
ముంబై: జపాన్ ఎయిర్‌లైన్స్‌తో (జేఏఎల్) కోడ్‌షేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. ఇండిగో నెట్‌వర్క్‌లోని 14 ప్రాంతాలకు జేఏఎల్ సేవలు విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది. జపాన్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం అది టోక్యో నుంచి ఢిల్లీ, బెంగళూరుకు ఫ్లయిట్ సరీ్వసులు అందిస్తోంది.
ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పెద్ద నగరాలైన హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, అమృత్‌సర్, కొచ్చి, కోయంబత్తూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, పుణె, లక్నో, వారణాసి తదితర ప్రాంతాలకు సరీ్వసులు విస్తరించేందుకు వీలవుతుంది. తదుపరి జేఏఎల్ నెట్‌వర్క్ రూట్లలో తమ సేవలు విస్తరించేందుకు ఇండిగో కోడ్õÙర్ కుదుర్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment