సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు వైవీ రెడ్డి, రంగరాజన్‌లు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రుణాల మాఫీ ఆర్థికవ్యవస్థ, పరపతి సంస్కృతికి మంచిది కాదని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. రుణమాఫీ పూర్తిగా రాజకీయ నిర్ణయమని, దీన్ని దీర్ఘకాలంలో సమర్ధించలేమని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి రాజకీయ పార్టీ ఆయా రాష్ట్రాల్లో రుణమాఫీని ప్రకటిస్తున్నాయని అన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రుణమాఫీ బదులు అప్పులు తిరిగి చెల్లించేందుకు రైతులకు సుదీర్ఘ సమయం ఇవ్వడంతో పాటు వాయిదా చెల్లింపును నిలిపివేయడం, నిర్దిష్ట సంవత్సరానికి వడ్డీ తగ్గించడం వంటి ప్రత్యామ్నాయాలు మెరుగైనవని ఆయన సూచించారు. కరువు పరిస్థితుల్లో వడ్డీ చెల్లింపులు మాఫీ చేయడం, రుణాల చెల్లింపుకు దీర్ఘకాలం ఉండేలా రీషెడ్యూల్ చేయడం మంచిదని చెప్పారు.
ఈ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వనప్పుడే రుణమాఫీకి ప్రభుత్వాలు మొగ్గుచూపాలన్నారు. పంజాబ్, యూపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించిన క్రమంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment