హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై క్రమంగా పెరుగుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి అన్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలకు భారత్ కూడా కారణం అవుతోందని చెప్పారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ‘చైనా, ఇరాన్, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల ప్రభావం చమురు లభ్యత, నిధుల ప్రవాహానికి అవరోధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు భారత్‌కు స్వల్ప కాలానికి హాని కలుగజేసే సమస్యలే. అంతర్జాతీయ వ్యాపారంపై చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై యూఎస్‌ఏ ఆధిపత్యం ఉంది. ఇది కూడా అంతర్జాతీయ సంఘర్షణకు ఒక కారణం. ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు దేశాల దయాదాక్షిణ్యాలపై ప్రపంచం నడుస్తోంది. యూఎస్‌లో వినియోగం కోసం ఉన్న యూఎస్ డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీగా వాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment