Japan Airlines
-
జపాన్ ఎయిర్‌లైన్స్‌తో ఇండిగో కోడ్‌షేర్ ఒప్పందం
ముంబై: జపాన్ ఎయిర్‌లైన్స్‌తో (జేఏఎల్) కోడ్‌షేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. ఇండిగో నెట్‌వర్క్‌లోని 14 ప్రాంతాలకు జేఏఎల్ సేవలు విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అది టోక్యో నుంచి ఢిల్లీ, బెంగళూరుకు ఫ్లయిట్ సరీ్వసులు అందిస్తోంది. ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పెద్ద నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, అమృత్సర్, కొచ్చి, కోయంబత్తూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, పుణె, లక్నో, వారణాసి తదితర ప్రాంతాలకు సరీ్వసులు విస్తరించేందుకు వీలవుతుంది. తదుపరి జేఏఎల్ నెట్వర్క్ రూట్లలో తమ సేవలు విస్తరించేందుకు ఇండిగో కోడ్õÙర్ కుదుర్చుకోనుంది. -
ఫ్లయిట్ అటెండెంట్‌కు ప్రెసిడెంట్ హోదా
టోక్యో: జపాన్‌కు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘జపాన్ ఎయిర్ లైన్స్’అరుదైన నిర్ణయం తీసుకుంది. సంస్థలో రెండో అత్యున్నత స్థాయి హోదా అయిన ప్రెసిడెంట్‌గా మాజీ మహిళా ఫ్లయిట్ అటెండెంట్‌ను నియమించింది. ఈమె ఏప్రిల్ ఒకటిన ప్రస్తుత ప్రెసిడెంట్ యూజి అకసావ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత చైర్మన్ యోషిహరు స్థానంలో అకసావ చేరుతారు. 1985లో ఫ్లయిట్ అటెండెంట్‌గా సంస్థలో కెరీర్‌ను ప్రారంభించిన మిట్సుకో టొట్టొరీ 2015లో క్యాబిన్ క్రూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తనకు లభించిన ఉద్యోగోన్నతి ఇతర మహిళలు తమ కెరీర్లో పైకెదిగేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని మిట్సుకో చెప్పారు. టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టులో ఇటీవల జపాన్ ఎయిర్ లైన్స్ విమానం చిన్నపాటి కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొన్న ఘటన నేపథ్యంలో మిట్సుకోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాణికుల భద్రత, సేవల విభాగంలోనే తన కెరీర్లో అత్యధిక భాగం గడిపానని చెప్పారు. ఇకపై కూడా భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని టాప్–100 విమానయాన సంస్థల్లో ఉన్నత స్థాయి హోదాల్లో కేవలం 12 మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నట్లు ఫ్లయిట్ గ్లోబల్ వెబ్సైట్ 2022లో చేపట్టిన సర్వేలో తేలింది. -
త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం
టోక్యో: అమెరికాలో విమానం మార్గమధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరువకముందే దాదాపు అలాంటి ఘటనే జపాన్‌లో జరిగింది. కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. జపాన్‌లోని సప్పోరో నగరంలోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ బోయింగ్ 737–800 రకం విమానం సప్పోరో నుంచి టొయామాకు బయల్దేరింది. మార్గమధ్యంలో కాక్‌పిట్ కిటికీలో పగుళ్లను గుర్తించారు. పైలెట్లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో మళ్లీ అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. -
మంటల్లో విమానం!
టోక్యో: తీవ్ర భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం చోటుచేసుకోవడంతో పెనువిషాదంలో మునిగిపోయిన జపాన్‌లో మరో దుర్ఘటన జరిగింది. భూకంప బాధితుల కోసం సహాయక సామగ్రిని చేరవేయాల్సిన విమానం ప్రమాదంలో చిక్కుకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయం రన్‌వేపై ల్యాండ్ అవుతున్న విమానం మరో విమానాన్ని ఢీకొట్టింది. మొదటి విమానంలో ఉన్న 379 మంది క్షేమంగా ప్రాణాలతో బయటపడడంతో ఊరటనిచ్చింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా ఊహించని ఉత్పాతమే జరిగేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్టు జపాన్‌లో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. నూతన సంవత్సరం సెలవుల సందర్భంగా ప్రయాణికుల రాకపోకలతో మంగళవారం మరింత రద్దీగా మారింది. హొక్కైడోలోని షిన్ చిటోస్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం జేఏఎల్–516(ఎయిర్‌బస్ ఏ–350) హనెడా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇందులో 12 మంది సిబ్బంది సహా మొత్తం 379 మంది ఉన్నారు. రన్‌వేపై దిగుతూ కుదుపులకు లోనైంది. రన్‌వేపై ల్యాండ్ అవుతూ, ఒక పక్కగా నిలిపి ఉన్న జపాన్ తీర రక్షక దళానికి చెందిన విమానం ఎంఏ–722ను అనూహ్యంగా ఢీకొట్టి కొద్దిదూరం దూసుకెళ్లి ఆగిపోయింది. క్షణాల వ్యవధిలోనే జేఏఎల్ విమానం రెక్క భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే తలుపులు తెరిచి ప్రయాణికులకు బయటకు పంపించారు. మంటలు వేగంగా దూసుకొస్తున్నా లెక్కచేయకుండా ప్రయాణికులంతా బయటకు వచ్చారు. తర్వాత విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పొగతో నిండిపోయింది. అగి్నమాపక సిబ్బంది మంటలను అర్పివేశారు. విమానం నుంచి ప్రయాణికులను భద్రంగా బయటకు పంపించిన అందులోని సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహారించాలన్న దానిపై వారికి శిక్షణ ఇచి్చనట్లు అధికారులు చెప్పారు. ‘సాయం’ అందించకుండానే... ప్రమాదం జరిగిన వెంటనే తీర రక్షక దళం విమానం పైలట్ అక్కడి నుంచి పరారయ్యాడని జపాన్ కోస్ట్‌గార్డు అధికారులు చెప్పారు. ఈ విమానంలో ఉన్న ఆరుగురు కోస్ట్‌గార్డు సిబ్బందిలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. కోస్ట్‌గార్డు విమానం సహాయక సామగ్రితో జపాన్ పశి్చమ తీరంలోని నిగాటాకు బయలుదేరాల్సి ఉంది. కానీ అక్కడి భూకంప బాధితులకు సామగ్రిని అందించకుండానే ప్రమాదం జరగడం, ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోంది. ఊపిరాడక నరకంలా అనిపించింది జేఏఎల్–516 విమానంలో తనకు ఎదురైన భయానక అనుభవాన్ని 17 ఏళ్ల స్వీడి ఆంటోన్ డీబె మీడియాతో పంచుకున్నాడు. తొలుత ఏం జరిగిందో అర్థం కాలేదని, విమానం లోపలంతా దట్టమైన పొగ కమ్ముకుందని, ఊపిరాడక నరకంలా అనిపించిందని చెప్పాడు. సీట్లలో నుంచి కిందపడిపోయామని, ఎవరో ఎమర్జెన్సీ డోర్లు తెరవడంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపాడు. -
ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. అయిదుగురి మృతి
జపాన్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు.. హోకియాడో నుంచి వస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మంటలు వ్యాపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానంలోని 379 ప్రయాణికులు, 12 మంది సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi — アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమానం రన్‌వేపై దిగుతుండగానే దాని చక్రాల నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. దాదాపు 70 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. JAL plane on fire at Tokyo Airport pic.twitter.com/EL9s7kVJbi— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024 ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు కానీ.. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీ కొనడం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కోస్ట్‌గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా.. వారిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటన అనంతరం హనెడా విమానాశ్రాయాన్ని పూర్తిగా మూసివేసినట్లు చెప్పారు. -
జపాన్ విమానాల్లో కొత్త ఫీచర్
టోక్యో : మనం బస్సులోగానీ రైళ్లోగానీ ప్రయాణిస్తున్నప్పుడు పక్క సీట్లోని బేబీ ఏడ్చినా, అల్లరి చేసినా మనకు చికాగు వేస్తుంది. ఒక్కోసారి ఏమిటీ నరకం అని కూడా అనిపిస్తుంది. అలాంటి అనుభవం విమానంలోనే ఎదురైతే విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది అస్సలు తట్టుకోరు. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని కోరుకునే వారి కోసం జపాన్ ఎయిర్ లైన్స్ (జేఏఎల్) టిక్కెట్ల రిజర్వేషన్ బుకింగ్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. టిక్కెట్ బుకింగ్ అప్పుడు రెండేళ్ల లోపు పిల్లలు ఏ వరుసలో, ఏ సీటులో కూర్చున్నారో తెలియజేస్తూ ఓ పిల్లల ఐకాన్ కనిపిస్తుంది. దాంతో ఆ సీటును వదిలేసి ఖాళిగా ఉన్న సీట్లలో మనం ఎక్కడ కూర్చోవాలో ముందుగానే నిర్ణయించుకొని టిక్కెట్ బుక్‌చేసుకోవచ్చు. అందుకు ‘సీట్ అరెంజ్మెంట్’ చార్ట్ ఉపయోగపడుతుంది. అలాగే ఎనిమిది రోజుల బేబీ నుంచి రెండేళ్ల లోపు బేబీలను తీసుకొచ్చే ప్రయాణికులు కూడా ‘బేబీ ఐకాన్’ చూపిన సీటునే ముందుగా బుక్ చేసుకోవాలి. పిల్లలను తీసుకొచ్చిన వారికి మాత్రం తలనొప్పులు తప్పవు. ఈ ఫీచర్ గురించి తెలుసుకున్న ప్రయాణికులు మాత్రం ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
ప్రయాణికులకు అసౌకర్యం..భారీ జరిమానా!
వాషింగ్టన్ : ప్రయాణికులను నాలుగు గంటల పాటు అసౌకర్యానికి గురి చేశారంటూ అమెరికా ప్రభుత్వం జపాన్ ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా విధించింది. రెండు పర్యాయాలు ప్రయాణికులను వేచి చూసేలా చేసినందుకు 3 లక్షల డాలర్లు(దాదాపు రూ. 21 కోట్లు) చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 4న టోక్యో నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగోలో ల్యాండ్ అయ్యింది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ స్టాఫ్ సహా ప్రయాణికులు నాలుగు గంటలకు పైగా అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అదే విధంగా మే 15న టోక్యో-న్యూయార్క్ విమానంలో ఇంధనం నింపే కారణంతో... దానిని వాషింగ్టన్‌లోని డ్యూలెస్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. దీంతో తీవ్ర ఇబ్బందికి గురైన ప్రయాణికులు..దాదాపు ఐదు గంటలు ఎదురు చూసిన తర్వాత గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అమెరికా ప్రభుత్వం జపాన్ ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రవాణా శాఖతో ఉన్న ఒప్పందం ప్రకారం జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో జరిమానాలోని 60 వేల డాలర్లను ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు పరిహారంగా చెల్లించనుంది. అదే విధంగా ఇలాంటి తప్పిదాలు ఏడాదిపాటు పునరావృతం చేయకుండా ఉంటే లక్షా ఇరవై ఒక్క వేల డాలర్లు మాఫీగా ఎయిర్‌లైన్స్ తిరిగి పొందనుంది. కాగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని దారి మళ్లించామే గానీ..ఉద్దేశపూర్వకంగా వారిని అసౌకర్యానికి గురిచేయలేదని జపాన్ ఎయిర్‌లైన్స్ వివరణ ఇచ్చింది. -
టేకాఫ్‌కు కొన్ని నిముషాల ముందు..
లండన్ : లండన్ ఎయిర్‌పోర్టులో గురువారం కలకలం రేగింది. ఆల్కాహాల్ సేవించాడంటూ జపాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమాన పైలట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్ టేకాఫ్‌కు కొద్ది నిముషాల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం అలజడి సష్టించింది. కఠిన నియమాలు, నిబంధనలకు పెట్టింది పేరైన జపాన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు చేపడతామనీ, పైలట్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. వివరాలు.. బోయింగ్ 777 విమానం (ఫ్లైట్ నెంబర్ జేఎల్ 44) గురువారం ఉదయం 244 మంది ప్రయాణికులతో లండన్ నుంచి టోక్యో బయలుదేరాల్సి ఉంది. అయితే, విమాన పైలట్ కత్సుతోషి జిత్సుక్వా (42) శరీరంలో ఆల్కాహాల్ శాతం మోతాదుకు మించి ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. జిత్సుక్వా గత రాత్రి అతిగా మద్యం సేవించడంతో అతని శరీరంలో ఆల్కాహాల్ శాతం పరిమితికి ఉందని తెలిపారు. పైలట్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నామని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది వెల్లడించారు. నిబంధనల ప్రకారం పైలట్ శరీరంలో 100 మిల్లీ లీటర్ల రక్తానికి 80 మిల్లీ గ్రాముల ఆల్కాహాల్ వరకు ఉండొచ్చు. కానీ, జిత్సుక్వా శరీరంలో అది 189 మిల్లీ గ్రాములుగా నమోదైందని పేర్కొన్నారు. నిందితున్ని నవంబర్ 29 న కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. కాగా, ఈ ఉదంతంతో విమానం గంటపాటు నిలిచిపోయింది. అనంతరం మిగతా ఇద్దరు పైలట్లతో టోక్యోకు బయలు దేరింది. -
