Attendant
-
బద్లాపూర్ భగభగ!
థానె/ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. స్థానిక కిండర్‌గార్టెన్ స్కూల్లో రెండేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆ మార్గంలో 8 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.బద్లాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలపాటు జాప్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేధింపుల ఘటన చోటుచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ నెల 17న అటెండర్‌ను అరెస్ట్ చేశారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ సోమవారం రాత్రి పాఠశాల యాజమాన్యం çస్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది.వేధింపుల ఘటనపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించలేదంటూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్చార్జిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఇన్స్పెక్టర్తోపాటు అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసుపై సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ ఆరోపణలు అవాస్తవం కేసు నమోదు చేసేందుకు పోలీసులు 12 గంటలపాటు ఆలస్యం చేశారంటూ వచి్చన ఆరోపణలను డీసీపీ సుధాకర్ పఠారే చెప్పారు. కేసు నమోదు ప్రక్రియ రాత్రి 11.30 గంటలకు మొదలుకాగా, నిందితుడిని మూడున్నర గంటల్లోపే 3.30 గంటలకు అరెస్ట్ చేశామన్నారు. అభంశుభం తెలియని బాధిత చిన్నారుల నుంచి సమాచారం రాబట్టడం క్లిష్టమైన, సున్నితమైన వ్యవహారమని, ఈ ప్రక్రియ వల్లే కేసు నమోదు ఆలస్యమైందని వివరించారు. ఒక మహిళా అధికారి సహా మొత్తం ముగ్గురు అధికారులు దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారన్నారు. మంత్రి చెప్పినా ససేమిరా.. వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్లాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్‌గార్టెన్ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు.చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్లాపూర్‌లో రైల్ రోకో కారణంగా అంబర్నాథ్–కజ్రట్ మార్గంలో 30 వరకు సబర్బన్ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12దూరప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది. -
నాకు న్యాయం చేయాలి
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించారని అటెండర్ దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని.. లేకుంటే కుటుంబంతో సహా పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు తన భార్య, పిల్లలతో ఏలూరు సర్వజన ఆస్పత్రి వద్ద దుర్గారావు బుధవారం నిరసన తెలిపాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ఉద్యోగాలు ఎలా తీసేస్తారంటూ అధికారులను నిలదీశాడు. తనతోపాటు మరికొందరిని కూడా తొలగిస్తామని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో దుర్గారావు ఔట్సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి ఏలూరు జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే దుర్గారావును విధుల్లోంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి వద్ద నిరసనకు దిగాడు. ఐదు నెలలుగా జీతాలు సైతం ఇవ్వలేదని, అప్పులు తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. ఇప్పుడు తనకు ఉద్యోగం కూడా లేకుంటే అప్పుల వాళ్లు తనను బతకనివ్వరని వాపోయాడు. తనకు ఉద్యోగం కావాలని, జీతం కూడా వెంటనే ఇప్పించాలంటూ పురుగుల మందు, పెట్రోల్‌తో ఆందోళనకు దిగాడు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే తనకు సరైన సమాధానం చెప్పడం లేదన్నాడు. ఈ విషయమై ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంవో ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా.. దుర్గారావుతో మాట్లాడి భరోసా ఇచ్చామన్నారు. రెండు, మూడు రోజుల్లోనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
లీవ్ అడిగిన పాపానికి..
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి లావణ్య, సిబ్బంది నడుమ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. దీంతో అటెండర్ పుష్ప, ల్యాబ్ టెక్నీషియన్ నీరజ మంగళవారం వైద్యాధికారిణి లావణ్యపై శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనారోగ్య కారణాలతో లీవ్ కోసం అటెండర్ పుష్ప విన్నవించుకోగా పట్టించుకోక పోవడంతో తన భర్త ద్వారా టెలిఫోన్లో వైద్యాధికారిణిని మరోమారు విన్నవించే ప్రయత్నం చేశారు. అయితే అటెండర్ పుష్ప వ్యక్తిగత విషయాల గురించి ఆమె భర్తకు వైద్యాధికారిణి లావణ్య చెడుగా చెప్పడంతో కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో మూడు రోజుల క్రితం పుష్ప భర్త, భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఈ విషయమై ఆధారాలతో సహా పోలీసులకు అందజేసి న్యాయం కోసం అటెండర్ పుష్ప ఫిర్యాదు చేసింది. అలాగే హాస్పిటల్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ నీరజతో కూడా దురుసుగా ప్రవర్తించడం, తరచూ విధుల నిర్వహణలో తన పట్ల భేదాభిప్రాయంతో వ్యవహరిస్తోందని, వీరిద్దరూ శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ గౌస్‌పీర్‌ను వివరణ కోరగా పీహెచ్సీ డాక్టర్‌పై రెండు ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఫ్లయిట్ అటెండెంట్‌కు ప్రెసిడెంట్ హోదా
టోక్యో: జపాన్‌కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘జపాన్ ఎయిర్ లైన్స్’అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో రెండో అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్‌గా మాజీ మహిళా ఫ్లయిట్ అటెండెంట్‌ను నియమించింది. ఈమె ఏప్రిల్ ఒకటిన ప్రస్తుత ప్రెసిడెంట్ యూజి అకసావ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత చైర్మన్ యోషిహరు స్థానంలో అకసావ చేరుతారు. 1985లో ఫ్లయిట్ అటెండెంట్‌గా సంస్థలో కెరీర్‌ను ప్రారంభించిన మిట్సుకో టొట్టొరీ 2015లో క్యాబిన్ క్రూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తనకు లభించిన ఉద్యోగోన్నతి ఇతర మహిళలు తమ కెరీర్లో పైకెదిగేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మిట్సుకో చెప్పారు. టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో ఇటీవల జపాన్ ఎయిర్ లైన్స్ విమానం చిన్నపాటి కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొన్న ఘటన నేపథ్యంలో మిట్సుకోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాణికుల భద్రత, సేవల విభాగంలోనే తన కెరీర్లో అత్యధిక భాగం గడిపానని చెప్పారు. ఇకపై కూడా భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్–100 విమానయాన సంస్థల్లో ఉన్నత స్థాయి హోదాల్లో కేవలం 12 మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నట్లు ఫ్లయిట్ గ్లోబల్ వెబ్సైట్ 2022లో చేపట్టిన సర్వేలో తేలింది. -
12 ఏళ్ల రష్యా బాలికపై అఘాయిత్యం
Goa Police has arrested a Room attendant: అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిత్యకృత్యమైపోతున్నాయే తప్ప అంతుపొంతు లేకుండా పోతోంది. ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నిచట్టాలు తీసుకచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. కామాంధులు చిన్నపిల్లలు, పసికందు అనే జాలి దయ లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే గోవాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...నార్త్ గోవాలోని అరాంబోల్లోని హోటల్ రిసార్ట్‌లో 12 ఏళ్ల రష్యన్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ అకృత్యానికి పాల్పడింది ఆ రిసార్ట్‌లో పనిచేస్తున్న రూమ్ బాయ్ అని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందుతుడి రవి లమానిని అతని సొంతూరు కర్ణాటకలోని గడగ్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇన్స్పెక్టర్ విక్రమ్ నాయక్ మాట్లాడుతూ...బాధితురాలి తల్లి తన కుమార్తెను స్విమ్మింగ్ పూల్ వద్ద వదిలి మార్కెట్ నుంచి అవసరమైన వస్తువులు తీసుకురావడానికి వెళ్లినపుడు ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. అని చెప్పారు. (చదవండి: నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్.. షాక్‌లో పేరెంట్స్, వరుడు) -
కరోనా తీవ్రతతో మహిళ.. అంబులెన్స్‌లో అసభ్యకరంగా..
