
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్టర్ తాజాగా హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు అనువైన, వినూత్న నానోకణాల రూపకల్పనపై పరిశోధన, వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా ఆవిష్కరణలను చేపడతామని బయోఫ్యాక్టర్ సీఈఓ ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు.
పంట ఉత్పాదకత, కచ్చిత పోషకాల పంపిణీ, పర్యావరణ అనుకూల నానోపెస్టిసైడ్స్‌ను మెరుగుపరచడం, రసాయనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ భాగస్వామ్య లక్ష్యం అని చెప్పారు. తక్కువ ఖర్చుతో, అధిక దిగుబడినిచ్చే పరిష్కారాలతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామన్నారు.