నెల్లూరు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఆర్టీఓ కార్యాలయ అటెండర్ నరసింహారెడ్డి ఆస్తులపై అధికారులు రెండోరోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. వీరి సోదాల్లో కిలోల కొద్దీ బంగారం, పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. నరసింహారెడ్డి కుమార్తె లాకర్‌లో భారీగా బంగారంతో పాటు నగదు నిల్వలను గుర్తించారు. ఇక ఆయన అత్తగారి ఊరు ఆత్మకూరులోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సత్రం సెంటర్‌లోని నరసింహారెడ్డి అత్తగారి నివాసంలో విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రూ.100కోట్లకు పైగా ఆస్తులను గుర్తించిన విషయం విదితమే.