కొచ్చి: కరోనాతో బాధపడుతున్న బాధితులకు తమకు తోచిన విధంగా కొందరు సాయంచేస్తుంటే.. మరికొందరు ఏమీ చేయలేని వారి నిస్సహాయతను అదునుగా తీసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న మహిళతో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంటర్‌కు బాధితురాలిని తరలిస్తుండగా ఆమెపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 27న జరగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరింతలమన పట్టణంలో బాధిత మహిళ ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు తరలించమని వైద్యులు తెలిపారు. ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లో అటెండెంట్‌గా ఉన్న ప్రశాంత్ తనను లైంగికంగా వేధించాడని ఆమె వైద్యులకి తెలిపింది. బాధితురాలు పరిస్థితి అప్పడు తీవ్రంగా ఉన్నందున ఘటన జరిగిన వెంటనే ఈ చర్య గురించి తెలపలేకపోయింది. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం గురువారం (మే 13) వైద్యులకు ఈ విషయం వెల్లడించింది. వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు ప్రశాంత్‌పై పోలీసుల ఫిర్యాదు నమోదు చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ( చదవండి: మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష ) -
ఏపీ–కడప పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అటెండెంట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని కడప వైఎస్ఆర్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ అటెండెంట్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 09 » అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు కడప జిల్లావాసులై ఉండాలి. » వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. » వయసు సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, బీసీ అభ్యర్థులకు 3ఏళ్లు, ఇతరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » దరఖాస్తులకు చివరి తేది: 20.03.2021 » వెబ్సైట్: http://ahd.aponline.gov.in ఎన్ఎండీసీలో జాబ్స్; నోటిఫికేషన్ విడుదల -
‘చెప్పుతో కొడతా.. ఎవరికీ భయపడను’
సాక్షి, గజ్వేల్: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల మహిళా అటెండర్ దురుసుగా ప్రవర్తించిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో చోటుచేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వారిని దూషిస్తూ దాడి దిగింది స్వరూప అనే మహిళా అటెండర్. అక్కడితో ఆగకుండా చెప్పుతో కొడతానని హెచ్చరించింది. ఎవరికి చెపుకుంటారో, చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగింది. తన మాటలను సెల్ఫోన్లో రికార్డు చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా భయపడబోనని హుంకరించింది. ఆమెపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద స్పందించారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పోలీస్ కేసు కాకుండా చూసేందుకు బాధితులను ఆస్పత్రి నుంచి పంపించివేశారు. మీడియాకు ఏమీ తెలపొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మహిళా అటెండర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. -
నరసింహారెడ్డి ఆక్రమాస్తులు 100 కోట్లు
-
నరసింహారెడ్డి @ రూ.కోట్లు..
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఆర్టీఓ కార్యాలయ అటెండర్ నరసింహారెడ్డి ఆస్తులపై అధికారులు రెండోరోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. వీరి సోదాల్లో కిలోల కొద్దీ బంగారం, పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. నరసింహారెడ్డి కుమార్తె లాకర్లో భారీగా బంగారంతో పాటు నగదు నిల్వలను గుర్తించారు. ఇక ఆయన అత్తగారి ఊరు ఆత్మకూరులోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సత్రం సెంటర్లోని నరసింహారెడ్డి అత్తగారి నివాసంలో విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన విషయం విదితమే. వివరాల్లోకి వెళితే...ఆయన రవాణాశాఖలో అటెండర్. పదోన్నతులు వచ్చినా కాదని 34ఏళ్లుగా ఒకేచోట ఆఫీసు సబార్డినేటర్‌గానే విధులు నిర్వహిస్తున్నాడు. ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా సుమారు రూ.100 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడగట్టాడు. మంగళవారం ఈ మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు, కడప, తిరుపతి, విజయవాడ ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నెల్లూరు ఎంవీ అగ్రహారంలోని నరసింహారెడ్డి ఇంటితో పాటు కాపువీధిలోని నరసింహారెడ్డి సోదరుడు నరహరిరెడ్డి, పుత్తా ఎస్టేట్‌లోని మరో సోదరుడు నిరంజన్‌రెడ్డి, రాంజీనగర్‌లోని అతని మామ మురళీమోహన్‌రెడ్డి, ఆత్మకూరులోని బావమరిది వరప్రసాద్‌రెడ్డి, ఏజెంట్ బి.ప్రసాద్ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనంతరం ఏబీసీ అధికారులు డీటీసీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు కాపువీధి (ప్రస్తుతం ఎంవీ అగ్రహారం భార్గవినగర్)కి చెందిన కరాదు నరసింహారెడ్డి 1984లో రవాణాశాఖలో అటెండర్ (ఆఫీసు సబార్డినేటర్)గా విధుల్లో చేరారు. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో చేరిన నాటినుంచి ఉన్నతాధికారులకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి ఉద్యోగోన్నతి లభించినా.. వద్దని 34 ఏళ్లుగా ఆఫీసు సబార్డినేటర్‌గానే విధుల్లో కొనసాగుతున్నాడు. అక్రమ సంపాదనతో తనపేరున, తన భార్య, బంధువుల పేర్లపై పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, భూములు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేశారు. భారీగా అక్రమ ఆస్తుల గుర్తింపు ఏసీబీ అధికారుల సోదాల్లో నరసింహారెడ్డి, అతని భార్య హరిప్రియ పేరుపై 18 ఇళ్లస్థలాలు, ఎంవీ అగ్రహారంలో జీప్లస్–2 ఇళ్లు, నరసింహారెడ్డి పేరుపై నెల్లూరు రూరల్ మండలం గుండ్లపాళెంలో 3.95 ఎకరాల వ్యవసాయ భూమి, అతని భార్య పేరుపై గుండ్లపాళెంలో 12.39 ఎకరాలు, సంగం మండలం పెరమనలో 35ఎకరాల వ్యవసాయభూమి, నరసింహారెడ్డి అత్త నారాయణమ్మ పేరుపై కొంత భూమికి సంబంధించి (మొత్తం 50.36 ఎకరాల వ్యవసాయ భూమి) డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల బంగారు, 7.5 కిలోల వెండి ఆభరణాలు, రూ.7.75 లక్షల నగదు, రూ.1.01కోట్ల ఎల్ఐసీ డిపాజిట్లకు చెందిన బాండ్లు, రూ.10లక్షలు ఎల్ఐసీ పాలసీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌లో రూ.20 లక్షల నగదు, రూ.5లక్షలు విలువ చేసే గృహోపకరణాలు, రెండు యూనికాన్ బైక్‌లను గుర్తించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.10 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.100కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో నరసింహారెడ్డి అతడి భార్య, కుమార్తె పేర్లపై రెండు లాకర్లు ఉన్నాయి. వాటిల్లో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే మంగళవారం బ్యాంక్‌కు సెలవు కావడంతో బుధవారం వాటిని తెరవనున్నారు. ఉదయం 8.30 గంటలక ప్రారంభమైన సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. నరసింహారెడ్డిని అధికారులు విచారిస్తున్నారు. ఈ సోదాల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శివకుమార్‌రెడ్డి, శ్రీహరిరావు, సుదర్శన్‌రెడ్డి, రమేష్, రాఘవరావు, ప్రసాద్‌రెడ్డి, గిరిధర్ పాల్గొన్నారు. -
చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
బెంగళూరు: బెంగళూరులోని ఒక పాఠశాలలో మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన సంఘటనలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల వ్యక్తిని విచారిస్తున్నారు.పాఠశాల యాజమాన్యంపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నగరంలో జాలహళ్లి మెయిన్ రోడ్డులో ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. బాలిక జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లి బాలికను విచారించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించింది. చిన్నారిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థుల తల్లిడండ్రుల పాఠశాల వద్ద ధర్నా నిర్వహించిన నిందితుడి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల పాఠశాల సిబ్బందిని విచారించి నిందితుడిని అరెస్ట్ చేశారు.