టోక్యో: జపాన్‌కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘జపాన్ ఎయిర్ లైన్స్’అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో రెండో అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్‌గా మాజీ మహిళా ఫ్లయిట్ అటెండెంట్‌ను నియమించింది. ఈమె ఏప్రిల్ ఒకటిన ప్రస్తుత ప్రెసిడెంట్ యూజి అకసావ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత చైర్మన్ యోషిహరు స్థానంలో అకసావ చేరుతారు.
1985లో ఫ్లయిట్ అటెండెంట్‌గా సంస్థలో కెరీర్‌ను ప్రారంభించిన మిట్సుకో టొట్టొరీ 2015లో క్యాబిన్ క్రూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తనకు లభించిన ఉద్యోగోన్నతి ఇతర మహిళలు తమ కెరీర్‌లో పైకెదిగేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మిట్సుకో చెప్పారు.
టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో ఇటీవల జపాన్ ఎయిర్ లైన్స్ విమానం చిన్నపాటి కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొన్న ఘటన నేపథ్యంలో మిట్సుకోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాణికుల భద్రత, సేవల విభాగంలోనే తన కెరీర్‌లో అత్యధిక భాగం గడిపానని చెప్పారు. ఇకపై కూడా భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్–100 విమానయాన సంస్థల్లో ఉన్నత స్థాయి హోదాల్లో కేవలం 12 మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నట్లు ఫ్లయిట్ గ్లోబల్ వెబ్‌సైట్ 2022లో చేపట్టిన సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment