NK singh
-
ద్రవ్యలోటు కట్టడికి చర్యలు అవశ్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును కట్టడిలోకి తీసుకోడానికి విశ్వసనీయ చర్యలు అవసరమని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి సవాళ్లు తొలగిన వెంటనే ఈ బాటలో చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ రుణ భారం ఇప్పటికి అటు ఆందోళనకరంగాకానీ లేదా ఇటు తగిన స్థాయిలో కానీ లేదని ఆయన విశ్లేíÙస్తూ, ఆర్థిక ఉద్దీపన చర్యలను కోరడానికి ముందు ఆయా వర్గాలన్నీ దేశ రుణ భారం అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెకించడానికి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రూ.30 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 15 శాతం. ద్రవ్యలోటు పెరుగుదలపై విభిన్న వాదనల నేపథ్యంలో ఎన్కే సింగ్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2019– 20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యమయితే, కరోనా ఈ లక్ష్యానికి గండి కొట్టింది. భారీ వ్యయాలు, ఉద్దీపనల నేపథ్యంలో ద్రవ్యలోటు ఏకంగా 9.3 శాతానికి (రూ.18,21,461 కోట్లు) ఎగసింది. 2021–22లో జీడీపీలో 6.8 శాతం (రూ.15,06,812 కోట్లు)ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. అయితే 8 శాతం దాటిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై ముగిసే సరికి రూ.3.21 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2021–22 వార్షిక బడ్జెట్ అంచనాలతో పోలి్చతే ఇది 21.3 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సూచనలు.. ప్రభుత్వం కొంత ధైర్యం చేసి ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచవచ్చని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ వంటి పలువురు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రతిపాదనల అమలును రేటింగ్, బహుళజాతి ఆర్థిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో సామాజిక ఆర్థిక పురోగతి వ్యవహారాల కేంద్రం (పీఎస్‌ఈపీ)– ప్రపంచబ్యాంక్ నిర్వహించిన సెమినార్లో 15 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన ప్రసంగంలో ద్రవ్యలోటుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఆరోగ్య రంగంపై వ్యయాలు పెరగాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ కేవలం 0.95 శాతం ఉందని పేర్కొన్న ఆయన, 2024నాటికి ఇది 2.5 శాతానికి చేరాలని సూచించారు. దురదృష్టవశాత్తూ, ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆసియా హెల్త్ 2020 అనే అంశంపై పారిశ్రామిక వేదిక సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగ్ మాట్లాడారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఏ ఒక్కరో ఎదుర్కొనలేరనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ... ఈ రంగంపై కేటాయింపులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి చర్యలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పరిధి పెంచడం వంటి రెగ్యులేటరీ మార్పులను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం... ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా కీలకమని సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న నైపుణ్యలతో ప్రైవేటు రంగం చక్కటి సేవలను అందించగలుగుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. కోవిడ్–19ను ఎదుర్కొనడంలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్న సింగ్, ఆరోగ్య సేవల విషయంలో మరింత గుర్తింపు లభించడానికి వారు అర్హులని అన్నారు. ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ ప్రస్తావన ‘‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఏర్పాటవుతుందని 1951 సివిల్ సర్వీసెస్ యాక్ట్ పేర్కొంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, అప్పటి నుంచీ ఈ తరహా సర్వీస్ ఏదీ ఏర్పాటు కాలేదు’’ అని సందర్భంగా పేర్కొన్న సింగ్, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇప్పటికే చోటుచేసుకున్న పరిణా మాలు, ఉదాహరణల ప్రాతిపదికన ఈ సర్వీసు ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరోగ్యం రంగం పలు సమస్యలు, సవాళ్ల వలయంలో చిక్కుకుందనీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికన్ అసోసియేషన్ (ఐఎంఏ) గత కొంత కాలంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2021–22 నుంచి 2025–26 మధ్య దేశ ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికాంశాలు వెల్లడవుతాయి. -
ప్రధానికి 15వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం 15వ ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో (2021–22 నుంచి 2025–26) కేంద్రం–రాష్ట్రాల మధ్య పన్ను విభజనసహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై 15వ ఫైనాన్స్ కమిషన్ తన సిఫారసులను చేసింది. ‘ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్’ శీర్షికన రూపొందించిన ఈ నివేదికను మంగళవారం కమిషన్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా సమర్పించనుంది. నవంబర్ 9న కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, సభ్యులు అజయ్ నారాయన్ ఝా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేశ్ చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రకారం, చర్యల నివేదికతో పాటు కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– కోవిడ్–19 నేపథ్యంలో కమిషన్ ప్రత్యేకంగా 2020–21కి సంబంధించి ఒక నివేదికను సమర్పించింది. ఐదేళ్ల కాలానికి కమిషన్ తన సిఫారసులను 2020 అక్టోబర్ 30 నాటికి సమర్పించడం తప్పనిసరి. పలు కీలక ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి సిఫారసులను ఇవ్వాలని 15వ ఫైనాన్స్ కమిషన్‌ను కేంద్రం కోరింది. కిందిస్థాయి వరకు పన్ను పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్‌తో పాటు విద్యుత్, నగదు బదిలీ అమలు, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్‌ను కోరింది. -
మరో ఉద్దీపనకు చాన్స్
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఒక సూచనప్రాయ ప్రకటన చేశారు. అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాలపై కేంద్రం మదింపు ప్రక్రియను అక్టోబర్ నుంచీ ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. మదింపు ఫలితాలకు సంబంధించి ఆర్థికశాఖ ప్రకటన చేస్తుందనీ తెలిపారు. ‘మరో ఉద్దీపన అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. లోతైన సంప్రదింపుల అనంతరం మేము ఇప్పటివరకూ 2 ఉద్దీపనలను ప్రకటించాము’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను వర్గీకరించడానికి ఆర్థికశాఖ త్వరలో క్యాబినెట్‌ను సంప్రదిస్తుందని కూడా ఆర్థికమంత్రి తెలిపారు. వ్యయాలపై సీపీఎస్ఈలకు నిర్మలాసీతారామన్ సూచన ఇదిలావుండగా, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎస్ఈలు 2020–21లో నిర్దేశించుకున్న మూలధన వ్యయ లక్ష్యాల్లో 75% డిసెంబర్‌కి చేరుకోవాలని.. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా కారణంగా కుంటుపడిన ఆర్థిక వృద్ధిని తేజోవంతం చేసేందుకు గాను ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో భేటీ కావడం ఇది నాలుగోది. మూలధన వ్యయాలను 2020–21, 2021–22లో వేగవం తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2019–20కి 14 సీపీఎస్ఈలు రూ.1,11,672 కోట్లను మూలధన వ్యయాల రూపంలో ఖర్చు చేయాలని నిర్దేశించుకోగా.. రూ.1,16,323 కోట్లు (104%) ఖర్చు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,934 కోట్ల వ్యయాలను అవి లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి 6 నెలల్లో (సెప్టెంబర్ నాటికి) కేవలం రూ.37,423 కోట్లనే వ్యయం చేశాయి. తయారీపై దృష్టి పెట్టాలి: ముకేశ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70% వాటా ఉన్న తయారీ రంగంలో పెట్టుబడులపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తీసుకుంటున్న చర్యల ఫలితాలు, భవిష్యత్తులో పరిశ్రమలు, సేవా రంగాల పనితీరుపై సమగ్ర మదింపు జరపాలని సూచించారు. దేశ స్వయం సమృద్ధి విషయంలో ఇది కీలకమన్నారు. ‘ఒక పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడైన మా తండ్రి 1960లో ముంబైలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన దగ్గర ఉంది కేవలం రూ.1,000. భవిష్యత్ వ్యాపారాలు, ప్రావీణ్యతల్లో పెట్టుబడి పెడితే మనం కలలుగన్న భారతాన్ని మనమే నిర్మించుకోగలమన్న విశ్వాసం ఆయనది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలను, కంపెనీలను సృష్టించగలమన్న నమ్మకం ఆయన సొంతం’ అని ముకేశ్ పేర్కొన్నారు. -
ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి నిధులు దక్కేలా తగిన రీతిలో సిఫార్సులు చేయాలని ఆర్థిక సంఘం చైర్మన్‌ను కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, 2020–21 ఆర్థిక సంవత్సరానికి వర్తించేలా ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి పంచే వాటాలను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నిర్ణయించినందున ఆంధ్రప్రదేశ్‌పై ఇప్పటికే ప్రభావం పడిందని బుగ్గన గుర్తు చేశారు. ఆయన వెంట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌తో.. నీతిఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్‌తో బుగ్గన రాజేంద్రనాథ్ సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులను ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, సముచిత రీతిలో సిఫార్సులు చేయడం ద్వారా రాష్ట్రానికి మేలు చేయాలని కోరారు. అలాగే నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ సెక్రెటరీ రతన్ వటల్‌తో రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు ఆర్థిక అంశాలపై నివేదించారు. -
ఆర్థిక సంఘం చైర్మన్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం పెంచాలని సీఎం కోరారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయానికి.. ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందన్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని గత సర్కారు ఆర్థికంగా దివాళా ఎలా దివాళా తీయించిందో వివరించడంతో పాటు... ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, అక్షరాస్యత పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, విద్య వైద్య రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మహిళలు, పిలల్లో పౌష్టికాహార లోపం నివారణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ 15వ ఆర్థిక సంఘానికి సమగ్రంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆవశ్యకతలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని రాజ్యసభలో ఏపీకి ప్రకటించిన ‘ప్రత్యేక హోదా’ హామీ ఇప్పటికీ నెరవేరలేదని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. -
గ్రాంట్లు ఇప్పించి ఆదుకోండి
సాక్షి, అమరావతి: విభజన సమస్యలతోపాటు గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆర్థికంగా కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఉదారంగా గ్రాంట్ల మంజూరుకు సిఫార్సు చేయాల్సిందిగా 15వ ఆర్థిక సంఘాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్‌తో పాటు మిగతా అధికారులు బుధవారం రేణిగుంట చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి ఆర్థిక మంత్రి బుగ్గన స్వాగతం పలికారు. అనంతరం వారు తిరుమలకు వెళ్లారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మధ్యాహ్నం విజయవాడ చేరుకోనున్నారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వనున్న విందుకు ఎన్.కె.సింగ్‌తోపాటు అధికారులు హాజరు కానున్నారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో 15వ ఆర్థిక సంఘం సమావేశం కానుంది. రాష్ట్రాన్ని గత సర్కారు ఆర్థికంగా దివాళా ఎలా దివాళా తీయించిందో వివరించడంతోపాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, అక్షరాస్యత పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, విద్య వైద్య రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మహిళలు, పిలల్లో పౌష్టికాహార లోపం నివారణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ 15వ ఆర్థిక సంఘానికి తెలియచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆవశ్యకతలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని రాజ్యసభలో ఏపీకి ప్రకటించిన ‘ప్రత్యేక హోదా’ హామీ ఇప్పటికీ నెరవేరలేదని ఆర్థిక సంఘం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. హోదా ఎందుకంటే? – హైదరాబాద్ కోల్పోయినందున ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగావకాశాలు దూరమయ్యాయి. – ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు దక్కాలంటే పరిశ్రమలు రావాలి. పారిశ్రామిక రాయితీలు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. – ప్రత్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక రాయితీలకు అవకాశం ఉంటుంది. – ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయాలని 15వ ఆర్ధిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. -
ఏపీ పర్యటనకు రండి: విజయసాయిరెడ్డి
ఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి శుక్రవారం 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆహ్వానించారు. అదే విధంగా ఆహ్వాన లేఖను ఆయనకు అందజేశారు. కాగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానంపై ఎన్కే సింగ్ సానుకూలంగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తానని పేర్కొనట్లు విజయసాయరెడ్డి మీడియాకు తెలిపారు. అంతకు ముందు కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హరి సిమ్రత్ కౌర్‌ను విజయసాయి రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటలు ఉన్న నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని హరి సిమ్రత్ కౌర్‌కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో భేటీ అయిన విజయసాయి రెడ్డి అనంతపురం జిల్లాకు పశుగ్రాసం పంపాలని వినతి పత్రం అందజేశారు. జిల్లాలో వర్షాలు లేక తీవ్ర కరువు ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి వస్తోందని.. కేంద్రం సత్వరమే స్పందించి జిల్లాకు రెండు నెలలకు సరిపడ పశుగ్రాసం పంపించాలని తోమార్‌ను కోరారు. -
కేంద్ర పథకాల అమలుపై సమీక్ష జరగాలి
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎంతకాలం అమలు చేయాలి? వాటి అమలు తీరు వంటి అంశాలపై సమీక్ష జరగా లని 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎన్కే సింగ్ అభిప్రాయపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, ప్రధాన్‌మంత్రి సమ్మాన్ యోజన వంటి సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు భారీగా పెంచాల్సిన అవసరం ఉం దన్నారు. కేంద్ర పథకాలు కిందిస్థాయికి వెళ్లేసరి కి నిధులు ఎంతమేర తరుగుదలకు గురవుతున్నాయో పరిశీలించాలని సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో బుధవారం ‘బహుళ పార్టీల ప్రజాస్వామ్యంలో ఆర్థిక సమాఖ్యవాదం; స్థూల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు’అంశంపై పలువురు ఆర్థికవేత్తలు 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్కే సింగ్ మాట్లాడుతూ..15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 నుంచి అమ ల్లోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రాలు కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వా రా మెరుగైన వాటాను కోరుకుంటున్నాయని, అందుకుతగ్గట్టుగా ప్రాధామ్యాలను గుర్తించి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రతిపాదనలు చేయాల్సి ఉందన్నారు. జీఎస్టీ పన్నువిధానంలో పలుమార్పులు చోటుచేసుకోవడం, స్లాబులు మారడం వంటివి జరగడంతో రాబడి, తదితర అంశాలపై స్పష్టత సాధించా ల్సి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త వై.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. చైనాలో స్థానిక ప్రభుత్వాలకు వనరుల నిర్వహణ, కేటాయిం పులు, ఖర్చులకు సంబంధించి స్వేచ్ఛను ఇచ్చారని, అందుకు భిన్నంగా భారత్‌లో పరిస్థితులున్నాయని చెప్పారు. మార్కెట్లు గతంలో మాదిరి గా భూమి, ఇతరత్రా కేటాయింపులు కోరుకోవడం లేదని, వాటికి అవసరమైన నీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలికసదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థికసంఘం నిర్వహించాల్సిన పాత్రను పునర్నిర్వచిం చుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బహుళపార్టీ వ్యవస్థకే ఆదరణ ఉందని చెప్పారు. జీఎస్టీతో నష్టపోతున్నాయి జీఎస్టీ అమలుతో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, రాబడి రాక అవి తీవ్రంగా నష్టపోతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మహంతి అన్నారు. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాన్ని భర్తీచేసే చర్యలు ఆర్థిక సంఘం తీసుకోవాలన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు. జీఎస్టీ, విపత్తుల నిర్వహ ణ వంటి అంశాలపై ఆర్థిక సంఘం దృష్టి పెట్టాలని విశ్రాంత ఐఏ ఎస్ అధికారి వి.భాస్కర్ సూచించారు. జీఎస్టీ అమలు ద్వారా కేంద్రం వద్ద పెద్దమొత్తంలో పన్నులు పోగుపడటం సరికాదన్నారు. ఎండీఆర్ఎఫ్ కింద రాష్ట్రాలకు కేటాయించే నిధులను 25 నుంచి 30 శాతానికి పెంచాలన్నారు. కేంద్ర పథకాలను కొన్ని రాష్ట్రప్రభుత్వాలు అమలు చేసేందుకు సంసిద్ధంగా లేక పోతే ఇతరత్రా రూపాల్లో ఆయా రాష్ట్రాలకు నిధులు అందేలా ఆర్థికసంఘం చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు మెరుగైన ఫలి తాలు సాధిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యు లు అనూప్‌సింగ్, అశోక్ లహరి, అరవింద్ మెహ తా, రమేశ్ ఛాడ్, ఆర్థిక వేత్తలు డా.ప్రేమ్ చంద్, నారాయణ్ వల్లూరి, ప్రొ.భగవాన్ చౌదరి, డా.డి.శివారెడ్డి, ప్రసన్న తంత్రి, ఎన్ఏఖాన్, రాధికా రస్తోగి తదితరులు పాల్గొన్నారు. -
అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
-
రుణపరిమితి పెంచండి
సాక్షి, హైదరాబాద్ : స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3% మించి రుణాలు స్వీకరించేందుకు ఆర్థికాభివృద్ధి ఉన్న రాష్ట్రాలను అనుమతించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని సీఎం కేసీఆర్ 15వ ఆర్థిక సంఘానికి సిఫారసు చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఇది ఎంతో సహకరిస్తుందన్నారు. జీఎస్డీపీపై అదనంగా మరొకశాతం అప్పు పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ బృందంతో.. సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బృందానికి కేసీఆర్ పలు విజ్ఞప్తులు చేశారు. వివిధ అంశాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న పురోగతికి గుర్తింపుగా ప్రోత్సాహకాలను సిఫారసు చేయాలన్నారు. కేంద్ర పథకాలకే పరిమితం చేయకుండా రాష్ట్రాల కీలక పథకాలకు ఈ ప్రోత్సాహకాలను వర్తింపజేయాలన్నారు. రైతుబంధు, మధ్యాహ్న భోజనం, ఉపాధిహామీ వంటి పథకాలను తొలుత రాష్ట్రాలే అమలు చేయగా, కేంద్రం అనుసరించక తప్పలేదని, ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల రూపకల్పన బాధ్యత రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. ప్రాధాన్య, అప్రాధాన్యత అంశాలను కేంద్రం కన్నా రాష్ట్రాలే బాగా గుర్తించగలవన్నారు. పన్నుల క్రమబద్ధీకరణలో భాగంగా రాష్ట్రాలు తమ స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడి జీఎస్టీకి సంపూర్ణ మద్దతునిచ్చాయని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయానికి ఆధారమైన వాణిజ్య పన్ను/వ్యాట్ జీఎస్టీలో అంతర్భాగమైందన్నారు. కేంద్రం ఆదాయ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీలను జీఎస్టీలో విలీనం చేయలేదన్నారు. 50% పైగా రాష్ట్రాలకు సొంత ఆదాయం తెచ్చే పన్నులు జీఎస్టీ పరిధిలోకి రాగా కేవలం 31% కేంద్ర పన్నులు మాత్రమే ఏకీకృత పన్ను జాబితాలో చేరాయన్నారు. దీంతో రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోయాయన్నారు. (రాష్ట్రాభివృద్ధిలో ఐటీ పాత్ర భేష్) దేశమంతా తెలం‘గానం’ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్లు నిధుల వ్యయ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయగల పరిపక్వతను రాష్ట్రాలు సాధించాయని, ఈ విషయంలో కేంద్రం కంటే రాష్ట్రాలే ఆర్థిక దూరదృష్టితో వ్యవహరించగలవని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనాల గురించి మాత్రమే చర్చ జరిగేదని, ఇప్పుడే దేశమంతా తెలంగాణ అభివృద్ధి నమూనా గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. దేశ నిర్మాణంలో రాష్ట్రాలకు సమ భాగస్వామ్యం లభించనుందని నీతి ఆయోగ్ ఏర్పాటుతో ఆశలు చిగురించాయని, కానీ ఈ ఆశలు ఫలించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు అధిక నిధుల కేటాయింపునకు తాము వ్యతిరేకం కామన్నారు. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ కాకుండా ఇతర మార్గాల్లో సహకారం అందించాలన్నారు. రాష్ట్రాలకు పన్నుల ఆదాయం పంపిణీ పెంచాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల వల్ల దేశ అభివృద్ధి ఎజెండా ముందుకు సాగిందని గుర్తు చేశారు. బకాయిలు ఇవ్వాలి తెలంగాణ ఏర్పడిన కొత్తలో తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. తీవ్ర విద్యుత్ కొరత, రైతుల ఆత్మహత్యలతోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు దేశ సగటుకు దిగువన ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని, బంగారు తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2002–05, 2005–11 మధ్య కాలంలో రాష్ట్రం పరిధిలోని అంశాలపై కేంద్ర నిధుల వ్యయం 14–20%కు పెరిగిందని, అలాగే ఉమ్మడి జాబితాలోని అంశాలపై 13–17%కు చేరిందని 14వ ఆర్థిక సంఘం నివేదించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపులు పెంచేందుకు పుష్కలమైన అవకాశాలున్న విషయాన్ని ఈ అంశం వెల్లడిస్తోందన్నారు. కేంద్ర నుంచి రాష్ట్రాలకు రావాల్సిన రోడ్డు సెస్, క్లీన్ ఎనర్జీ సెస్ పూర్తి స్థాయిలో రావడం లేదని, కాగ్ తప్పుబట్టినా కేంద్రం బకాయిలు చెల్లించడం లేదని సీఎం వెల్లడించారు. 2017–18 చివరినాటికి కేంద్ర రాష్ట్రాలకు రూ.72,726 కోట్ల రోడ్ సెస్, రూ.44,505 కోట్ల క్లీన్ ఎనర్జీ సెస్‌ను బకాయి పడిందన్నారు. ప్రాధామ్యాలు నిర్ణయించే హక్కు రాష్ట్రాలకే రాష్ట్రాల్లోని పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రాధామ్యాలు నిర్ణయించుకునేందుకు అవకాశాలు కల్పిస్తే బావుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల్లోనూ లెక్కకు మించి కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉండడాన్ని ఆయన ఉదహరించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన సర్కారియా కమిషన్ చర్చల సందర్భంగా కూడా ఉమ్మడి జాబితా రద్దు చేయాలని రాష్ట్రాలు ప్రతిపాదించాయని గుర్తు చేశారు. కేంద్ర–రాష్ట్ర ఉమ్మడి జాబితాలో చేర్చిన క్రిమినల్లా, అటవీ, దివాళా, కార్మిక సంఘాలు, కార్మిక సంక్షేమం, లీగల్, మెడికల్, విద్య, విద్యుత్ వంటి అంశాలపై ఎక్కువగా పార్లమెంటే చట్టాలు చేస్తోందన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం కొత్త పథకాలు అమలు చేస్తోందని, రాష్ట్రాల్లో అంతకంటే మంచి పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నదీజలాల హక్కుల నిర్ధారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరి ఏళ్లు గడుస్తున్నా.. ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు నివేదించలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేయొచ్చునని మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తమ ప్రభుత్వం చేసి చూపించిందని కేసీఆర్ అన్నారు. రాబోయే ఐదారేళ్లలో దేశంలోని ప్రతీ గ్రామానికి నీటిసరఫరా చేసే లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రూ.8–10లక్షల కోట్ల వ్యయం కావొచ్చన్నారు. ప్రతీఏడాది ఎమ్మెస్పీ పెంచాలి కనీస మద్దతు ధరను రూ.500 లేదా ప్రస్తుతమున్న ఎమ్మెస్పీకి మూడోవంతు పెంచడమో చేయాలని కేసీఆర్ సూచించారు. ఉద్యోగుల డీఏలో మాదిరిగా ధరల సూచీకి లింక్ చేయడం ద్వారా ఎమ్మెస్పీని ప్రతీఏడాది పెంచాలని కోరారు. వ్యవసాయరంగంలో లాభాలు, ఉత్పాదకత తక్కువగా ఉన్నందున రైతులు–వినియోగదారుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోందన్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10వేలు రైతులకు చెల్లించడం అనేది ఈ దిశగా ఒక ముందడుగు అని చెప్పారు. నీటిరంగంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న పలు విభేదాలను సంప్రదింపులతో అధిగమించగలిగామని, కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు ఒక సజీవసాక్ష్యమని కేసీఆర్ చెప్పారు. సీఎం పేర్కొన్న మరిన్ని అంశాలు – కేంద్రపన్నులో రాష్ట్రాల వాటా పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు. జీఎస్టీ విధానం అమలు వల్ల రాష్ట్రాల సొంత ఆదాయాల్లో కోత పడిందన్నారు. అందువల్ల జీఎస్టీలో రాష్ట్రాల వాటాను 50% పెంచాలని కోరారు. – ఎఫ్ఆర్బీఎంను ఇప్పుడు ఉన్నదానికంటే 1% పెంచాలని, సమానత్వం, సమర్థత విషయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యయానికి బదులు రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలు ఇవ్వాలని కోరారు. – రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 8,368 నుంచి 12,751కు, పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 74 నుంచి 142కు పెంచామని, వాటి అవరాలకు తగ్గట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించాలని కోరారు. – రాష్ట్రంలోని 1.24కోట్ల ఎకరాలకు నీటిపారుదల సదుపాయం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని పలు ప్రాజెక్టులు చేపట్టాం. రూ.80 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో 13 జిల్లాల పరిధిలో 18లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం. 15వ ఆర్థికసంఘం కాల పరిమితిలో ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.40,169 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యయాన్ని సిఫారసు చేయాలి. – ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకం నిర్వహణ కోసం 2020–25 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలకు రూ.10,142 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.2,850 కోట్ల వ్యయం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.12,722 కోట్ల నిర్వహణ వ్యయాన్ని సైతం 15వ ఆర్థిక సంఘం కింద సిఫారసు చేయాలి. ఈ పథకం కింద వినియోగదారులపై యూజర్ చార్జీలు విధించాలని అనుకుంటున్నాం. కానీ కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో కమిషన్ సహకారం అందించాలి. -
రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, వృద్ధిపథంలో ముందుకు సాగనుందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె. సింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో దార్శనికతగల రాజకీయ నాయకత్వం, రాజకీయ స్థిరత్వం నెలకొనడం గొప్ప ప్రయోజనకరమన్నారు. తెలంగాణ ప్రజలు ఆశాజనక దృక్పథంతో ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూడవచ్చన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిరాశాజనక ఆర్థిక విధానాలను అనుసరించకపోవడం వల్లే దేశంలో మరెక్కడా లేనివిధంగా ఇంటింటికీ, గ్రామగ్రామానికీ మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటి సరఫరా కల సాకారమైందని కొనియాడారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారిందని, ఒడిశాలో కాలియా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుండటం దీనికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో సాహసోపేతంగా, తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. అయితే ద్రవ్యలోటు, రుణాలు పెరిగిపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమన్నారు. ద్రవ్యలోటు, రుణాల నియంత్రణకు మధ్యంతర ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన ముగింపు సందర్భంగా మంగళవారం తన బృందంతో కలసి ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పర్యటన విశేషాలు, తమ పరిశీలనకు వచ్చిన అంశాలను వెల్లడించారు. దార్శనికతకు ప్రతిరూపం... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచే వృద్ధిపథంలో ముందుకు సాగుతోందని ఎన్.కె.సింగ్ తెలిపారు. దార్శనికతగల రాజకీయ నాయకత్వంతోపాటు మంచి ఆర్థిక వనరులు ఉండటమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రం గణనీయంగా ఆర్థికావృద్ధి సాధిస్తోందని, మూలధన వ్యయం సైతం అదే రీతిలో పెరుగుతూ పోతోందన్నారు. రాష్ట్రం మిగులు బడ్జెట్ కలిగి ఉందని, అయితే దీనిపై కాగ్‌తోపాటు ఆర్థిక విశ్లేషకుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 14 శాతానికి మించి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వృద్ధిరేటు సాధించిన కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సింగ్ కితాబిచ్చారు. జీఎస్టీని అమల్లోకి తెచ్చిన అనంతరం కొన్ని నెలలు మినహా రాష్ట్రానికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం రాలేదన్నారు. రాష్ట్రం 20 శాతానికి మించి జీఎస్టీ వృద్ధి రేటు సాధిస్తోందన్నారు. రాష్ట్రం సులభతర వాణిజ్య(ఈఓడీబీ) ర్యాంకుల్లో రెండో స్థానంలో నిలవడం చిన్న విషయం కాదన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ విధానం బాగుందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సాగునీటి వసతుల కల్పన, సంక్షేమ పథకాలు వినూత్నంగా ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ పథకం గొప్ప దార్శనికతకు నిదర్శనమన్నారు. ఇలాంటి ఘనతను మరే రాష్ట్రం సాధించలేదన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎత్తిపోతల పథకాలు, రక్షిత నీటి సరఫరా వంటి సంక్షేమ పథకాలతో గరిష్ట సంక్షేమం అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆర్థికాభివృద్ధి తోడైతే రాష్ట్ర ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు రానుందని ప్రశంసించారు. రాష్ట్రానికి రాబడి సైతం రెట్టింపు కానుందన్నారు. నీటిపారుదల సదుపాయంతో పంట దిగుబడులు పెరగనున్నాయని, జనాభాలో అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిన వారికి జీవనోపాధి లభించనుందని వ్యవసాయ రంగ నిపుణుడైన తమ సభ్యుడు రమేశ్‌చంద్ అభిప్రాయపడ్డారని ఎన్.కె. సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని, ప్రభుత్వం పారదర్శకంగా, దాపరికం లేకుండా వ్యవహరించిందన్నారు. నిధుల కేటాయింపుపై సిఫారసులు.. ‘ద్రవ్యలోటు, అప్పులు కొంత వరకు ఒత్తిడి కలిగిస్తున్నాయి. అయినప్పటికీ సంక్షేమ పథకాలు గొప్ప ప్రయోజనం కలిగించనున్నాయి. విద్యాభివృద్ధి, వ్యవసాయ దిగుబడి, ఆరోగ్యం మెరుగు కానుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని, రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనం కలిగించనున్నాయని సీఎం తెలిపారు’ అని ఎన్.కె.సింగ్ వెల్లడించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై సిఫారసులు చేస్తామన్నారు. రాజకీయ దార్శనికత, ఆర్థిక వనరుల లభ్యత వల్లే రాష్ట్రం పురోగమిస్తోందని ఆర్థిక సంఘం సభ్యుడు రమేశ్ చంద్ పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటుతో పోలిస్తే 60 శాతం అధికంగా ఉందన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్మించడాన్ని కమిషన్ కార్యదర్శి ఆరవింద్ మెహతా ప్రశంసించారు. నాలుగు సవాళ్లు! రాష్ట్రం నాలుగు ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటోందని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ పేర్కొన్నారు. అందులో అసమతౌల్య అభివృద్ధి ప్రధానమైదన్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల నుంచే 52 శాతం జీఎస్టీ అందుతోందన్నారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని రాష్ట్ర సగటుకు ఎగువన, మరికొన్ని దిగువన ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమతౌల్య అభివృద్ధిని సాధించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. పెరిగిపోతున్న ద్రవ్యలోటు, రుణాలు కొంతవరకు సమస్యాత్మకంగా మారాయని, వాటి నియంత్రణపై మధ్యంతర ప్రణాళిక రూపొందించి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ ప్రణాళిక అమలు 15వ ఆర్థిక సంఘం కాలవ్యవధికి వీలుగా ఉండాలన్నారు. కేంద్రం 2018 బడ్జెట్లో తీసుకొచ్చిన ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ లక్ష్యాలకు లోబడి ద్రవ్యలోటు, రుణాలు ఉండేలా రాష్ట్రం పరిమితులు విధించుకోవాలని, స్థూల ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ రెండు అంశాలతో వృద్ధికి ఆటంకం కలగకుండా పటిష్ట, ఆచరణీయమైన ప్రణాళికను చూడాలనుకుంటున్నామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఇలాంటి ప్రణాళికలు కోరామన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల రుణాల పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ పథకం లక్ష్యాలను అమలు చేయడంలో రాష్ట్రం వెనకబడిందన్నారు. -
రాష్ట్రాభివృద్ధిలో ఐటీ పాత్ర భేష్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ(ఐటీ) రంగం కీలకపాత్ర పోషిస్తోందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. దేశ ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో 10 శాతానికిపైగా వాటా రాష్ట్రానిదేనని కొనియాడింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె సింగ్, సభ్యులు అశోక్ లహరి, అనూప్‌సింగ్, రమేశ్చంద్లతో కూడిన బృందం సోమవారం తొలిరోజు ఇక్కడ పారిశ్రామిక, కార్మిక సంఘాలు, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ప్రతినిధులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ ఆధారితం(జీఎస్వీఏ–ప్రస్తుత ధరలు)లో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగ పరిశ్రమల(తృతీయ రంగాని)దే సింహభాగం వాటా అని పేర్కొన్నారు. తృతీయ రంగ జీఎస్వీఏ(ప్రస్తుత ధరలు) విషయంలో కర్ణాటక(66.27) తర్వాత తెలంగాణ (63.80) రెండోస్థానంలో ఉందని తెలిపారు. ద్వితీయ రంగానికి సంబంధించిన తెలంగాణæ జీఎస్వీఏ(ప్రస్తుత ధరలు) అంకెలు దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యల్పమని అభిప్రాయపడ్డారు. తయారీ, మైనింగ్, విద్యుత్ తదితర రంగాల పరిశ్రమలు ద్వితీయ రంగం పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర తయారీ రంగంలో ఔషధ, సిమెంట్, గ్రానైట్, విద్యుత్ ఉపకరణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఐటీ, ఐటీ ఆధారిత రంగ పరిశ్రమలపైనే రాష్ట్రం పూర్తిగా ఆధారపడకుండా, తయారీ రంగ పరిశ్రమల వృద్ధికి సైతం కృషి చేయాలని సూచించారు. ఒకే రంగంపై పూర్తిగా ఆధారపడితే వృద్ధికి ముప్పు ఏర్పడే అవకాశాలుండడంతో ఇతర రంగాల్లో సైతం పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. తలసరి ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు కంటే ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలు ఎక్కువ ఉండడంతో ఈ నాలుగు జిల్లాలు వృద్ధి సాధించాయని, మిగిలిన జిల్లాలు వెనకబడ్డాయని తెలిపారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీకి టీఎస్–ఐపాస్ చట్టం, మూతపడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ–హబ్ ఇంక్యూబేటర్ ఏర్పాటు, కాకతీయ టెక్స్టైల్స్ పార్కు నిర్మాణం తదితర పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలను ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుంది. యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ(టాస్క్) ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించింది. స్థానిక సంస్థలకు విస్తృతంగా నిధులివ్వాలి స్థానిక సంస్థలకు విస్తృతంగా నిధులు ఇవ్వాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో మునిసిపల్ కార్పొరేషన్లు తమ మొత్తం ఆదాయంలో 65 శాతాన్ని సొంతంగా ఆర్జించాయని, మునిసిపాలిటీల సొంత ఆదాయం 52 నుంచి 65 శాతానికి, నగర పంచాయతీల సొంత ఆదాయం 52 నుంచి 68 శాతానికి పెరిగిందని ప్రభుత్వం నివేదించింది. అయితే, జిల్లా, మండల పరిషత్‌లకు సొంత ఆదాయం అత్యల్పమని పేర్కొంది. జడ్పీలు, మండల పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లే ప్రధాన వనరులని తెలిపింది. గ్రామపంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులే ఇప్పటివరకు ప్రధాన ఆదాయవనరులని తెలిపింది. గత రెండేళ్లలో 55 శాతం ఆదాయాన్ని ఇక్కడి నుంచే పొందాయని పేర్కొంది. వినోదపన్నును జీఎస్టీ పరిధిలోకి తేవడంతో మునిసిపాలిటీల ఆదాయానికి గండి పడిందని మునిసిపల్ ప్రజాప్రతినిధులు ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత నీటిసరఫరా, ఇతర కీలక ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. 15వ ఆర్థిక సంఘం బృందానికి ముఖ్యమంత్రి విందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం బృందానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నగరంలోని ఓ హోటల్లో సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఇక పర్యటనలో భాగంగా 15వ ఆర్థిక సంఘం బృందం మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశం కానుంది. జీఎస్టీ పరిహారం అందడం లేదు .. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 37.4 శాతం డీలర్లు కొత్తగా పన్నుల పరిధిలోకి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో మినహాయిస్తే ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన పరిహారం అందలేదని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఏపీలో జీఎస్టీ ఆదాయం 14.7 శాతం వృద్ధి చెందితే తెలంగాణలో 20 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. ఆర్థిక సంఘానికి వినతులు ప్రాధాన్యతల వారీగా నిధులు కేటాయించండి : కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: దేశ, రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలకు ప్రాధాన్యతలవారీగా నిధులు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. సోమ వారం ఇక్కడ 15వ ఆర్థిక సంఘం రాజకీయ పార్టీలతో నిర్వహించిన భేటీకి కాంగ్రెస్ తరపున సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ మేధా వుల విభాగం చైర్మన్ కె.శ్యాంమోహన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే అనిల్ హాజరయ్యారు. కాం గ్రెస్ నేతలు మాట్లాడుతూ నిధులు పక్కదోవ పట్టకుండా చూడాలని, ఏ పథకానికి కేటాయించిన నిధులు దానికే ఖర్చయ్యేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ కేటాయింపులకే నిధులన్నీ ఖర్చు చేయాల్సి రావడంతో ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచి పోతున్నాయని ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువచ్చారు. మానవాభివృద్ధి సూచీ పెరుగుదల కోసం విద్య, వైద్యం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతివ్వాలని కోరారు. సమావేశానికి టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్రాభివృద్ధికి సహాయం అందించండి : బీజేపీ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇతోధిక సహాయం అందించా లని 15వ ఆర్థిక సం ఘం చైర్మన్ ఎన్కే సిం గ్‌కు భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, అధికార ప్రతి నిధి అనుగుల రాకేశ్రెడ్డిలతో కూడిన బృందం 20 అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది. హైదరాబాద్ లాంటి నగరం అభివృద్ధిపై 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయించాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణకు ఎక్కువ లాభం చేకూరుతుందని, దాని ప్రకారమే తెలంగాణకు నిధులను కేటాయించాలని కోరారు. అప్పులు తీసుకొని అభివృద్ధి కోసం వెచ్చించకుండా పేరుప్రతిష్టలు వచ్చే వాటికి ఖర్చు చేయకుండా చూడాలని కోరారు. ప్రజాకర్షక పథకాలపై దృష్టి సారించాలి : సీపీఐ ఎన్నికల్లో లబ్ధి పొందా లనే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ లు ప్రజాకర్షక విధానా లు చేపడుతున్న అంశం పై 15వ ఆర్థికసంఘం సునిశిత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సీపీఐ సూచించింది. ఇలా చేపడుతున్న ప్రజాకర్షక పథకాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నందున సమీక్షించా లని కోరింది. ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, ఇతర సభ్యులతో భేటీ సందర్భంగా ఆ పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు నరసింహా వినతిపత్రం సమర్పించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు అందజేయడంతోపాటు ఏదైనా ఓ భారీ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని కోరా రు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి చేయూతనిచ్చేలా చర్య లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు ఇవ్వండి : పంచాయతీరాజ్ సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్‌లకు కూడా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కేటాయించేలా సిఫారసు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి బాదే పల్లి సిద్ధార్థ, కార్యదర్శి మధుసూదన్‌గుప్తా, అధికార ప్రతినిధి ఎం.పురుషోత్తంరెడ్డి వినతిపత్రం సమర్పించారు. 13వ ఆర్థిక సంఘం వరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు సమానంగా నిధులు కేటాయిస్తూ రాగా 14వ ఆర్థిక సంఘం కనీస నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు. -
రూ.92 వేల కోట్ల గ్రాంట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణ, విద్య, వైద్యం తదితర 13 అంశాలకు సంబంధించి రూ.92,809 కోట్లు అవసరమని, వీటిని గ్రాంట్స్–ఇన్–ఎయిడ్‌గా ఇచ్చేందుకు సిఫార్సు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. వచ్చేవారంలో తెలంగాణకు సందర్శించి ఆర్థిక పరిస్థితి అంచనా వేయనున్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్.కె.సింగ్ నేతృత్వంలోని బృందానికి సమర్పించేందుకుగాను నివేదిక తయారు చేసింది. 15వ ఆర్థిక సంఘం అక్టోబర్‌లో తన సిఫార్సుల నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. ఐదేళ్లపాటు అమలులో ఉంటాయి. ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిర్వహణకు రూ.40,169 కోట్లు, మిషన్ భగీర థకు రూ.12,722 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లు.. ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులివ్వా లని కోరనుంది. నిర్మాణంలో ఉన్న 23 భారీ, 13 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని నివేదికలో పేర్కొంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉందని వివరించనుంది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేస్తున్నామని, ప్రాజెక్టులు పూర్తయితే కోటీ 24 లక్షల ఎకరాలకు నీళ్లందించే సామర్థ్యం ఏర్పడనుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా వచ్చే పరిస్థితి లేనందున ఎత్తిపోతలపై ఆధారపడాల్సి వస్తోందని, వీటి నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందని వివరించనుంది. భగీరథకు రూ.12,722 కోట్లు కావాలి మిషన్ భగీరథకు రూ.12,722 కోట్లు కావాలని ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.44,979 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. 23,968 ఆవాసాలకు తాగునీరందించనున్న ఈ వాటర్‌గ్రిడ్ నిర్వహణకు గ్రామీణ ప్రాంతాల్లో 2020 నుంచి 2025 మధ్యకాలానికి రూ.10,141 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2,580 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. ప్రాజెక్టు నిర్వహణకు ఐదేళ్లకుగాను రూ.12,722 కోట్లు అవసరమని పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్య రంగాలకు ఇలా.. ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాలు, కేన్సర్ కేర్ సెంటర్ల నిర్మాణం, వైద్య వర్సిటీల బలోపేతం.. ఇలా మొత్తంగా రూ.1,085 కోట్లు కావా లని కోరనుంది. 24 గంటల విద్యుత్తుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయని, పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని నివేదికలో పే ర్కొంది. విద్యుత్తు అవసరాలకు రూ.4,442 కోట్లు అవసరమని ప్రతిపాదించనుంది. పాఠశాల విద్యలో భాగం గా బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌కు రూ.549 కో ట్లు, ఆధార్ బయోమెట్రిక్ హాజరు యంత్రాలకు రూ. 201 కోట్లు, ఐసీటీ, డిజిటల్ విద్యకు రూ.1,741 కోట్లు అవసరమని ప్రతిపాదించ నుంది. పాఠశాల విద్యకు రూ.7,584 కోట్ల గ్రాంట్లు మంజూరు చేయాలని కోరనుంది. స్థానిక సంస్థల విభా గం ద్వారా రూ.7,866 కోట్ల ప్రతిపాదనలు సమర్పించనుంది. జిల్లాల వర్గీకరణ, కొత్త పంచాయతీల ఏర్పాటు, పంచాయతీ కార్యదర్శుల నియామ కం తదితర అవసరాలకయ్యే వ్యయాన్ని వివరించనుంది. హోంశాఖకు రూ.7,610 కోట్ల నిధులు కోరనుంది. కానిస్టేబుళ్ల నియామకం, ఇతర మౌలిక వసతుల కల్పన, కోర్టు భవనాల నిర్మాణం తదితర అవసరాలకూ ప్రతిపాదనలు సమర్పించనుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణం తదితర అంశాలను నివేదికలో పొందుపరిచింది. -
రైతుబంధు సూపర్!
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గమనించి పరిస్థితులకు అనుగుణంగానే సలహాలు, సూచనలు ఇస్తామని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. మూడేళ్లుగా తెలంగాణ వృద్ధిరేటు వేగంగా ముందుకెళ్తోందన్న ఆయన.. రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ వంటివి రైతాంగ సమస్యల పరిష్కారానికి కీలకమైన ముందడుగని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఆర్థిక సంఘం చెప్పేదేమీ ఉండదని.. జాతీయాభివృద్ధి మండలిదే తుది నిర్ణయమని ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో ఉత్తర, దక్షిణ భారతాలంటూ వేర్వేరుగా చూడటంలో అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారంలో తెలంగాణ, ఏపీల్లో 15వ ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ఎన్కే సింగ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ విశేషాలు సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ ఆర్థికవేత్తగా, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏడాదిగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ హోదాలో ఉన్నారు. ఈ కాలంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి? ఎన్కే సింగ్: ఆర్థిక సంఘం చైర్మన్లు ఎవరైనా చెప్పేదొక్కటే. కఠినమైన సవాళ్లున్నాయి. అయితే చాలా పరిమితుల్లో పనిచేయాల్సిన కారణంగా.. ఈ సమస్యలను వీలైనంత త్వరగా నైపుణ్యంతో పరిష్కరించడం కష్టమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని మూడు అంశాలు మార్చేశాయి. మొదటిది.. ప్రణాళికా సంఘం పనితీరులో మార్పుతీసుకురావడం. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను పక్కాగా ప్లాన్ చేయడం. ఈ ఏడాది రెవెన్యూ, మూలధనం లోటుంది. కానీ దీన్ని అధికారులు అంగీకరించరు. రెండోది.. జీఎస్టీపై ఆర్థిక సంఘానికి పూర్తి పట్టుంటుంది. ఇది ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం. సంప్రదాయంగా వస్తున్న ఆర్థిక సమాఖ్య విధానంలో ఉన్న చాలా సమస్యల్లో జీఎస్టీ ద్వారా సానుకూల మార్పులొచ్చాయి. కామన్ మార్కెట్లో భారత్‌కు భారీ ప్రయోజనాలు చేకూరేందుకు అవకాశాలు కల్పించింది. మూడోది.. రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను తిరిగి పొందే సామర్థ్యాన్ని పెంపొందించడం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ సమస్యలపై మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇవి ఆర్థిక సంఘం ముందున్న ప్రధానమైన సవాళ్లు. ప్రశ్న: జనాభా నియంత్రణ విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై మీరేమంటారు? జవాబు: నివేదికలో ఏయే అంశాలుండాలనే దానిపై ఆర్థిక సంఘం ప్రమేయం ఉండదు. ఇది పూర్తిగా భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఒకసారి నిబంధనలు రూపొందించాక వీటి ఆధారంగా పనిచేయడమే ఆర్థికసంఘం పని. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నది వాస్తవం. ఈ విషయంలో మేమేమీ చేయలేం. వీటితోపాటుగా పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయి. సమానత్వం, సామర్థ్యం మధ్య సమన్వయం చేయడం అంత సులువేం కాదు. భౌగోళిక అంశాల ఆధారంగా జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను విస్మరించడం ఆర్థిక సంఘం ఉద్దేశం కాదు. ఈ విషయంలో మేం చాలా విశాల ధృక్పథంతో ఉన్నాం. అసలు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడటం.. వాస్తవాలను తప్పుదారి పట్టించడమే. ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, పంజాబ్, ఒడిశాలు ఈ విషయంలో ఎంతో ప్రగతిని కనబరిచాయి. అందుకే ఆర్థిక సంఘం.. రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యం, ప్రజలకోసం ఏవిధంగా నిధుల వినియోగం చేస్తున్నాయనేదాన్నే విశ్వసిస్తుంది. 14, 15వ ఆర్థిక సంఘాలు ఇంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ దిశగా ఆర్థిక సంఘం ఏమైనా పునరాలోచన చేస్తుందా? గతేడాది మేలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినపుడు ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేక హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదనే అంశాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పాను. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా జాతీయాభివృద్ధి మండలి పరిధిలోకి వస్తుంది. ఇది పూర్తి రాజకీయ పరమైన అంశం. ఈ విషయంలో ఆర్థిక సంఘం ఇచ్చే సూచనలేమీ ఉండవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. కర్ణాటకతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నష్టం చేస్తాయంటూ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (ఆర్థికాంశాలు) చైర్మన్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు? ఈ విషయం నాకు తెలియదు. ఆర్థికపరమైన అంశాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ వ్యాఖ్యలు చేసుంటే.. దీనిపై మేం స్పందించడం సరికాదు. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం.. అప్పుల్లో కూరుకుపోవడంపై మీరేమంటారు? గత మూడేళ్లలో తెలంగాణ గణనీయమైన ఆర్థిక వృద్ధిరేటు సాధించింది. గతంలో కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించింది. సాగునీటి పారుదల అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. చెరువులను పునరుద్ధరిస్తోంది. సాగుకోసం భూగర్భ జలాలను పెంచేలా ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సానుకూల అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇందుకు ప్రోత్సహించాలి. దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పులు, ఆర్థిక లోటు, అనవసర ఖర్చులు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు నివేదిక అందింది. హైదరాబాద్ పర్యటనలో ఆ రాష్ట్ర అకౌంట్ జనరల్‌తో మాట్లాడతాం. పూర్తి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి తదితర అంశాలపై సూచనలు ఇస్తాం. ఇటీవలి మీ పంజాబ్ పర్యటనలో అక్కడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి సూచనలేమైనా ఇస్తారా? వీటిపై ముందుస్తు ఊహాగానాలు చేయలేం. పంజాబ్ పరిస్థితులు అక్కడి సమస్యలు వేరు. అక్కడి ప్రభుత్వం చాలా అప్పుల్లో కూరుకుపోయినందుకు సూచనలిచ్చాం. వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కోసం కేంద్ర నిధులివ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది? రుణాలను కూడా మాఫీ చేయాలని అడుగుతోంది? రాజ్యాంగ పరిధిలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయడమే మా లక్ష్యం. ఒక రాష్ట్రానికి ఎక్కువ మేలు చేద్దామని ప్రయత్నిస్తే.. మిగిలిన రాష్ట్రాలకూ అది అమలవుతుంది. ఆర్టికల్ 275 కింద ఒక్కో రాష్ట్రం ద్రవ్యలోటును కూడా మేం పరిగణించాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా పోల్చి చూడాలి. తెలంగాణ పూర్తి ఆర్థిక స్థితిని చూశాకే ఏమైనా సూచనలు చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తాం. వృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం కింద ఏమైనా అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలుంటాయా? మేం విశాల ధృక్పథంతో ఆలోచిస్తాం. ఇందులో భాగంగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం 3% ఆర్థిక లక్ష్యంలో 0.5% వెసులుబాటు కల్పించారు. మేం ఏం చేయాలనేది అన్ని విషయాలు క్రోడీకరించి నిర్ణయిస్తాం. ఆర్థిక సంఘం దృష్టిలో.. తమకు నిధులు కావాలంటున్న మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిస్థితేంటి? ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ దిశగా మాకు ప్రతిపాదనలు పంపాయి. మేం ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో పర్యటించాం. దాదాపు ప్రతిచోటా ఈ డిమాండ్ కనిపించింది. 14వ ఆర్థిక సంఘం కేవలం పంచాయతీల నిధుల విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవడంపై మేం అధ్యయనం చేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడు అంచెల వ్యవస్థకు నిధులిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. రాజకీయ ప్రజాకర్షణ కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రుణమాఫీకి జై కొట్టడంపై మీరేమంటారు? ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం. ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. ఆర్టికల్ 293 కింద ఆర్థిక స్థోమత అంశాన్ని మాత్రం మేం పరిశీలిస్తాం. అయితే.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. 14వ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా కేంద్రం ఎందుకు వారికి సహకరించడం లేదు? రెవెన్యూ లోటు నిధులు (ఆర్డీజీ) ఏ ఒక్కరి సొంత నిర్ణయం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నిధుల సంక్రమణ విషయంలో ఆర్థిక సంఘం స్వతంత్రంగా సమీక్ష చేస్తుంది. ఒక్కో రాష్ట్రం పరిస్థితిని గమనిస్తాం. ప్రతి రాష్ట్రం ఆర్డీజీ కావాలంటుంది. కానీ అందరికీ ఇవ్వలేం. ఈ అంశంలో కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల సరఫరా విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాకు స్పష్టత వచ్చింది. కేంద్రం ఏం ఆలోచిస్తుందనేది ఇంకా తెలియాలి. దీనికోసమే వేచి చూస్తున్నాం. ఆ తర్వాతే ఆర్డీజీకి అర్హులా? కాదా? అనే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రజాకర్షక పథకమైన రైతుబంధుపై విమర్శల గురించి మీరేమంటారు? రైతుసమస్యలకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు తీసుకున్న చర్యలో రైతుబంధు కీలకమైంది. ఒడిశా ప్రభుత్వం కూడా కాలియా పేరుతో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం కూడా ప్రతి రైతుకు రూ.6వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చింది. చాలారాష్ట్రాలు రైతు సమస్యలను పరిష్కరించేందుకు తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్రయత్నిస్తున్నాయి. స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ పర్యటనలో ఆ ప్రభుత్వంతో చర్చిస్తాం. ఎఫ్ఆర్బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) విషయంలోనూ ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంఘం రాష్ట్రాల సమస్యలను పట్టించుకోదంటూ కేసీఆర్ చేస్తున్న విమర్శలపై? తెలంగాణకు వీలైనంత సహాయం చేయాలనేదే నా ఉద్దేశం. ఆ రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెట్టే విషయంలో మేం చేయాల్సినవన్నీ చేస్తాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణకు ఎక్కువ అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయి. -
పునర్విభజన చట్టంపై ఎన్ కే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘అరుణ్ జైట్లీ అప్పుడు చప్పట్లు కూడా కొట్టారు’..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్ కే సింగ్.. పునర్విభజన చట్టంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేక వ్యవస్ధ ఉండేదన్నారు. కానీ ఏపీ పునర్విభజన చట్టం అమలుకు పర్యవేక్షణ వ్యవస్ధ అనేదే లేదని తెలిపారు. గతంలో విభజన చట్టం అమలుకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ బాధ్యులుగా ఉండేవారన్నారు. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంటులోకి వచ్చినప్పుడు తాను రాజ్యసభలో ఉన్నానని చెప్పారు. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ చప్పట్లు కూడా కొట్టారని అన్నారు. ప్రత్యేక హోదా అమలు విషయంపై ఎన్డీసీదే బాధ్యతని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్దిక సంఘం పరిధిలోకి రాదని తేల్చిచెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ విషయమై రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేందుకు 14వ ఆర్ధిక సంఘాన్ని సాకుగా చూపిందన్నారు. -
ఎఫ్ఆర్బీఎం చట్టంపై వచ్చే నెలలో నివేదిక!
ఆర్బీఐ సలహాల అనంతరం కేంద్రానికి అందజేత అయితే బడ్జెట్ తరువాతే నివేదిక అంశాలు బహిర్గతం న్యూఢిల్లీ: ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) చట్టం పనితరు సమీక్షకు నియమించిన కమిటీ వచ్చే నెల 13వ తేదీన నివేదికను సమర్పించనుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే తన నివేదికను కేంద్రానికి సమర్పించే ముందు కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయాలను కూడా తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. మాజీ రెవెన్యూ శాఖ కార్యదర్శి ఎన్కే సింగ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఎఫ్ఆర్బీఎం యాక్ట్ సమీక్షా కమిటీని కేంద్రం మే నెలలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 12 సంవత్సరాల నుంచీ ఎఫ్ఆర్బీఎం యాక్ట్ అమలు జరుగుతోంది. ముఖ్యాంశం ద్రవ్యలోటే..! ద్రవ్యలోటును వార్షికంగా ఒక స్థిరమైన లక్ష్యంగా నిర్దారించుకోకుండా, ఒక శ్రేణిని నిర్ణయించుకోవడంపై సాధ్యాసాధ్యాలు సమీక్షా అంశాల్లో ఒకటి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం – చేసే వ్యయాల మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, ఈ లోపే ఎన్కే సింగ్ కమిటీ సిఫారసులు కేంద్రానికి చేరనుండడం గమనార్హం. నిజానికి ఈ కమిటీ తన నివేదికను ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికే సమర్పించాల్సి ఉంది. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసులను, వ్యయ నిర్వహణ కమిషన్ పనితీరును సమీక్షించాలన్న అదనపు బాధ్యతల రీత్యా కమిటీ కాలపరిమితిని కేంద్రం పొడిగించింది. కాగా వచ్చే నెల మొదట్లోనే నివేదిక సమర్పించినా, బడ్జెట్ వరకూ ఈ నివేదిక అంశాలు వెల్లడికాబోవని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఐదుగురు సభ్యుల్లో... ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ఐదుగురు సభ్యుల కమిటీలో మాజీ ఆర్థిక కార్యదర్శి సుమిత్ బోస్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, అప్పటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ (ప్రస్తుత గవర్నర్) ఉర్జిత్ పటేల్, ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్ రతన్ రాయ్‌లు ఉన్నారు. 2015–16లో ద్రవ్యలోటు 3.9 శాతం (జీడీపీతో పోల్చిచూస్తే). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ లక్ష్యాన్ని 3.5 శాతంగా ఎఫ్ఆర్బీఎం చట్టం నిర్దేశించింది. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్న దృష్ట్యా 2016–17 బడ్జెట్ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందన్న అంచనాలు ఆర్థికవేత్తల నుంచి వెలువడ్డాయి. అయితే అరుణ్‌జైట్లీ 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే కట్టుబడి ఉన్నట్లు తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో స్పష్టం చేశారు. -
భారతీయునికి జపాన్ రెండో అత్యున్నత పురస్కారం
టోక్యో: భారతదేశానికి చెందిన ఎన్కే సింగ్ జపాన్ రెండో అత్యున్నత పురస్కారం ''ద ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్'' అవార్డు అందుకున్నారు. ఇండియా, జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు పెంపొందించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించింది. టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి షింజో అబే చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సింగ్ ఇంతకు ముందు ఆర్థిక వేత్తగా, రాజ్యసభ సభ్యునిగా, ఎక్స్ పెండిచర్, రెవెన్యూ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా పని చేశారు. టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలోనూ సేవలందించారు. -
'బిల్లులో ఫైనాన్షియల్ మెమోరాండం లేదు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లులో ఆర్థికపరమైన ప్యాకేజీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదని జేడీయూ ఎంపీ ఎన్.కె.సింగ్ స్పష్టం చేశారు. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ బిల్లులో ఫైనాన్షియల్ మెమోరాండం చేర్చకపోవటం దురదృష్టకరమన్నారు. ఈ బిల్లులో లక్ష్యాలేమిటో, ఉద్దేశాలేమిటో చెప్పకుండా, రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజనకు పూనుకోవడం ఎంత మాత్రం తగదని ప్రభుత్వానికి సూచించారు. బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని ఆయన తెలిపారు. బిల్లును అమలుచేసే సరైన యంత్రాంగాలను...బిల్లులో పొందుపరచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రఘురాజన్ కమిటీ నివేదికను పక్కకు పెట్టిందని విమర్శించారు. బీహార్ లాంటి రాష్ట్రాలకు అర్హత ఉన్నా ఎలాంటి ప్యాకేజీ ఇవ్వలేదని సింగ్ తెలిపారు.