లివింగ్ లెజెండ్స్ పుస్తకావిష్కరణ | Living Legends book release | Sakshi
Sakshi News home page

లివింగ్ లెజెండ్స్ పుస్తకావిష్కరణ

Sep 19 2015 1:25 AM | Updated on Sep 3 2017 9:35 AM

లివింగ్ లెజెండ్స్ పుస్తకావిష్కరణ

లివింగ్ లెజెండ్స్ పుస్తకావిష్కరణ

లీడర్‌షిప్ అంశానికి సంబంధించి రతన్ టాటా, ఆది గోద్రెజ్ తదితర 10 మంది వ్యాపార దిగ్గజాలపై రాసిన ‘లివింగ్ లెజెండ్స్ లెర్నింగ్ లెసన్స్’ పుస్తకాన్ని ఆర్‌బీఐ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లీడర్‌షిప్ అంశానికి సంబంధించి రతన్ టాటా, ఆది గోద్రెజ్ తదితర 10 మంది వ్యాపార దిగ్గజాలపై రాసిన ‘లివింగ్ లెజెండ్స్ లెర్నింగ్ లెసన్స్’ పుస్తకాన్ని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు బాల వి బాలచంద్రన్, కవిప్రియ దీన్ని రాశారు. ఏ రంగంలోనైనా లీడరుగా ఎదగాలంటే వృత్తి పట్ల నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని వైవీ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి వృత్తాంతాలను ఆయన ప్రస్తావించారు. మరోవైపు, సమాజానికి ప్రయోజనం చేకూరుస్తూ, సంపద సృష్టించగలిగే సంస్థలే దీర్ఘకాలంలో మనుగడ సాగించగలవని ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. ధృవ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు ప్రతాప్ ఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement