టోక్యో : మనం బస్సులోగానీ రైళ్లోగానీ ప్రయాణిస్తున్నప్పుడు పక్క సీట్లోని బేబీ ఏడ్చినా, అల్లరి చేసినా మనకు చికాగు వేస్తుంది. ఒక్కోసారి ఏమిటీ నరకం అని కూడా అనిపిస్తుంది. అలాంటి అనుభవం విమానంలోనే ఎదురైతే విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది అస్సలు తట్టుకోరు. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని కోరుకునే వారి కోసం జపాన్ ఎయిర్ లైన్స్ (జేఏఎల్) టిక్కెట్ల రిజర్వేషన్ బుకింగ్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. టిక్కెట్ బుకింగ్ అప్పుడు రెండేళ్ల లోపు పిల్లలు ఏ వరుసలో, ఏ సీటులో కూర్చున్నారో తెలియజేస్తూ ఓ పిల్లల ఐకాన్ కనిపిస్తుంది. దాంతో ఆ సీటును వదిలేసి ఖాళిగా ఉన్న సీట్లలో మనం ఎక్కడ కూర్చోవాలో ముందుగానే నిర్ణయించుకొని టిక్కెట్ బుక్‌చేసుకోవచ్చు. అందుకు ‘సీట్ అరెంజ్‌మెంట్’ చార్ట్ ఉపయోగపడుతుంది.
అలాగే ఎనిమిది రోజుల బేబీ నుంచి రెండేళ్ల లోపు బేబీలను తీసుకొచ్చే ప్రయాణికులు కూడా ‘బేబీ ఐకాన్’ చూపిన సీటునే ముందుగా బుక్ చేసుకోవాలి. పిల్లలను తీసుకొచ్చిన వారికి మాత్రం తలనొప్పులు తప్పవు. ఈ ఫీచర్ గురించి తెలుసుకున్న ప్రయాణికులు మాత్రం ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment