జపాన్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని టోక్యోలోని ఓ ఎయిర్‌పోర్టు రన్‌వేపైని విమానంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. వివరాలు.. హోకియాడో నుంచి వస్తున్న జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన JAL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనెడా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా మంటలు వ్యాపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానంలోని 379 ప్రయాణికులు, 12 మంది సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు.
JAL plane on fire at Tokyo Airport
— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024
pic.twitter.com/EL9s7kVJbi
అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విమానం రన్‌వేపై దిగుతుండగానే దాని చక్రాల నుంచి మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. దాదాపు 70 ఫైర్ ఇంజిన్‌లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
JAL plane on fire at Tokyo Airport
pic.twitter.com/EL9s7kVJbi— アトリン ✊🏾 (@phoojux) January 2, 2024
ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదు కానీ.. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీ కొనడం వల్లే ఈ ఘటన జరిగినట్లు విమానాశ్రయ అధికారులు జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కేకు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కోస్ట్‌గార్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉండగా.. వారిలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటన అనంతరం హనెడా విమానాశ్రాయాన్ని పూర్తిగా మూసివేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment