశానికి సంబంధించి రతన్ టాటా, ఆది గోద్రెజ్ తదితర 10 మంది వ్యాపార దిగ్గజాలపై రాసిన ‘లివింగ్ లెజెండ్స్ లెర్నింగ్ లెసన్స్’ పుస్తకాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు బాల వి బాలచంద్రన్, కవిప్రియ దీన్ని రాశారు. ఏ రంగంలోనైనా లీడరుగా ఎదగాలంటే వృత్తి పట్ల నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని వైవీ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వృత్తాంతాలను ఆయన ప్రస్తావించారు. మరోవైపు, సమాజానికి ప్రయోజనం చేకూరుస్తూ, సంపద సృష్టించగలిగే సంస్థలే దీర్ఘకాలంలో మనుగడ సాగించగలవని ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు ప్రతాప్ ఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మైనారిటీ బడ్జెట్ పది రెట్లు పెంచాలి
14వ ఆర్థిక సంఘానికి ఎంపీ అసదుద్దీన్ లేఖ సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మైనారిటీల సంక్షేమం, వివిధ పథకాల అమలుకు వార్షిక బడ్జెట్ కేటాయింపులను పది రెట్లు పెంచాలని కోరుతూ 14వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డికి మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం లేఖ రాశారు. మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఇటీవల జాతీయ మైనార్టీస్ కమిషన్, విద్యాసంస్థలు,జాతీయ శాంపిల్ సర్వే సంస్థలు చేసిన అధ్యయనాల్లో సైతం ఈ విషయం వెల్లడైందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం కింద మైనారిటీలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాల ప్లాన్, నాన్‌ప్లాన్ కేటాయింపులు తగినంతగా ఉండాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ మాదిరిగా బీసీ, మైనార్టీల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్ రూపొందించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
నేడు నగరానికి 14వ ఆర్థిక సంఘం
రాజ్‌భవన్‌లో సంఘం సభ్యులకు గవర్నర్ విందు రేపు సీఎం, మంత్రులు, అధికారులతో సభ్యుల సమావేశం హైదరాబాద్: వైవీ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం గురువారం హైదరాబాద్‌కు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్థిక సంఘం ప్రతినిధులు శుక్రవారం సమావేశమై వారితో చర్చించిన తరువాత నివేదిక తీసుకోనున్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులకు గురువారం గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందు ఇస్తున్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు మధ్యాహ్నం వరకు సమావేశమై ప్రభుత్వ కోర్కెల చిట్టా వివరించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నుంచి రాజకీయ పార్టీల నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు కమిషన్‌ను కలువనున్నారు. శుక్రవారం రాత్రికి సీఎం కేసీఆర్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున.. చేపట్టనున్న కొత్త పథకాలకు విరివిగా నిధులిచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. శనివారంనాడు కమిషన్ సభ్యులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. సీఎం సమీక్ష.. 14వ ఆర్థిక సంఘాన్ని కోరే అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వాటర్‌గ్రిడ్, పోలీసు వ్యవస్థ బలోపేతం, రహదారుల నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల, సలహాదారులు పాపారావు, జీఆర్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, అధికారులు పాల్గొన్నారు. -
నేడు, రేపు తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం పర్యటన
తిరుపతి: డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన 14వ ఆర్థిక సంఘం గురు, శుక్రవారాల్లో తిరుపతిలో పర్యటించనుంది. 11వ తేదీ గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకునే కమిషన్ సాయంత్రం 4 గంటలకు జిల్లా పాలనాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో భేటీ అవుతుంది. రాత్రి తిరుపతిలోనే బస చేసి 12న తిరుచానూరు రోడ్డులోని హోటల్ గ్రాండ్ రిడ్జ్‌లో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతోపన్యాసంతో రెండోరోజు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 10.35 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 11 గంటల నుంచి ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ప్రగతికి సంబంధించి సూచించిన కీలక అంశాలపై చర్చ అనంతరం ఫైనాన్స్ కమిషన్ తన స్పందన తెలియజేస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులతో అనంతరం స్థానిక సంస్థల ప్రతినిధులు, రాజకీయ పక్షాల ప్రతినిధులతో కమిషన్ విడివిడిగా సమావేశమవుతుంది. రాత్రి ఇక్కడే బస చేసి 13 ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టీ బుధవారం పర్యవేక్షించారు. అధికారులంతా తిరుపతికి చిత్తూరు(సెంట్రల్): శుక్రవారం 14వ ఆర్థిక సంఘం సమావేశం తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో జరగనున్న విషయం విదితమే. ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులంతా గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకోనున్న నేపథ్యంలో వారికి భోజనం, వసతి సౌకర్యాల కల్పన కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచే తిరుపతికి బయలుదేరి వెళ్లారు. పలువురిని చైర్మన్, సభ్యులకు లైజాన్ అధికారులుగా నియమించారు. దీనికి తోడు ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ కార్యదర్శులు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్ నిబంధనల మేరకు ప్రధాన అధికారులంతా వారి సేవలో ఉండాల్సి ఉంది. దీంతో ప్రతి శాఖాధికారి తప్పనిసరిగా మూడు రోజుల పాటు (గురు, శుక్ర, శని) తిరుపతిలో ఉండేందుకు సిద్ధమై వెళ్లారు. భారీ బందోబస్తు తిరుపతి క్రైం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తిరుపతికి వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఎస్పీ గోపీనాథ్ జట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ గ్రాండ్ రిడ్జ్కు చేరుకుని సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం అక్కడే భోజన కార్యక్రమం అయిన తరువాత సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరుతారని సమాచారం. పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్లను అణువణువునా బుధవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జారుుంట్ కలెక్టర్, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
చిన్న చూపు తగదు..!
సాక్షి, చెన్నై : రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రం చిన్న చూపు తగదని ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల పెంపు కోసం సహకరించాలని ఫైనాన్స్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. వైవీ రెడ్డి నేతృత్వంలో ఫైనాన్స్ కమిషన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం చెన్నై చేరుకుంది. సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఈ కమిషన్ సమావేశం అయింది. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగిస్తూ, రాష్ర్ట ప్రభుత్వ ప్రగతిని వివరించారు. తమ ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్షను ఎత్తి చూపారు. ఇక్కడి పథకాలకు సమృద్ధిగా నిధుల్ని కేటాయించాల్సిన కేంద్రం, చిన్నచూపు చూడటం తగదన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందించాల్సిన కేంద్రం రాజకీయ ఎత్తుగడల్ని అనుసరించడం విచారకరమని పేర్కొన్నారు. తమిళనాడుకు పారదర్శకంగా నిధుల్ని కేటాయించాలని, సకాలంలో నిధుల మంజూరుకు సహకరించాలని ఫైనాన్స్ కమిషన్‌కు ఆమె విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డి, సభ్యులు సుష్మానాథ్, గోవిందరావు, సుదీప్ మున్డేల్, అభిజిత్ సేన్, కార్యదర్శి ఏఎన్ జా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.