Second Highest
-
ఫ్లయిట్ అటెండెంట్‌కు ప్రెసిడెంట్ హోదా
టోక్యో: జపాన్‌కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘జపాన్ ఎయిర్ లైన్స్’అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో రెండో అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్‌గా మాజీ మహిళా ఫ్లయిట్ అటెండెంట్‌ను నియమించింది. ఈమె ఏప్రిల్ ఒకటిన ప్రస్తుత ప్రెసిడెంట్ యూజి అకసావ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత చైర్మన్ యోషిహరు స్థానంలో అకసావ చేరుతారు. 1985లో ఫ్లయిట్ అటెండెంట్‌గా సంస్థలో కెరీర్‌ను ప్రారంభించిన మిట్సుకో టొట్టొరీ 2015లో క్యాబిన్ క్రూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తనకు లభించిన ఉద్యోగోన్నతి ఇతర మహిళలు తమ కెరీర్లో పైకెదిగేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మిట్సుకో చెప్పారు. టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో ఇటీవల జపాన్ ఎయిర్ లైన్స్ విమానం చిన్నపాటి కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొన్న ఘటన నేపథ్యంలో మిట్సుకోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాణికుల భద్రత, సేవల విభాగంలోనే తన కెరీర్లో అత్యధిక భాగం గడిపానని చెప్పారు. ఇకపై కూడా భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్–100 విమానయాన సంస్థల్లో ఉన్నత స్థాయి హోదాల్లో కేవలం 12 మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నట్లు ఫ్లయిట్ గ్లోబల్ వెబ్సైట్ 2022లో చేపట్టిన సర్వేలో తేలింది. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ.18 వేల కోట్లు
విశాఖపట్టణం: విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21లో రూ.18 వేల కోట్లు టర్నోవర్ సాధించింది. స్టీల్‌ప్లాంట్ ప్రారంభించిన నాటి నుంచి ఇదే రెండో అత్యధిక టర్నోవర్ కావడం విశేషం. గురువారం స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశంలో సీఎండీ పి.కె.రథ్ గత ఏడాది ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ వ్యవధిలో 4.45 మిలియన్ టన్నులు అమ్మకాల ద్వారా 13 శాతం వృద్ధి సాధించామన్నారు. గత నాలుగు నెలల్లో రూ. 740 కోట్లు నికర లాభం సాధించామన్నారు. మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా 7.11 లక్షల టన్నులు అమ్మకాలతో రూ.3,300 కోట్లు టర్నోవర్ జరిగిందన్నారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 2,329 కోట్లు అమ్మకాలు చేయగా ఈ ఏడాది 42 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు. 2020 డిసెంబర్ నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కంపెనీ ప్రగతికి ముఖ్య కారణమన్నారు. అదే విధంగా ఈ ఏడాది 1.3 మిలియన్ టన్నులు విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా గత ఏడాది కంటే 261 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్–19 సందర్భంగా పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చిన రూ.5 కోట్లతో పాటు మొత్తం రూ.10 కోట్లు వ్యయం చేశామన్నారు. రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ఈ వారంలో ప్రారంభం కానుందన్నారు. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాల కోసం విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మొహంతి, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)కె.కె.ఘోష్, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ) కె.వి.ఎన్. రెడ్డి పాల్గొన్నారు. -
భారతీయునికి జపాన్ రెండో అత్యున్నత పురస్కారం
టోక్యో: భారతదేశానికి చెందిన ఎన్కే సింగ్ జపాన్ రెండో అత్యున్నత పురస్కారం ''ద ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్'' అవార్డు అందుకున్నారు. ఇండియా, జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు పెంపొందించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించింది. టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రి షింజో అబే చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సింగ్ ఇంతకు ముందు ఆర్థిక వేత్తగా, రాజ్యసభ సభ్యునిగా, ఎక్స్ పెండిచర్, రెవెన్యూ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా పని చేశారు. టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలోనూ సేవలందించారు.