టోక్యో: భారతదేశానికి చెందిన ఎన్‌కే సింగ్ జపాన్ రెండో అత్యున్నత పురస్కారం ''ద ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్'' అవార్డు అందుకున్నారు. ఇండియా, జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు పెంపొందించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించింది.
టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి షింజో అబే చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సింగ్ ఇంతకు ముందు ఆర్థిక వేత్తగా, రాజ్యసభ సభ్యునిగా, ఎక్స్ పెండిచర్, రెవెన్యూ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా పని చేశారు. టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలోనూ సేవలందించారు.