వనరులున్నాయి... నైపుణ్యం కావాలి
టోక్యో సెమినార్లో ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చాలా వనరులున్నాయని, అక్కడి వారికి జపాన్ సంస్థలు నైపుణ్యం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం బృందం శుక్రవారం జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో), జపాన్-ఇండియా బిజినెస్ కో-ఆపరేషన్ కమిటీ (జెఐబీసీసీ) తదితర సంస్థలు నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. ఏపీలో సహజ వనరులున్నాయని, వాటికి జపాన్ నైపుణ్యాలు తోడైతే అద్భుతాలు సృష్టించగలమని తెలిపారు. ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీలలో జపనీస్ భాష కోర్సులను ప్రవేశపెడతామన్నారు. జపాన్‌లో భారత రాయబారి దీపా గోపాలన్ వాద్వా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై సీఎం చిత్తశుద్ధిని జపాన్‌లో ఆయన బృందం షెడ్యూల్ స్పష్టం చేస్తుందన్నారు. జెట్రో అధ్యక్షుడు హిరోషి సుకమోటో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రగతి భావాలున్న సీఎం అని ప్రశంసిం చారు. జేఐబీసీసీ స్టాండింగ్ కమిటీ ఇన్‌ఛార్జి మునియె ఓ కరేచి మాట్లాడుతూ శ్రీసిటీకి జపాన్ కంపెనీల ద్వారానే ప్రాచుర్యం లభించిందన్నా రు. టోక్యోలో విలేకరులతో మాట్లాడిన బాబు తన పర్యటన విశేషాలు వివరించారు. పలు సంస్థల ప్రతినిధులతో భేటీ చంద్రబాబు బృందం శుక్రవారం జపాన్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ బృందం తొలుత ఇసెకీ కంపెనీని సందర్శిం చింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలపై ఇసెకీ ఎండీ యుకి టయోడా వివరించారు. తమ సంస్థ ఒక్కో యూనిట్‌ను స్థాపించేందుకు 40 మిలియన్ డాలర్లు (సుమా రు రూ.240 కోట్లు) ఖర్చవుతుందని తెలిపారు. ఎస్ఎంబీసీ పెట్టుబడుల సలహాదారు ఫ్యుమి యో హోషితో బాబు బృందం సమావేశమైంది. ఏపీలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని యూనిక్లో చైర్మన్ యదషహి యనయ్ను కోరారు. వైద్య పరికరాల తయారీ కేంద్రాలను నెలకొల్పాలని తోషిబా సీఈవో హిసావో తనాకాను బాబు కోరారు. పరిశీలిస్తామని హిసావో చెప్పారు. ఓడరేవుల్లో పెట్టుబడులు: హిటాచీ చంద్రబాబు బృందం హిటాచీ కంపెనీ ఉపాధ్యక్షుడు అకిరా షిమిజుతో కూడా భేటీ అయింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ముఖ్యంగా ఓడరేవుల్లో పెట్టుబడులు పెట్టేం దుకు ఆసక్తిగా ఉన్నట్లు షిమిజు తెలిపారు. తమకు మంచి ప్రోత్సాహకాలతో పాటు అనుసంధానం కావాలని కోరారు. హిటాచీ స్మార్ట్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జి అకికో టోబీతో కూడా ఈ బృందం భేటీ అయ్యింది. స్మార్ట్ సిటీల నిర్మాణంలో తమ అనుభవాలను టోబీ వివరించారు. సోలార్ పవర్ ప్రాజెక్టులు స్థాపించాలి ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులను నెలకొల్పాలని సాప్ట్ బ్యాంక్ చైర్మన్ మసా యోషీ సన్ను చంద్రబాబు కోరారు. ఏపీలో కూడా సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తామని యోషీ సన్ చెప్పారు. బాబు వెంట ఆయన తీసుకెళ్లిన ప్రజాప్రతినిధుల, అధికారుల బృందం కూడా ఉంది.