సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎంతకాలం అమలు చేయాలి? వాటి అమలు తీరు వంటి అంశాలపై సమీక్ష జరగా లని 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ప్రధాన్‌మంత్రి సమ్మాన్ యోజన వంటి సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు భారీగా పెంచాల్సిన అవసరం ఉం దన్నారు. కేంద్ర పథకాలు కిందిస్థాయికి వెళ్లేసరి కి నిధులు ఎంతమేర తరుగుదలకు గురవుతున్నాయో పరిశీలించాలని సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో బుధవారం ‘బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఆర్థిక సమాఖ్యవాదం; స్థూల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు’అంశంపై పలువురు ఆర్థికవేత్తలు 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్‌కే సింగ్ మాట్లాడుతూ..15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 నుంచి అమ ల్లోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రాలు కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వా రా మెరుగైన వాటాను కోరుకుంటున్నాయని, అందుకుతగ్గట్టుగా ప్రాధామ్యాలను గుర్తించి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రతిపాదనలు చేయాల్సి ఉందన్నారు. జీఎస్టీ పన్నువిధానంలో పలుమార్పులు చోటుచేసుకోవడం, స్లాబులు మారడం వంటివి జరగడంతో రాబడి, తదితర అంశాలపై స్పష్టత సాధించా ల్సి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త వై.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చైనాలో స్థానిక ప్రభుత్వాలకు వనరుల నిర్వహణ, కేటాయిం పులు, ఖర్చులకు సంబంధించి స్వేచ్ఛను ఇచ్చారని, అందుకు భిన్నంగా భారత్‌లో పరిస్థితులున్నాయని చెప్పారు. మార్కెట్లు గతంలో మాదిరి గా భూమి, ఇతరత్రా కేటాయింపులు కోరుకోవడం లేదని, వాటికి అవసరమైన నీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలికసదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థికసంఘం నిర్వహించాల్సిన పాత్రను పునర్‌నిర్వచిం చుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బహుళపార్టీ వ్యవస్థకే ఆదరణ ఉందని చెప్పారు.
జీఎస్టీతో నష్టపోతున్నాయి
జీఎస్టీ అమలుతో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, రాబడి రాక అవి తీవ్రంగా నష్టపోతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మహంతి అన్నారు. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాన్ని భర్తీచేసే చర్యలు ఆర్థిక సంఘం తీసుకోవాలన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు. జీఎస్‌టీ, విపత్తుల నిర్వహ ణ వంటి అంశాలపై ఆర్థిక సంఘం దృష్టి పెట్టాలని విశ్రాంత ఐఏ ఎస్ అధికారి వి.భాస్కర్ సూచించారు. జీఎస్టీ అమలు ద్వారా కేంద్రం వద్ద పెద్దమొత్తంలో పన్నులు పోగుపడటం సరికాదన్నారు. ఎండీఆర్‌ఎఫ్ కింద రాష్ట్రాలకు కేటాయించే నిధులను 25 నుంచి 30 శాతానికి పెంచాలన్నారు. కేంద్ర పథకాలను కొన్ని రాష్ట్రప్రభుత్వాలు అమలు చేసేందుకు సంసిద్ధంగా లేక పోతే ఇతరత్రా రూపాల్లో ఆయా రాష్ట్రాలకు నిధులు అందేలా ఆర్థికసంఘం చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు మెరుగైన ఫలి తాలు సాధిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యు లు అనూప్‌సింగ్, అశోక్ లహరి, అరవింద్ మెహ తా, రమేశ్ ఛాడ్, ఆర్థిక వేత్తలు డా.ప్రేమ్ చంద్, నారాయణ్ వల్లూరి, ప్రొ.భగవాన్ చౌదరి, డా.డి.శివారెడ్డి, ప్రసన్న తంత్రి, ఎన్‌ఏఖాన్, రాధికా రస్తోగి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాల అమలుపై సమీక్ష జరగాలి
Published Thu, Feb 21 2019 3:05 AM | Last Updated on Thu, Feb 21 2019 3:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment